NTR: క్రికెట్ చూడక పోవడానికి గల కారణం ఆయనే ఎమోషనల్ అయిన ఎన్టీఆర్..!!

Share

NTR: దివంగత నందమూరి హరికృష్ణ జయంతి ఈరోజు. ఆయన మరణించి మూడు సంవత్సరాలు కావడంతో ఇప్పటికి కూడా నందమూరి అభిమానులు ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. తండ్రి ఎన్టీఆర్ రాజకీయ ప్రస్థానం లో.. ముందుండి కీలకంగా రాణించిన హరికృష్ణ… తెలుగు వారి హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్నారు. ఈక్రమంలో ఆయన జయంతి సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ తండ్రి హరిక్రిష్ణ గుర్తుచేసుకున్నారు. ఆయన ఉన్నంత కాలం ఆయన చాటు బిడ్డగా ఎన్టీఆర్ సినిమాల్లో తనదైన శైలిలో రాణిస్తూ పెద్దల దగ్గర చాలా వినమ్రంగా ఉండేవారు. పెద్ద పెద్ద ఫంక్షన్ లలో చాలా వరకు తండ్రి చాటు బిడ్డగా హరికృష్ణ వెనకాలే ఎన్టీఆర్ కనిపించేవారు. తన సినిమాలకు సంబంధించి ఆడియో ఫంక్షన్లలో ఇంకా వివిధ ప్రమోషన్ కార్యక్రమాలలో తండ్రిని పిలిపించుకుని ఆయనను గొప్పగా పొగుడుతూ.. తండ్రి పై అభిమానాన్ని అభిమానులకు తెలియజేస్తూ ఉండేవారు.

Jr NTR at Kalyan Ram's ISM Audio launch - Photos,Images,Gallery - 49989

అటువంటిది “అరవింద సమేత వీర రాఘవ” సినిమా టైంలో.. హరికృష్ణ లేకపోవటాన్ని జీర్ణించుకోలేక స్టేజీపైనే.. ఎన్టీఆర్ వెక్కివెక్కి ఏడ్చారు. అదే సమయంలో పక్కన అన్న కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ని.. ఓదార్చడం జరిగింది. ఇదిలా ఉంటే ఈ రోజు హరికృష్ణ పుట్టినరోజు కావడంతో ఆయనతో ఉన్న జ్ఞాపకాలను ఎన్టీఆర్ అభిమానులతో పంచుకున్నారు. తనకు చిన్ననాటి నుండి క్రికెట్ అంటే చాలా ఇష్టమని… స్కూల్ ఎగ్గొట్టి మరీ.. క్రికెట్ మ్యాచ్ ఉంటే ఇంట్లో ఉండే వాడిని.. అటువంటిది తనకు క్రికెట్ పై అసహ్యం కలిగించేలా.. క్రికెట్ చూసే అలవాటు మాన్పించడానికి తన తండ్రి హరికృష్ణ చేసిన చిన్న ప్రయోగం గురించి అభిమానులతో పంచుకున్నారు. మేటర్ లోకి వెళ్తే అప్పట్లో ఓడిపోయిన మ్యాచులు.. వాటికి సంబంధించిన విసిఆర్ లు తీసుకొచ్చి.. తన తండ్రి హరికృష్ణ చూపించేవాడని, ప్రతి మ్యాచ్ రెండు సార్లు చూడటం వల్ల క్రికెట్ పై అప్పుడే అసహ్యం కలిగిందని పేర్కొన్నారు. ఈ విధంగా  తన పై కొట్టకుండ.. తిట్టకుండా క్రికెట్ చూడటం  తన తండ్రి మాన్పించడం జరిగింది అని ఎన్టీఆర్ తెలిపారు.

 

ఇంకా ఆ దెబ్బతో అప్పటి టైం నుండి ఇప్పటి వరకు క్రికెట్ అంటే పెద్దగా ఆసక్తి లేకుండా పోయింది అని ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు. ఇప్పటికీ కూడా క్రికెట్ చూడడానికి ఆసక్తి లేదంటున్నాడు. ఇలాంటి ఎన్నో మధురమైన జ్ఞాపకాలు తన తండ్రి హరికృష్ణ తమ దగ్గర వదిలేసి వెళ్ళిపోయాడని ఎన్టీఆర్ ఎమోషనల్ అయ్యాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో RRR, ఆ తర్వాత కొరటాల, త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమాలు చేయనున్నారు. అంతమాత్రమే కాకుండా కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. దర్శకత్వంలో కూడా సినిమా లైన్ లో పెట్టారు ఎన్టీఆర్. దాదాపు నలుగురు టాప్ మోస్ట్ డైరెక్టర్లను.. ఎన్టీఆర్ లైన్ లో పెట్టడం తో.. ఎన్టీఆర్ కెరీర్ ప్లానింగ్ అదుర్స్ అని ఫ్యాన్స్ అంటున్నారు.


Share

Related posts

YCP vs TDP; వైసీపీ ఫిర్యాదుకు టీడీపీ కౌంటర్..! బలేగుంది రాజకీయం..!!

somaraju sharma

ప్రతీ ఎయిర్ పోర్ట్ లో రెండో ప్రశ్న అతని గురించే వస్తుంది అంటున్న మోనాల్..!!

sekhar

Job Notification: సింగరేణిలో 1146 ఖాళీలు..!!

bharani jella