Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టక ముందు.. క్వారంటైన్ లో షణ్ముక్ జశ్వంత్ చేసిన రిక్వెస్ట్ ఇదే..!!

Share

Bigg Boss 5 Telugu: తెలుగు టెలివిజన్ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ సీజన్ ఫైవ్ స్టార్ట్ అయ్యి 3 రోజులు అయిన సంగతి తెలిసిందే. ఈరోజు మరికొద్ది గంటల్లో నాలుగో ఎపిసోడ్ ప్రారంభం కానుంది. పెద్దగా హడావుడి లేకుండా మొదటిరోజు దాదాపు 19 మందినీ హౌస్ లోకి వదిలారు బిగ్ బాస్. అదే సమయంలో 24 గంటలు గడవకముందే.. రెండో రోజు ఎపిసోడ్ లో… ఎలిమినేషన్ కి సంబంధించి నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ చేసి… ఇంటి సభ్యుల కు ఊహించని షాక్ ఇచ్చిన బిగ్ బాస్.. వారి మధ్య కొత్త వాతావరణాన్ని క్రియేట్ చేయడం జరిగింది. దీంతో ఇప్పుడు హౌస్ లో సరికొత్త వాతావరణం నెలకొంది. మూడు రోజులలోనే భారీగా గొడవలు కావటం మాత్రమే కాక.. స్మోక్ జోన్లో అప్పుడే పంచాయతీలు… ఏడుపులు.. పబ్లిసిటీ స్టంట్ లు .. సెంటిమెంట్ గేమ్స్ అప్పుడే హౌస్ లో స్టార్ట్ అయిపోయాయి అని బిగ్ బాస్ ఆడియన్స్ మరియు సోషల్ మీడియాలో నెటిజన్లు అంటున్నారు. పరిస్థితి ఇలా ఉండగా హౌస్ లో ఎంట్రీ ఇచ్చిన వారిలో యూట్యూబ్ స్టార్ షణ్ముక్ జశ్వంత్ కూడా ఉన్నారన్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో భారీ క్రేజ్ ఉన్న వారిలో ఇతను ఒకడు.

Bigg Boss 5 Telugu: Entry With A Definite Plan .. Shanmukh Who Gave Such A  Hint

అయితే తాజాగా షణ్ముక్ జశ్వంత్.. బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టక ముందు.. క్వారంటైన్ లో ఉన్న టైంలో.. చేసిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విషయంలోకి వెళితే..షణ్ముక్ జశ్వంత్.. హౌస్ లో అడుగు పెట్టక ముందు .. బిగ్ బాస్ ఆడియన్స్కి రిక్వెస్ట్ చేయడం జరిగింది. షణ్ముక్ జశ్వంత్ ఈ వీడియోలో ఏమన్నాడంటే…”‘ఈ వీడియో మీరు చూసే సమయానికి మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఓ కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నాను అని. మీ సపోర్ట్, మీ ఓపిక కూడా కోరుకుంటున్నాను. నా గురించి నాకే సరిగ్గా తెలియదు.. అది తెలుసుకోవడానికే వెళ్తున్నాను. నేను ఈ స్థాయికి రావడానికి నాకు ఎవ్వరూ సపోర్ట్ చేయలేదు .. చాలా తక్కువ మంది సపోర్ట్ చేశారు. అది గుర్తుపెట్టుకుని నా మీద ట్రోల్స్ కానీ ఫేక్ న్యూస్ గానీ వేయండి. నా వీడియోలు బాగా లేకపోతే కామెంట్ చేశారు.. అది చూసి నేను ఇంకా నేర్చుకున్నాను. ఎక్కువగా జడ్జ్ చేయకుండా నార్మల్‌గా చూస్తారని అనుకుంటున్నాను. నేను పెద్ద సెలెబ్రిటీని కాదు.. అస్సలు కాదు.. నాకు అంత లేదు.. ఈ జర్నీలో పార్ట్ అవుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది.. బయటకు వచ్చాక అందరితో మాట్లాడాతను.. ఐ లవ్యూ ఆల్” అంటూ  తనని సపోర్ట్ చేయాలి అన్న తరహాలో కోరాడు.

 

ప్రస్తుతం హౌస్లో మనవడు ఆడుతున్న తీరు చూస్తే.. అందరితో కలవలేను అన్న తరహాలో.. ఓ మూలకు కూర్చుంటూ సైలెంట్ గా అంత అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. గతంలో స్టార్టింగ్లో అభి మాదిరిగానే షణ్ముక్ జశ్వంత్.. వ్యవహరిస్తున్నాడు. దీంతో రాను రాను ఇదే ఆట కొనసాగితే మనవడు ఇంట్లో నుండి బయటకు వచ్చేయడం గ్యారెంటీ అని యాక్టివ్ గా ఉంటే.. హౌస్ లో మంచి పొజిషన్ లోకి వెళ్ళే అవకాశం ఉంటుందని నెటిజన్లు పేర్కొంటున్నారు. సాఫ్ట్వేర్ డెవలపర్ వెబ్ సిరీస్ తో తనకంటూ సెపరేట్ ఇమేజ్ సోషల్ మీడియాలో క్రియేట్ చేసుకున్న షణ్ముక్ కి.. బయట ప్రస్తుతం భారీగానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ నేపథ్యంలో.. హౌస్ లో వెళ్లకముందు.. అందరినీ రిక్వెస్ట్ చేస్తూ షణ్ముక్ జశ్వంత్ చేసిన వీడియో.. ఇప్పుడు వైరల్ గా మారింది.


Share

Related posts

జీలకర్ర నీళ్లు తాగితే బరువు తగ్గడం వెనుక ఉన్న నిజం ఏమిటి??

siddhu

Gold Price Today : పసిడి ప్రియులకు శుభవార్త..!! ఈరోజు బంగారం, వెండి ధరలు..!

bharani jella

HBD Manisharma: మణిశర్మ బర్త్ డే స్పెషల్ నారప్ప సినిమా ఫస్ట్ సాంగ్ విడుదల..!!

bharani jella