న్యూస్

SVP: “సర్కారు వారి పాట”లో ఆ సాంగ్ మాత్రం యూట్యూబ్ లో .. అంటున్న మహేష్..!!

Share

SVP: దాదాపు మూడు సంవత్సరాల తర్వాత మహేష్ బాబు నటించిన సినిమా థియేటర్ లో రిలీజ్ నేపథ్యంలో అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. సర్కారు వారి పాట విడుదలవుతున్న ధియేటర్ల వద్ద… భారీ కటౌట్లు పెడుతూ నానా హంగామా సృష్టిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో ఇప్పటికే టికెట్ రేట్లను పెంచుకోవటానికి ప్రభుత్వాలు ఓకే చేయడం తెలిసిందే. దీంతో ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ లో టికెట్ లు హాట్ కేకుల అమ్ముడుపోయాయి. మరి కొద్ది గంటల్లో సినిమా స్క్రీన్ మీద పడుతున్నా నేపథ్యంలో.. సినిమా యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను మరింత స్పీడ్ గా చేస్తోంది.

The song in Sarkaru Vari Pata is only on YouTube .. says Mahesh

ఇటువంటి తరుణంలో ప్రముఖ టీవీ న్యూస్ ఛానల్స్ కి మహేష్ వరుసపెట్టి ఇంటర్వ్యూలు ఇస్తూనే ఉన్నారు. దీనిలో భాగంగా సర్కారు వారి పాటలు ఒక సాంగ్ యూట్యూబ్ లో మాత్రమే రిలీజ్ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. పూర్తి విషయంలోకి వెళ్తే మురారి బావ అనే సాంగ్ సినిమాలో లేదని.. దానికి బదులుగా “మా మా మహేష్ సాంగ్” చేయటం జరిగిందని చెప్పుకొచ్చారు. వాస్తవానికి “మురారి సాంగ్” సినిమాలో ఉండాలి కానీ దాని ప్లేస్ లో.. “మా మా మహేష్” సాంగ్ పెట్టినట్లు కొత్త విషయం తెలియజేశారు.

సినిమా రిలీజయ్యాక యూట్యూబ్ లో మురారి బావ సాంగ్ విడుదల అవుతుందని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే “మా మా మహేష్” సాంగ్ లో మహేష్ చేత కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ అదిరిపోయే స్టెప్పులు వేసినట్లు.. సినిమాకి హైలెట్ కానున్నట్లు సినిమా యూనిట్ తెలియజేసింది. గతంలో “సరిలేరు నీకెవ్వరు” లో…మైండ్ బ్లాక్ సాంగ్ లో.. మహేష్ వేసిన స్టెప్పులు కి అభిమానుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఆ దిశగానే మహేష్ సాంగ్…లో మహేష్ బాబు మాస్ స్టెప్ లు వేసినట్లు ఇండస్ట్రీ టాక్.


Share

Related posts

Mahesh : మహేష్ ఫ్యాన్స్ వర్సెస్ బన్నీ ఫ్యాన్స్..!!

sekhar

నేనింతే !పోషించేది ప్రతిపక్ష పాత్రనే!!కుండ బద్దలు కొట్టిన ఉండవల్లి!!

Yandamuri

Mahesh Babu: మహేష్ బర్త్ డే సందర్భంగా మహేష్ తో.. సినిమాలు చేసిన డైరెక్టర్లు వైరల్ కామెంట్స్..!!

sekhar
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar