Currency: నిర్మాణ అద్భుతం
మన వందరూపాయల నోటు వెనుక ఉన్న బొమ్మ ని ఎప్పుడైనా గమనించారా? దానిని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఇప్పుడు ఉన్న వంద రూపాయల నోటుకు వెనుక వైపు ఉన్న ఈ చిత్రం లో ఉన్నది రాణీ కా వావ్ ఇది గుజరాత్ (Gujarat) లోని పఠాన్ జిల్లాలో ఉన్న ఒక నీటి బావి. వంద రూపాయల నోటు మీద ప్రింట్ అయ్యేవరకు దీని నిర్మాణ అద్భుతం ఎవ్వరికి తెలియదు.
దేశంలో ఉన్న చాలా నిర్మాణాలు రాజులు తమ ఇష్ట దైవాల కోసమో తమ ప్రియ రాణుల కోసమో కట్టించారు. కానీ ఈ బావిని మాత్రం సోలంకి వంశానికి చెందిన రాణి ఉదయమతి ఆమె భర్త భీమ -1 గుర్తుగా 1050-1100 సంవత్సరాల మధ్య సరస్వతి నది ఒడ్డున నిర్మించడం జరిగింది .మొత్తం 7 అంతస్థుల్లో నిర్మించ బడిన ఈ బావి 213 అడుగులుపొడవు . 66 అడుగుల వెడల్పు, 92 అడుగులు లోతు ఉంటుంది.
Currency: లోపలికి దిగిన కొద్ది ఉష్ణోగ్రత
భారతదేశంలో మిగిలినకట్టడాలన్నీ నేల మీద నుండి పైకి అంతస్థులుగాకడితే, దీన్ని మాత్రం భూమి లోపలికి 7 అంతస్థులుగా కట్టబడడం చాలా విశేషం.ఎందుకంటే భూమి లోపలికి తవ్వుతూ నిర్మాణాలు చేయడం చాలాకష్టమైనపని అయినా కూడా ఈ నిర్మాణం భారతీయుల యొక్క ఇంజనీరింగ్ నైపుణ్యానికి ఓ అద్భుత ఉదాహరణ గా చెప్పాబడుతుంది.ఈ నిర్మాణంలో అద్భుత కథలు చెక్క బడిన 215 స్థంభాలు, దాదాపుగా 800 శిల్పాలుఇక్కడ ఉన్నాయి. గోడల మీద దశావతారం కథలు, ఇతర పురాణాలు, స్త్రీల గురించి ఎన్నో బొమ్మలు చెక్కించబడ్డాయి. ఈ బావి కి ఉన్న మరో అద్భుతం ఏమిటంటే, లోపలికి దిగిన కొద్ది ఉష్ణోగ్రత తగ్గిపోయి చల్లగా ఉంటుంది. 7 అంతస్తులు దిగిన తరువాత బావి ఉంటుంది. ఆ రోజుల్లో బావి చుట్టూ ఔషధ మొక్కలు కూడా పెంచేవారట ఈ కారణం గా ఈ బావిలో స్నానం చేస్తే రోగాలు తగ్గేవి అని చెబుతారు. బావి దగ్గరే ఓ తలుపు మూయబడి కనిపిస్తుంది. అప్పట్లో శత్రువులు దాడి చేసినపుడు ఆ తలుపు తెరచుకుని దాని లోపల 30 కిలోమీటర్ల పొడవు ఉన్న సొరంగ మార్గంలో సిద్దాపూర్ అనే పట్టణానికి చేరుకునే ఏర్పాటు చేశారు.
ప్రపంచ వారసత్వ సంపద
అయితే ఒకసారి సరస్వతి నదికి వచ్చిన వరదల్లో ఈ బావి పూర్తిగా ఇసుకలో కురుకుపోగా… 1980లో ASI అంటే ఆర్కీలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా జరిపిన తవ్వకాల్లో ఇది బయటపడడం జరిగింది. 2014 వసంవత్సరం లో UNESCO దీన్ని ప్రపంచ వారసత్వ సంపద జాబితాలోకి చేర్చడం వలన దీని కీర్తి విశ్వవ్యాప్తం గా తెలిసింది. అయితే 2018 జులై లో రిజర్వ్ బ్యాంకు 100 రూపాయల నోటు మీద దీన్ని ముద్రించే వరకు చాలా మంది భారతీయులకు ఈ అద్భుత నిర్మాణం గురించి తెలియక పోవడం అనేది బాధాకరం అనే చెప్పాలి.
ఇంట గొప్ప కట్టడం గురించి అందరికి తెలియచేయడం మన భాద్యత.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?