మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి అన్నకు తగ్గ తమ్ముడు అని అనిపించుకున్నాడు పవన్ కళ్యాణ్. ఆ తర్వాత మెల్లగా తన ప్రతిభ తో పవన్ కళ్యాన్ కాస్త పవర్ స్టార్ అయ్యాడు. అయితే, పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ అవ్వడం వెనక ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది.
పవన్ కళ్యాణ్ అసలు పేరు కళ్యాణ్ కుమార్. కానీ ఇండస్ట్రీలోకి వచ్చాక అతని పేరు పవన్ కళ్యాణ్ గా మారింది. ఇండస్ట్రీలోకి రాకముందు ముందు పవన్ కల్యాణ్ తన చిన్న అన్నయ్య నాగబాబు తో అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్లో వచ్చిన కొన్ని చిత్రాలకు సహ నిర్మాతగా ఉన్నారు.
పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన మొదటి చిత్రం ‘‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’. ఇది గీతా ఆర్ట్స్ బ్యానర్లో తెరకెక్కిన సినిమా. ఈ చిత్రాన్ని ఇవివి సత్యనారాయణ డైరెక్ట్ చేసారు. కానీ ఆ సినిమా బాక్స్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్‘గోకులంలో సీత’ అనే సినిమా చేసాడు. ఈ చిత్రం ముత్యాల సుబ్బయ్య గారి దర్శకత్వంలో వచ్చింది. ఈ చిత్రం రికార్డులని తిరగ రాసింది.
అయితే ఇక ఆ చిత్రానికి గాను పోసాని కృష్ణమురళి మాటలు అందించారు. పోసాని కృష్ణమురళి తొలిసారిగా విలేకరుల సమావేశంలో ఈ సినిమా విడుదల సందర్భంగా మాట్లాడుతూ పవన్ కల్యాణ్‌ను పవన్ స్టార్ అని సంబోధించారు. అంతే, ఆ తర్వాత చాలా పత్రికలు పవన్ కళ్యాణ్ కథనాలలో ఆయన పేరు ముందు పవర్ స్టార్ బిరుదుతో కథనాలు రాసాయి.
అయితే, ‘గోకులంలో సీత’ సినిమా తరువాత కళ్యాణ్ కుమార్ కాస్త పవన్ కళ్యాణ్ అయ్యాడు. ఆ తర్వాత సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్లో వచ్చిన ‘సుస్వాగతం’ సినిమాలో తొలిసారిగా పవన్ కళ్యాన్ పేరుకు ముందు పవర్ స్టార్ బిరుదుతో టైటిల్ కార్డ్ వేసారు.