Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ ఇచ్చిన ఆ టాస్క్ పై.. మండిపడుతున్న జనాలు..!!

Share

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్ లో.. నాలుగో వారం ఎలిమినేషన్ నామినేషన్ అయిపోయిన తర్వాత.. ఇంటి సభ్యులతో బిగ్ బాస్ రచ్చ రచ్చ గేమ్ స్టార్ట్ చేశారు. నామినేషన్ అయిపోయిన అనంతరం నటరాజ్ మాస్టర్ తో గుంటనక్క విషయంలో రవి పెద్ద డిస్కషన్ పెట్టుకున్నారు. ఈ క్రమంలో నటరాజ్ మాస్టర్ ఆ పదం నేను ఎప్పుడో మరిచిపోయాను, కానీ నా దగ్గరకు ఒక ఊసరవెల్లి వచ్చి.. రవికి కరెక్ట్ గా పేరు పెట్టావు అని చెప్పారు అంటూ పరోక్షంగా విశ్వ పై రవిని నటరాజ్ మాస్టర్ ఉసిగొల్పడం జరిగింది.

దీంతో రవి ఎక్కడ కూడా బెదరకుండా డైరెక్ట్ గా ఈ విషయం విశ్వ దగ్గర ప్రస్తావించాడు. ఏమని అంటే..” నేను నిన్ను హౌస్లో విశ్వ అన్న… విశ్వ అన్న అని అంటుంటే నువ్వు మాస్టర్ దగ్గరకు పోయి గుంటనక్క అని వాడికి కరెక్ట్ పేరు పెట్టావు అంటూ నా గురించి మాట్లాడటం ఏంటి అని విశ్వాన్ని నిలదీశాడు రవి. దీంతో ఒక్కసారిగా షాక్ అయి పోయిన విశ్వ… అసలు నీ గురించి నేనెప్పుడూ మాస్టర్ దగ్గర అలా అనలేదు డార్లింగ్ అంటూ రవి కి ఆన్సర్ ఇస్తాడు. ఆ మనిషితో మాట్లాడటమే శుద్ధ వేస్ట్ అంటూ కూడా మాస్టర్ ని ఉద్దేశించి విశ్వ కామెంట్లు చేయడం జరిగింది.

ఇక ఇదే సమయంలో… నామినేషన్ ప్రక్రియలో భాగంగా లోబో.. చేసిన కామెంట్లకు ప్రియా గుక్కపెట్టి ఏడవటం జరిగింది. ఆ తర్వాత ఇంటి సభ్యులు అంతా ఆమెను ఓదార్చారు. ఇక ఈ రీతిలో నామినేషన్ కార్యక్రమం జరిగిన తర్వాత.. బిగ్ బాస్ డిఫరెంట్ టాస్క్ ఇచ్చారు. హౌస్ లో.. ఒక వేయింగ్ మిషన్ పెట్టి ఇంటి సభ్యులు బరువు కోలవడం జరిగింది. ఇంటిలో సోఫా లో సభ్యులంతా కూర్చున్న టైంలో ఒక్కసారిగా మెయిన్ డోర్ క్లోజ్ అవ్వటంతో ఇంటిలోకి అపరిచితులు… లోనికి వచ్చి ఆహార పదార్థాలను తీసుకెళ్లిపోయారు. ఇంటి సభ్యులకు ఆహారం లేకుండా బిగ్ బాస్ చేయడం జరిగింది. దీంతో ఇంటి సభ్యులు ఆకలికేకలు అన్న తరహాలో.. గట్టి గట్టిగా అరిచారు. ఈ క్రమంలో ఒక్కసారిగా డోర్స్ ఓపెన్ కావటంతో… ఇంట్లో ఉన్న సభ్యులు అంతా కిచెన్ లోకి వెళ్లి దాచుకున్న ఆహారపదార్థాలని తినడం మొదలు పెట్టారు. ఇలాంటి తరుణంలో దాచుకున్న ఫుడ్ ఐటమ్స్ కూడా ఇచ్చేయాలని..బిగ్ బాస్ ఆదేశించడంతో చేసేదేమీలేక కెప్టెన్ జెస్సీ.. తినే తిండి ఐటమ్స్ మొత్తం ఇచ్చేశారు.

Bigg Boss 5 Telugu: Bigg Boss Increased Dose Of Tasks - Sakshi

దాచుకున్న ఆహారాన్ని కూడా ఇచ్చేసిన ఇంటి సభ్యులు..!!

చాలా మంది ఇంటి సభ్యుల దాచుకున్న ఫుడ్ ఐటమ్స్ ఇచ్చేయడం జరిగింది. ఈ క్రమంలో కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ లో భాగంగా ఇంటి సభ్యులను జంటగా విడిపోవాలని బిగ్ బాస్ సరికొత్త టాస్క్ ఇవ్వడం జరిగింది. దీంతో జశ్వంత్‌-కాజల్‌, సిరి-షణ్ముఖ్‌, లోబో- నటరాజ్‌ మాస్టర్‌, రామ్‌-హమిదా, యానీ-శ్వేత, ప్రియా- ప్రియాంక, రవి-విశ్వ, సన్నీ-మానస్‌ విడిపోయారు. ఈ క్రమంలో పోటీదారులకు గెలవాలంటే తగ్గాల్సిందే అనే టాస్క్ బిగ్ బాస్ ఇవ్వటం జరిగింది. దీనిలో భాగంగా ఇంటి సభ్యులలో ఎవరైతే ఎక్కువ గా బరువు తగ్గుతారా వారే ఈవారం కెప్టెన్సీ కం టెండర్ అని..బిగ్ బాస్ ప్రకటిస్తాడు.

ఈ టాస్క్ వల్ల ఎవరికి ఏమైనా అయితే ఎవరిది రెస్పాన్సిబిలిటీ..

ఈ క్రమంలో నటరాజ్ మాస్టర్ – లోబో జంట.. పట్టుకోండి చూద్దాం అనే గేమ్ లో భాగంగా పవర్ రూమ్ యాక్సెస్ పొంది… తమతో పోటీకి దిగబోయే జంటను.. సెలెక్ట్ చేసుకునే అవకాశం రావటంతో మాస్టర్ – లోబో జంట… శ్రీరామ్- హమీదా లను సెలెక్ట్ చేసుకుని పోటీదారులు ఎంచుకోగా, చివరాకరికి శ్రీరామ్ జంట గెలవడం జరిగింది. ఇదిలా ఉంటే ఎపిసోడ్ అనంతరం సోషల్ మీడియాలో బిగ్ బాస్ ఆడియన్స్ ఇంటి సభ్యుల నోటి దగ్గర ఆహారం వల్ల లాక్కోవటం పట్ల విమర్శలు చేస్తున్నారు. ఇది మరీ అన్యాయం అని.. ఇచ్చిన టాస్క్ పరంగా.. ఇంటిలో ఉన్న సభ్యులలో ఎవరికైనా హెల్త్ డేంజర్ లోకి వెళ్తే పరిస్థితి ఏమిటని నిలదీశారు. ముఖ్యంగా లోబో భారీ శాల్తి కలిగిన వ్యక్తి.. ఒకసారి ఇప్పటికే.. హౌస్ లో మెడికల్ రూమ్ కి వెళ్లడం జరిగింది. ఇటువంటి టాస్క్ లు.. వల్ల ఇంటి సభ్యుల హెల్త్ కి ప్రమాదం అంటూ గెలిస్తే తగ్గాలి..అనే టాస్క్ గురించి బయట జనాలు మండిపడుతున్నారు.


Share

Related posts

Huzurabad By Poll: కాంగ్రెస్ కు బిగ్ షాక్ ఇచ్చిన కొండా సురేఖ..!?

somaraju sharma

వీధికుక్కలైతే చంపుతారా?

somaraju sharma

ఈ కారు స్పెషలిటీ తెలిస్తే షాక్ అవుతారు..!

Teja