SVP: “సర్కారు వారి పాట” మ్యూజిక్ రైట్స్ దక్కించుకున్న ఆ టాప్ సౌత్ ఇండియా సంస్థ..!!

Share

SVP: టాలీవుడ్ ఇండస్ట్రీలో మహేష్ మానియా నడుస్తోంది. పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలు చేయకపోయినా గాని ఆ స్థాయిలో క్రేజ్ ఉన్న హీరో మహేష్. ఈ విషయం ఇటీవల కొన్ని సర్వే సంస్థలు, మ్యాగజిన్ లో ర్యాన్ కింగ్ లలో మహేష్ సాధించిన ఫలితాలు రుజువు చేశాయి. ఆ తరహా క్రేజ్ ఉన్న మహేష్ ప్రస్తుతం గీతా గోవిందం డైరెక్టర్ పరుశురామ్ దర్శకత్వంలో “సర్కారు వారి పాట” లో నటిస్తున్నాడు. అంతకుముందు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మహర్షి భరత్ అనే నేను సరిలేరు నీకెవ్వరు మూడు సినిమాలతో బ్లాక్బస్టర్ విజయాలు అందుకుని హ్యాట్రిక్ సాధించడంతో “సర్కారు వారి పాట” సినిమాపై అభిమానుల్లో అంచనాలు బీభత్సంగా ఉన్నాయి.

Coronavirus shock for Sarkaru Vaari Paata

ముఖ్యంగా ఈ సినిమాలో మహేష్ మేక్ఓవర్ చాలా కొత్తగా ఉండటంతో.. ఆటో ఇటీవల సినిమా యూనిట్ ఇస్తున్న అప్ డేట్ లు.. ఉన్న కొద్ది సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. ఇటువంటి తరుణంలో రేపు జూలై 31 వ తారీకు సినిమాకి సంబంధించి పోస్టర్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించిన సినిమా యూనిట్.. తాజాగా ఈ సినిమాకి సంబంధించి మ్యూజిక్ రైట్స్ సౌత్ ఇండియా అతి పెద్ద మ్యూజిక్ నిర్మాణ సంస్థ దక్కించుకున్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో లేటెస్ట్ టాక్. విషయంలోకి వెళితే సౌత్ ఇండియా లేటెస్ట్ సెన్సేషన్ మ్యూజిక్ లేబుల్స్.. సరిగమ సౌత్ అనే నిర్మాణ సంస్థ భారీ ధరకు “సర్కార్ వారి పాట” పాటలు సినిమా మ్యూజిక్ రైట్స్ పొందినట్లు సమాచారం.

 

ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా గురించి ఓ ప్రముఖ టీవీ ఛానల్ లో తమన్ మాట్లాడుతూ.. దూకుడు తరహాలో కమర్షియల్ ఎంటర్టైనర్ విధంగా సర్కార్ వారి పాట సినిమా ఉంటుందని.. బాగా ఎంజాయ్ చేసే సినిమా మహేష్ పంచ్ డైలాగులు అదరగొట్టే తరహాలో స్క్రీన్ మీద ఉంటాయి అన్నట్టుగా తమన్ తెలపడం జరిగింది. ఏదిఏమైనా ఇటీవలే ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ మొదలవగానే తాజాగా పోస్టర్ తో పాటు సినిమా మ్యూజికల్ రైట్స్ ప్రముఖ మ్యూజిక్ నిర్మాణ సంస్థ దక్కించుకోవడం పట్ల ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


Share

Related posts

కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ వద్ద బీజేపీ నేత మీద చేయిచేసుకున్న పోలీసులు

Siva Prasad

దేశవ్యాప్తంగా కొనసాగుతున్న కరోనా ఉధృతి

Muraliak

ఫేస్ బుక్ ద్వారా “దరువే”శారు..! పోలీసులు పెట్టేసారు – సీఎంలు వదిలేశారు..!!

Srinivas Manem