Subscribe for notification

“చెత్త” లంబోర్ఘిని.. చూశారా ఎప్పుడైనా

Share

 

విలాసవంతమైన కార్లకు ప్రపంచంలో ప్రఖ్యాతి గాంచిన ప్రముఖ ఇటాలియన్ వాహన తయారీ సంస్థ.. స్పోర్ట్స్, రేసింగ్ కార్లకు కేరాఫ్ అడ్రస్.. లగ్జరీ కార్ల బ్రాండ్ అంబాసిడర్ లంబోర్ఘిని..! చాలామందికి లంబోర్ఘిని కార్ ఒక కల గానే మిగిలిపోతుంది.. ఈ కారులో ఒక్కసారైనా ప్రయాణించాలి అనుకునేవారు కోట్ల సంఖ్యలో ఉంటారు అంటే అతిశయోక్తి కాదు.. కోట్ల రూపాయలు వెచ్చించి కొనలేని వారు తమ కార్లోనే లంబోర్ఘిని కారు గా భావించి మురిసిపోతుంటారు.. మరికొందరు తమ పాత కార్లను సూపర్ కార్ ల మాదిరిగా కస్టమైజ్ చేయించుకుంటారు.. సాధారణంగా చెత్తను రీసైక్లింగ్ చేయొచ్చు.. మహా అయితే మరో అడుగు ముందుకు వేసి చిన్న చిన్న ఎలక్ట్రానిక్ వస్తువులను తయారు చేయొచ్చు.. అనాస్ అనే ఘనుడు ఏకంగా చెత్త ను ఉపయోగించి లంబోర్ఘిని కారుని చేతితో తయారు చేశాడు.. ఈ “చెత్త లంబోర్ఘిని” కార్ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం..

 

 

కేరళలోని ఇడుక్కి జిల్లాకు చెందిన అనాస్ కు చిన్నప్పటి నుంచి కార్లంటే విపరీతమైన ఇష్టం. కొంతకాలంగా కారణం నిర్మించాలని ప్రయత్నిస్తున్నాడు. చివరిగా చెత్తతో ఈ కారణం నిర్మించాడు. ఇతను ఈ కారు తయారు చేయడానికి ముఖ్య ఉద్దేశం ప్రజలు సాధారణంగా విసిరి పారేసే వస్తువులను రీసైకిల్ చేసి తిరిగి ఉపయోగించడం కోసం.

వివిధ ఆటోమోటివ్ గ్యారేజ్ డంపింగ్ యార్డ్ లో నుండి సేకరించిన విడిభాగాలను ఉపయోగించి ఇతను ఈ కారును డిజైన్ చేశాడు. ఫ్రేమ్, అల్లాయ్ వీల్స్ దగ్గరలోని గ్యారేజ్ లో తయారు చేశాడు. పాత మారుతి 800 టైర్లను ఉపయోగించాడు. ఇది పూర్తి ఫంక్షనల్ కారు. బాడీ కలర్ కు పెయింట్ చేయడానికి బదులుగా గ్రీన్ కలర్ వినైల్ వ్రాప్ ను ఉపయోగించారు.

 

అసలైన నా వరల్డ్ లంబోర్ఘిని మాదిరిగానే దీన్ని ఇంజన్ను కూడా వెనుక భాగంలో అమర్చడం నిజంగా విశేషమే. ఆసక్తికర అ విషయం ఏమిటంటే ఈ కారులో ఉపయోగించిన ఇంజిన్ హీరో గ్లామర్ మోటార్ సైకిల్ నుండి తీసుకున్నారు. మరో విశేషం ఏమిటంటే కారు పై భాగంలో ఫిక్స్డ్ గ్లాస్ రూఫ్ కూడా ఉంది. ఫ్యూయల్ ట్యాంక్ ప్లాస్టిక్ తో తయారు చేశారు. ఈ కార్ లోని అన్ని ఎలక్ట్రిక్ పరికరాలకు వైరింగ్ చేశారు.ఇందులో పవర్ విండోస్ స్విచ్, మ్యూజిక్ సిస్టం, రివర్స్ , ఫ్రంట్ రివ్యూ కెమెరా, స్పీడోమీటర్ వంటివి కూడా ఉన్నాయి.అంతేకాకుండా ఈ కార్ లో హ్యాండ్ మేడ్ సౌండ్ సిస్టం కూడా ఉంది . కారు లోపల డాష్ బోర్డు కూడా జంక్ మెటీరియల్స్ తోనే తయారుచేశారు . సెంటర్ కన్సోల్ లో అన్ని పరికరాలను సంబంధించిన కంట్రోల్స్ కూడా ఉన్నాయి . ఈ కారులో నాలుగు ఫార్వర్డ్ గేర్లు తో పాటు ఒక రివర్స్ గేర్ కూడా ఉంది. ఈ కారులో ఇద్దరికి మాత్రమే చోటు ఉంటుంది. యూట్యూబ్లో వీడియోలు చూడడం ద్వారా తాను ఈ కారును సిద్ధం చేశానని తెలిపాడు. చెత్త తో తయారైన కార్ అయినప్పటికీ , చేతితో తయారుచేసిన అనాస్ కు మాత్రం కచ్చితంగా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..


Share
bharani jella

Recent Posts

Pakka Commercial: `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌` ఓటీటీ రైట్స్ ధ‌రెంతో తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

Pakka Commercial: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్‌, ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ మారుతి కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌`.…

26 mins ago

Sudigali Sudheer : సుధీర్‌పై నాగబాబు సెటైర్లు.. మళ్లీ ఒకే చోట చేరిన గ్యాంగ్..

Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ మంచి కమెడియన్‌గా తెలుగు ప్రేక్షకుల్లో పేరు తెచ్చుకున్నాడు. సుధీర్ కమెడియన్ మాత్రమే కాదు…

56 mins ago

Rashmika: కెరీర్‌లో పెద్ద టర్నింగ్‌ పాయింట్ ఆ సినిమానే అంటున్న ర‌ష్మిక‌!

Rashmika: నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ఛ‌లో`తో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టి అన‌తి…

1 hour ago

Pears: తప్పనిసరిగా తినాల్సిన పండు ఇది..!

Pears: యాపిల్ పండు లాగానే కనిపించే పియర్స్ పండు చాలా రుచిగా ఉంటాయి.. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.. కానీ…

1 hour ago

Breaking: ఎంపీ రఘురామకు హైకోర్టులో ఊరట.. లంచ్‌మోషన్ పిటిషన్‌పై కీలక ఆదేశాలు

Breaking: వైసీపీ (YCP) ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnam Raju) కు హైకోర్టు (AP High Court) లో…

2 hours ago

Non Veg: వర్షాకాలం ఆకుకూరలతో పాటు మాంసాహారం తినకూడదా.!? ఎందుకని.!?

Non Veg: వర్షాకాలం (Monsoon)  మొదలవడంతోనే వాగులు వంకలు పొంగిపొర్లుతాయి.. ఈ సీజన్లో ఎటు చూసినా పచ్చదనమే కనిపిస్తుంది.. వర్షాకాలంలో…

2 hours ago