NewsOrbit
జాతీయం న్యూస్

Shabnam : దేశం మొత్తం అప్రమత్తమయ్యే ఘటన..! ఏడుగురిని హత్యచేసిన కేసులో మహిళకి ఉరి శిక్ష..!!

Shabnam : స్వతంత్ర భారతంలో తొలిసారిగా దేశంలో ఓ మహిళను ఉరి తీయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. కుటుంబ సభ్యులను అత్యంత పాశవికంగా హత్య చేసిన ఓ మహిళను ఉరితీసేందుకు ఏర్పాట్లు చేయాలని మథుర కోర్టు జైలు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. కేసు పూర్వాపరాలు పరిశీలిస్తే ఈ విధంగా ఉన్నాయి. మథురకు చెందిన షబ్నమ్‌ అనే మహిళ సలీం అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి అనంతరం శారీరక సంబంధానికి దారితీసింది.

 The whole country is on high alert ..! Woman sentenced to death for killing seven
The whole country is on high alert ..! Woman sentenced to death for killing seven

పెళ్లికి ముందే షబ్నమ్‌ దారితప్పడంతో కుటుంబ సభ్యలు గట్టిగా మందలించారు. అయినప్పటికీ తీరు మార్చుకోని షబ్నమ్‌ సలీంను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది. దీని కోసం కుటుంబ సభ్యుల అనుమతిని కోరింది. దీని వారు నిరాకరించడంతో పాటు షబ్నమ్‌ను గృహనిర్బంధం చేశారు. దీంతో కుటుంబ సభ్యులపై కక్షపెంచుకున్న షబ్నమ్‌ ప్రియుడు సలీంతో కలిసి 2008 ఏప్రిల్‌ 14న అర్థరాత్రి ఏడుగురు కుటుంబ సభ్యులను అత్యంత దారుణంగా హతమార్చింది. ఐదు రోజుల అనంతరం నిందితుల్ని పోలీసులు అరెస్ట్‌ చేశారు.వారిద్దరినీ జైలుకు తరలించే క్రమంలో వైద్య పరీక్షలు నిర్వహించగా అప్పటికే షబ్నమ్‌ ఏడు వారాల గర్భవతి అని తేలింది. దీంతో పోలీసులు ఆమెను వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు.

Shabnam : ప్రియుడి ఉచ్చులో చిక్కుకున్న ఉన్నత విద్యావంతురాలు!

కుటుంబ సభ్యులను హతమార్చేలా సలీంను షబ్నమే ప్రోత్సహించిందని తేలింది. అంతేకాకుండా ఆమె ఎంఏ ఇంగ్లీష్‌, జాగ్రఫీలో పట్టాపొందారు కూడా. కేసుపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిన మథుర కోర్టు 2010 జూలై 14న నిందితులు ఇద్దరికీ మరణశిక్షను విధిస్తూ సంచలన తీర్పును వెలువరించింది.

అన్ని దారులూ మూసుకుపోయాయి!

దీనిని సవాలు చేస్తూ దోషులు అలహాబాద్‌ హైకోర్టును ఆశ్రయించగా.. దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించి రివ్యూ పిటిషన్లను కొట్టివేసింది. దీంతో సలీం, షబ్నమ్‌ 2015లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా వారికి ఎదురుదెబ్బ ఎదురైంది. అనంతరం చివరి అవకాశంగా అప్పటి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ముందు క్షమాభిక్షను అభ్యర్థించగా.. ఆయన దానికి నిరాకరించారు.కాగా బ్రిటిష్‌ ఇండియాలో చివరి సారిగా 1870లో ఓ మహిళకు ఉరిశిక్షను అమలు చేశారు.స్వాతంత్య్రం వచ్చాక భారత్ లో ఒక మహిళను ఉరి తీయబోతుండటం ఇదే ప్రథమం.

 

author avatar
Yandamuri

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju