NewsOrbit
న్యూస్ సినిమా

మొత్తానికి థియోటర్స్ లో బొమ్మపడబోతోంది.. ఇక సంక్రాంతికి సంబరాలే సంబరాలు ..!

కరోనా మహమ్మారి కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ తో సినిమా థియేట‌ర్లు మూసి వేయ‌డంతో చిత్ర ప‌రిశ్ర‌మ‌, అలాగే చిత్ర పరిశ్రమ మీదే ఆధారపడి ఉన్న వందలాది కార్మికులు అల్లాడిన విషయం తెలిసిందే. అయితే ఇటీవ‌ల కేంద్రం కొన్ని మార్గ‌ద‌ర్శకాల్ని సూచిస్తూ వాటిని తప్పకుండా పాటిస్తూ థియేట‌ర్లు రీ ఓపెన్ చేసుకోవ‌చ్చ‌ని తెలిపింది. ఇక ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో థియేట‌ర్లు పూర్తిగా ఎప్పుడు రీ ఓపెన్ చేస్తారా అని అంతా ఎదురుచూస్తున్న సమయంలో డిసెంబర్ 4 నుంచి టెనెంట్ సినిమాతో కొన్ని థియేటర్లు తెరుచుకోబోతుండగా, అదే నెల 11 నుంచి మరి కొన్ని థియేటర్లు తెరుచుకునే అవకాశం వుందని తెలుస్తోంది.

Sai Dharma Tej's 'Solo Brathuke So Better' | TotalTelugu

ఒకరకంగా సినిమా అభిమానులకు ఇది తీపి వార్తే అని చెప్పాలి. కాగా మెగాహీరో సాయిధరమ్ తేజ్ నటిస్తున్న సినిమా సోలో బ్రతుకే సో బెటర్. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దం అయింది. అయితే ఈ సినిమా రిలీజ్ పై ఇప్పటికే ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ భారీ రేటుకు సోలో బ్రతుకే సోబెటరు సినిమాను దక్కించుకుందని ప్రచారం జరిగింది.. కానీ ఈ చిత్రాన్ని థియేటర్ లో విడుదల చేయడానికి చిత్రయూనిట్ సిద్దంగా ఉందని ఈ విషయంలో క్లారిటీ ఇస్తూ ఈ సినిమాను డిసెంబర్ 25 న థియేటర్ లో విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు.

Most Eligible Bachelor' Quarantine Poster: Pooja Hegde's wooing moment with Akhil Akkineni | Telugu Movie News - Times of India

ఇక సోలో బ్రతుకే సో బెటర్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సాయిధరమ్ తేజ్ సందడి మొదలవుతుండగా, రవితేజ ‘క్రాక్’, నాగ చైతన్య ‘లవ్ స్టోరీ’ సినిమాతో పాటుగా, అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’.. నితిన్ నటిస్తున్న రంగ్ దే సినిమాతో పాటు మరికొన్ని చిత్రాలు 2021 సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ కు సిద్దంగా ఉన్నాయట. దీన్ని బట్టి చూస్తే ఇన్నాళ్లుగా బోసిపోయిన సినిమా థియేటర్లలో ప్రేక్షకుల సందడి మొదలవుతుందని చెప్పుకుంటున్నారు. మొత్తానికి థియోటర్స్ లో బొమ్మపడబోతోంది కాబట్టి ఈ సంక్రాంతికి సినిమా ప్రేక్షకుల సంబరాలు అంబరాన్ని తాకుతాయో లేదో చూడాలి.

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Ram Charan NTR: భారీ ధరకు ‘దేవర’..’గేమ్ ఛేంజర్ నార్త్ రైట్స్…?

sekhar

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ “.. రెండు భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jithender Reddy Mangli Song: తెలంగాణ నుంచి రిలీజ్ అయిన జితేందర్ రెడ్డి సాంగ్.. హైలెట్ గా నిలిచిన మంగ్లీ వాయిస్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

siddhu

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!