ప్రపంచంలో కెల్ల అతిపెద్ద వింత.. సృష్టించబోతున్న సౌదీ..!!

సౌదీ దేశం ప్రపంచంలో కెల్లా సరికొత్త వింత ప్రపంచానికి పునాది రాయి వేయటానికి రెడీ అవుతున్నట్లు అంతర్జాతీయ స్థాయిలో వార్తలు వస్తున్నాయి. మేటర్ లోకి వెళ్తే కార్లు అదేవిధంగా రోడ్లు లేకుండా ఓ సుందరమైన నగరాన్ని సృష్టించడానికి సౌదీ అరేబియా రాజు మహమ్మద్ బిన్ సల్మాన్ ప్రకటించారు. ఒక్క శాతం కాలుష్యానికి అవకాశం లేకుండా 170 కిలో మీటర్ల విస్తీర్ణంలో దాదాపు 36 లక్షల కోట్ల రూపాయలతో అందమైన సుందరమైన ఓ నగరాన్ని నిర్మించడానికి రెడీ అవుతున్నారు.

Mohammed bin Salman: The dark side of Saudi Arabia's crown prince | Mohammed  bin Salman News | Al Jazeeraదీంతో ఈ వార్త ప్రపంచ వ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా సైకిళ్లు అదేవిధంగా మోటార్ సైకిల్ కూడా లేకుండా ట్రాఫిక్ అదేవిధంగా కాలుష్యరహిత నగరాన్ని నిర్మించడానికి రెడీ అవుతున్నారట. హైపర్ కనెక్టివిటీ కలిగే విధంగా ఈ నగరాన్ని నిర్మించే ఆలోచన చేస్తుంది సౌదీ. అంతేకాకుండా ఈ నగరం లో కేవలం 10 లక్షల మంది జనాభా మాత్రమే నివసించే రీతిలో నగర నిర్మాణం ఉండబోతున్నట్లు సౌదీ ప్రభుత్వం అధికారికంగా తెలిపింది.

 

ఈ కొత్త నగరానికి “నియోమ్” అనే నామకరణం చేయడానికి సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.