పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్కం ఠాగూర్ సూచనల మేరకు సోనియాగాంధీ కొత్త చీఫ్ ను ఖరారు చేసినట్టు తెలిసింది. ఇప్పటివరకు రేసులో పేర్లు వినిపించిన రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాకుండా కొత్తగా సీనియర్ లీడర్ జీవన్ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. పార్టీ లో పరిస్థితుల నేపథ్యం లో ఆయనవైపే కాం గ్రెస్ హైకమాం డ్ మొగ్గు చూపుతున్నట్టు తెలిసింది. ఎంపీ రేవంత్‌రెడ్డికి ప్రచార కమిటీ చైర్మన్ బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నట్టు సమాచారం. అయితే రెం డు పదవులు రెడ్డి వర్గానికే ఇవ్వాలా, వద్దా అన్న విషయంపై తర్జనభర్జన పడుతున్నట్టు తెలిసింది. ఉత్తమ్ పీసీసీ బాధ్యతల నుంచి తప్పుకుని కొత్తవారిని నియమిం చాలని కోరినప్పటి నుంచీ కాంగ్రెస్ లో పోటీ మొదలైంది.
రేసులో రేవంత్ ,కోమటిరెడ్డి!
చీఫ్ పోస్టు కోసం చాలా మంది నేతలు పోటీపడ్డారు. అందులో ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డిల పేర్లు ప్రముఖంగా వినిపించాయి.
ఆ ఇద్దరిపైనా పెల్లుబుకిన వ్యతిరేకత!
తొలుత రేవంత్ వైపే కాంగ్రెస్ హైకమాండ్ మొగ్గుచూపినట్టుగా వార్తలు వచ్చాయి. దీంతో పార్టీలో అసంతృప్తి సెగలు రేగాయి.తెలుగుదేశం పార్టీ నుండి వచ్చిన రేవంత్ రెడ్డికి ఇప్పటికీ ఆ వాసనలు పోలేదన్న విమర్శలు ఉన్నాయి.వి హనుమంత రావు లాంటి కొందరు సీనియర్లు రేవంత్ కు పీసీసీ ఇవ్వొద్దంటూ బహిరంగంగానే ప్రకటనలు చేశారు. పార్టీ హైకమాండ్ కు లెటర్లు రాశారు.ఇక కోమటిరెడ్డి పేరుపైనా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అన్నిటికంటే మించి కోమటిరెడ్డి సోదరుడు’ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి త్వరలో బిజెపిలో చేరుతానని బహిరంగంగా ప్రకటన చెయ్యడంతో వెంకట రెడ్డి పేరు వెనక్కి వెళ్లిపోయినట్లు సమాచారం!
ఫస్ట్ ఛాయిస్ గా మారిన జీవన్ రెడ్డి!
దీంతో మొదట్నుంచీ పార్టీలో కీలకంగా ఉన్న జీవన్‌రెడ్డిని పీసీసీ చీఫ్ గా నియమించాలని హైకమాండ్ ఆలోచనకు వచ్చినట్టు తెలిసింది.జీవన్ రెడ్డి విషయానికొస్తే కరీంనగర్ జిల్లాకు చెందిన ఈ నేత కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ మోస్ట్.వివాదరహితుడు కూడా… ఆయనపై గ్రూపుల ముద్ర కూడా లేదు !ఇవన్నీ కలిసి వచ్చి జీవన్ రెడ్డి కి పిసిసి పగ్గాలు లభించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ ఉన్నతస్థాయి వర్గాలు చెప్తున్నాయి!
CM YS Jagan: భీమవరం పర్యటన పూర్తి చేసుకుని గన్నవరం విమానాశ్రయం వద్ద తిరుగు ప్రయాణం అయిన ప్రధాన మంత్రి నరేంద్ర…
Somu Veerraju: ప్రధాన మంత్రి నరేంద్ర భీమవరం పర్యటన సందర్భంలో నిరసన తెలిపేందుకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధమైయ్యారు. గన్నవరం విమానాశ్రయం నుండి…
Peanut Rice: వేరుశనగ ఆరోగ్యానికి మంచిదని అందరికీ మంచి తెలిసిందే.. అందుకే పల్లి చెక్కలు, పల్లి ఉండలు, వేరుశనగ పచ్చడి,…
AP Minister RK Roja: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతోత్సవాల సందర్భంగా అజాదీగా అమృత్ ఉత్సవ్ లో…
Race Gurram: 2014వ సంవత్సరంలో డైరెక్టర్ సురేందర్ రెడ్డి(Surender Reddy) దర్శకత్వంలో ఐకాన్ స్టార్ హీరోగా నటించిన "రేసుగుర్రం"( Race…
SSMB28: సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) "సర్కారు వారి పాట"(Sarkaru Vari Pata) విజయంతో మంచి జోరు మీద…