న్యూస్

Kodali Nani: అప్పుడు చింతమనేని..ఇప్పుడు కొడాలి నాని!అడ్డూ అదుపూ లేని వీరంగం!ఏపీ రాజకీయాల్లో ఇదో విచిత్ర పర్వం!

Share

Kodali Nani: ఒక్కో ప్రభుత్వ హయాంలో ఒక్కో నేత వీరంగం ఆడడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పరిపాటిగా మారింది.టీడీపీ పాలనలో చంద్రబాబు 2014 లో మూడోసారి ముఖ్యమంత్రి అయ్యాక అప్పటి దెందులూరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ తన దుందుడుకు ప్రవర్తనతో ఎప్పుడూ వార్తల్లోనే ఉండేవారు.

Then Chintamaneni .. Now Kodali Nani!
Then Chintamaneni .. Now Kodali Nani!

2019 లో వైసిపి అధికారంలోకి వచ్చాక,జగన్ ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని విజృంభణకు అడ్డూ అదుపూ లేకుండా ఉంది.ఈ ఇద్దరూ కూడా ఆయా పార్టీల అధినేతలకు గుదిబండలే అన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.చిత్రమేమిటంటే ఆ ఇద్దర్నీ ఆయా పార్టీల అధినాయకులే. కాపాడుకుంటూ వస్తున్నారు

చింతమనేని పై 26 క్రిమినల్ కేసులు!

ముందుగా చింతమనేని ప్రభాకర్ విషయానికొస్తే ఆయన ఆనాటి ఎమ్మార్వో వనజాక్షి మీద దాడి చేసి పత్రికల్లో పతాక శీర్షికలకు ఎక్కారు.అప్పట్లో ఈ ఘటన దుమారం రేపింది.అయితే ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు తానే నేరుగా మధ్యవర్తిత్వం నెరిపి ప్రభాకర్ ను రక్షించారు.ఇదే కాక మొత్తంగా చూసుకుంటే చింతమనేని ప్రభాకర్ మీద మొత్తం ఇరవై ఆరు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.దీంతో చివరకు కిడ్నాప్ ,మానభంగం వంటి అభియోగాలపై నమోదైన కేసులు కూడా ఉన్నాయి.2014 లో రెండోసారి ప్రభాకర్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక 2019 లోపు ఇరవై కేసులు నమోదయ్యాయంటే ఆయన ఏ స్థాయిలో చెలరేగిపోయారో అర్థం చేసుకోవచ్చు.

జైలు శిక్ష కూడా పడిన వైనం!

కాగా చింతమనేని ప్రభాకర్ కు ఒక కేసులో ఆరు నెలల జైలు శిక్ష కూడా పడింది.ఒక అధికారిక విధులకు ఆటంకం కలిగించడంతో పాటు ఆయనను అక్రమంగా నిర్భందించారన్న కేసులో చింతమనేని ప్రభాకర్ నేరం రుజువుకావడంతో ఏలూరు జిల్లా కోర్టు ఆయనకు ఈ శిక్ష వేసింది.అయితే ప్రభాకర్ హైకోర్టుకు వెళ్లి ఆ శిక్షను సస్పెండ్ చేయించుకున్నారు కానీ ఇప్పటికీ తుదితీర్పు రాలేదు.ఇక వైసిపి అధికారంలోకి వచ్చాక చింతమనేని ప్రభాకర్ పై రాజకీయ కారణాలతో మరికొన్ని కేసులు నమోదయ్యాయి.ఇప్పుడైతే చింతమనేని ప్రభాకర్ ప్రభ సన్నగిల్లింది.

Kodali Nani: కొడాలి నాని కేరాఫ్ కాంట్రవర్శీ!

జగన్ ప్రభుత్వ హయాంలో చింతమనేని ప్రభాకర్ స్థానాన్ని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ఆక్రమించినట్లు కనిపిస్తోంది.కేవలం పదో తరగతి మాత్రమే చదివిన కొడాలి నాని మంత్రి అయినా ఆ హుందాతనాన్ని ఏనాడూ ప్రదర్శించలేదు.పైగా అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్ లో ఎవరిని పడితే వారిని దూషిస్తూ బూతుల మంత్రిగా కూడా పేరు తెచ్చుకున్నారు.అసెంబ్లీలోనే ఆయన నోటికి హద్దూ లేకుండాపోతే జగన్ నవ్వుకొంటూ నాని బూతుపురాణాన్ని ఆస్వాదించటం మరీ విశేషం.చంద్రబాబు,పవన్ కల్యాణ్ మొదలు మాజీ ఎలక్షన్ కమిషన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వరకు అందరిని అతి నీచమైన భాషలో తిట్టిన కొడాలి నాని తాజాగా గుడివాడ క్యాసినో కేసులో ఇరుక్కొని ఉక్కిరిబిక్కిరవుతున్నారు.అయితే కింద పడ్డా తనదే పైచేయి అన్నట్లు నాని ప్రగల్భాలు పలుకుతున్నారు.సాక్ష్యాలతో సహా గుడివాడలో గోవా తరహా క్యాసినో నడిచిందని రుజువైనా ఇంకా కొడాలి నాని తొడలు కొడుతున్నారు.ఇంత జరుగుతున్నా వైసిపి పెద్దలు మాత్రం నోరు మెదపడం లేదు.అయితే కొడాలి నాని కారణంగా వైసిపి కి కోలుకోలేని డ్యామేజ్ జరిగిందని మాత్రం లోలోన అంతర్గత చర్చలు జరుపుతున్నట్టు సమాచారం.మరి ముఖ్యమంత్రి జగన్ ఆయన పై చర్యల విషయంలో వూ అంటారా… ఊహు అంటారా అన్నదే తేలాలి!


Share

Related posts

పరీక్షలు వాయిదా వేసిన ఏపీ ప్రభుత్వం

Siva Prasad

అలా ప్లాన్ చేయడం వల్లే సర్కారు వారి పాట ఆగిపోయిందా ..?

GRK

Lemon: నిమ్మకాయలను ఫ్రిజ్లో పెట్టి ఉపయోగిస్తున్నారా..!? అయితే ఇది తెలుసుకోండి..

bharani jella
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar