Thaman : అప్పుడు అల వైకుంఠపురములో..ఇప్పుడు వకీల్ సాబ్..!

Share

Thaman : గత ఏడాది నుంచి నిన్నా మొన్నటి వరకు స్టైలిష్ స్టార్ ఆలు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో సినిమా పాటలే ఎక్కడైనా వినిపించాయి. ఇక యూట్యూబ్‌లో అల సాంగ్స్ సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమాలో సాంగ్స్ థమన్ కి విపరీతమైన క్రేజ్ కూడా తీసుకు వచ్చాయి. అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టాడంటే అందులో మేజర్ క్రెడిట్ డైరెక్టర్ త్రివిక్రం, థమన్ ల మ్యాజిక్ అని ఖచ్చితంగా చెప్పాలి. ఇక గత ఏడాది నుంచి థమన్ ఊపు మామూలుగా లేదు. టాలీవుడ్ లో ఏ సినిమా మొదలవుతున్నా దర్శక, నిర్మాతలు, హీరోలు థమన్ పేరునే పరిశీలిస్తున్నారు.

then-in-ala-vaikunthapuram-now-vakil-saab
then-in-ala-vaikunthapuram-now-vakil-saab

అంతేకాదు ఈ దాదాపు థమన్ ని ఎంపిక చేసుకుంటున్నారు. ఈ ఏడాది మాస్ మహారాజా రవితేజ నటించిన క్రాక్ సినిమా సక్సస్ క్రెడిట్ లో థమన్ ది మెజారిటీ ఎక్కువే. మూడేళ్ళ నుంచి రవితేజ హిట్స్ కోసం తపించాడు. ఆ హిట్ క్రాక్ రూపంలో దక్కింది. థమన్ ఈ సినిమాకి ఇచ్చిన సాంగ్స్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమా రేంజ్ ని మరింతగా పెంచాయి. మేకర్స్ కూడా క్రాక్ సక్సస్ లో క్రెడిట్ థమన్ కి చాలా ఉందని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో థమన్ చేతి నిండా సినిమాలతో ఊపిరాడనంత బిజీ అయ్యాడు.

Thaman : థమన్ టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు.

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన రీ ఎంట్రీ సినిమా వకీల్ సాబ్ కి సంగీతం అందించిన థమన్ ఈ ఏడాది సందడి వకీల్ సాబ్ దే అన్నట్టుగా ఆల్బం ..బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో అదరగొట్టాడు. ట్రైలర్ కి థమన్ ఇచ్చిన మ్యూజిక్ గురించి ఇండస్ట్రీ ప్రముఖులందరు ప్రశంసలతో ముంచేస్తున్నారు. గత ఏడాది అల సినిమాతో రికార్డ్ క్రియేట్ చేస్తే ఈ ఏడాది వకీల్ సాబ్ తో రికార్డ్స్ క్రియేట్ చేయడం పక్కా అంటున్నారు. మగువా, మగువా, సత్యమేవ జయతే, కంటిపాప సాంగ్స్ ట్రెండ్ అవుతూ దుమ్ము లేపుతున్నాయి. మొత్తానికి థమన్ టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు.


Share

Related posts

పీసీసీ పీఠంపై రేవంత్ రెడ్డి … జ‌గ్గారెడ్డి ఇదే చెప్తున్నారా?

sridhar

ఆగిన సినిమా మొద‌లవుతుంది

Siva Prasad

బాబు టీంకు నోట మాట రాని ప‌రిస్థితి… జ‌గ‌న్ ఇప్పుడేం చేశారంటే…

sridhar