NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Andhra Politics : అప్పుడు జగన్ …ఇప్పుడు చంద్రబాబు!సీన్ సేమ్ టు సేమ్ !

Andhra Politics : రాజకీయాలూ.. ఎప్పుడూ ఒకే విధంగా ఉండవు. ఓడలు బళ్లవుతాయి. బళ్లు ఓడలవుతాయి. శత్రువులు మిత్రులవుతారు. అదికారంలో ఉన్న పార్టీ ప్రతిపక్షమవుతుంది.. ప్రతిపక్షంలో ఉన్న పార్టీ అధికారపీఠంలో కూర్చొంటుంది. ఇదంతా ఎందుకంటే…అప్పుడు జగన్ కు ఎలాంటి పరిస్థితి ఎదురైందో..ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబుకు ఎదురైంది. తిరుపతిలోని రేణిగుంట ఎయిర్ పోర్టులో చంద్రబాబు నేలపై బైఠాయించడం, గతంలో విశాఖ ఎయిర్ పోర్టులో జగన్ నేలపై కూర్చొన్న ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Then Jagan... now Chandrababu! Sean Same to Same In Andhra Politics !
Then Jagan… now Chandrababu! Sean Same to Same In Andhra Politics !

Andhra Politics : 2017 సంవత్సరం,విశాఖ ఎయిర్‌పోర్ట్ !

2017 సంవత్సరంలో ప్రతిపక్షంగా జగన్ ఉన్నారు. ఆ సంవత్సరం జనవరి 26వ తేదీన ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ..విశాఖ బీచ్ రోడ్డులో క్యాండిల్ ర్యాలీకి బయలుదేరారు. జగన్ పర్యటనకు అనుమతి లేదంటూ..ఎయిర్ పోర్టులోనే పోలీసులు అడ్డుకున్నారు. ఆయనతో పాటు విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, అంబటి రాంబాబులు ఉన్నారు. పోలీసుల చర్యను జగన్ తప్పుబట్టారు. ఆగ్రహం వ్యక్తం చేస్తూ..నేలపై బైఠాయించారు. ఎయిర్ పోర్టు లాంజ్ లోనికి కూడా అనుమతించలేదు. దీనిపై వైసీపీ శ్రేణులు తీవ్రంగా నిరసన వ్యక్తం చేశారు.

2021 సంవత్సరం, రేణిగుంట ఎయిర్ పోర్టు

2021 సంవత్సరం, మార్చి 01వ తేదీ సోమవారం తిరుపతి రేణిగుంట ఎయిర్ పోర్టుకు వచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యాలకు పాల్పడుతోందంటూ..చిత్తూరులో నిరసన తెలియచేసేందుకు బాబు రెడీ అయ్యారు. అందులో భాగంగా..రేణిగుంట ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఆయన్ను పోలీసు ఉన్నతాధికారులు అడ్డుకున్నారు. పర్యటనకు అనుమతి లేదంటూ..వీఐపీ లాంజ్ లో నిర్భందించారు. పోలీసుల చర్యను తీవ్రంగా తప్పుబట్టారు బాబు.శాంతియుతంగా నిరసన తెలియచేసే హక్కు తనకు లేదా ? నోటీసులు ఇవ్వడం ఏంటీ ? మండిపడ్డారు. కోవిడ్, మరోవైపు ఎన్నికల ప్రవర్తనా నియమావళి నేపథ్యంలో.. టీడీపీ అధినేత టూర్‌కు నో చెప్పారు. దీంతో నేలపైనే కూర్చొని బాబు నిరసన వ్యక్తం చేశారు. ఆయనకు పోలీసు అధికారులు సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా..బాబు వినిపించుకోలేదు. ప్రాంతాలు వేరైనా..సేమ్ సీన్ రిపీట్ అయ్యిందంటున్నారు.

 

author avatar
Yandamuri

Related posts

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju