NewsOrbit
న్యూస్

ఉప ఎన్నికకూ ఓ చరిత్ర ఉంది!ఒక్క సీటు అనుకోకండి.. బొక్కబోర్లాపడతారు!!

ఉప ఎన్నికలో అధికార పక్షం ఓడిపోవటం ఆషామాషీ విషయం కాదు.ఆ ఒక్క సీటు వలన ప్రభుత్వం పడి పోకపోయినప్పటికీ ఆ ఒక్క ఎన్నికల ఫలితమే అధికార పార్టీ భవితవ్యాన్ని కూడా చెబుతుంది.

చాలాకాలం క్రితం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు 1992 వసంవత్సరంలో నెల్లూరు జిల్లా కోవూరు ఉప ఎన్నిక జరిగింది.అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఘనవిజయం సాధించాడు.అదే కాంగ్రెస్ పరాజయానికి తొలి సూచికగా తేలింది.1994 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అఖండ విజయం సాధించగా కాంగ్రెస్ పార్టీ ఇరవై ఆరు సీట్లకు పరిమితమైంది. 2012 లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా పదహారు మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీకి రాజీనామా చేసి వైసిపిలో చేరి ఉప ఎన్నికలకు వెళ్లగా పధ్నాలుగు మంది గెలిచారు.కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోయింది.ఆ తదుపరి 2014 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఖాతా కూడా తెరవలేదు. అంతెందుకు మొన్న మొన్న జరిగిన నంద్యాల ఉప ఎన్నికను కూడా ఆనాడు అధికారంలో ఉన్న టిడిపి ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో మనకందరికీ తెలుసు.

చంద్రబాబు పరివారమంతా అక్కడే మకాం వేసి నంద్యాల ఓటర్లకు అనేక తాయిలాలు పంచి మొత్తంమీద గెలిచామనిపి౦చుకున్నారు. అంటే ఉప ఎన్నికలోనే ప్రజానాడి దాదాపు అర్థమైపోతుంది. తెలంగాణాలోని దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాన్ని విశ్లేషించేందుకు ఇదంతా చెప్పాల్సి వస్తోంది.తెరాస ఆవిర్భావం తర్వాత ,కెసిఆర్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ ఆరేళ్లలో ఆ పార్టీ ఓడిపోయిన తొలి ఉప ఎన్నిక ఇది.నిజానికి టీఆర్ఎస్కు ఉపఎన్నికలే కలిసివస్తాయి.అలాంటిది దుబ్బాకలో మరణించిన సిట్టింగ్ ఎమ్మెల్యే భార్యనే పోటీకి నిలబెట్టినా ఆ సానుభూతి ఓట్లు కూడా దక్కకుండా టీఆర్ఎస్ ఓడిపోవడం అనేది అందరూ పరిగణించాల్సిన ముఖ్యాంశం. టీఆర్ఎస్ చేతిలో అధికారం ఉంది. అంగబలం ఉంది. అర్ధబలం ఉంది.

బ్రహ్మాండమైన సంక్షేమ పథకాలు అమల్లో ఉన్నాయి.చేతిలో న్యూస్ ఛానెల్ ఉంది, పత్రికలు ఉన్నాయి. ఇన్ని ఉన్నా… దుబ్బాకలో టీఆర్ఎస్ ఓడిపోయింది.గెలిచిన బీజేపీకి- టీఆర్ఎస్ కు ఉన్నవాటిలో 90 శాతం లేవు. అయినా బీజేపీ అభ్యర్థి రఘునందన్రావు గెలిచారు.దీనికి ప్రధాన కారణం ప్రజల ఆలోచనా విధానాల్లో వచ్చిన మార్పు. దుబ్బాక ఫలితం సారాంశమేమిటంటే ప్రజలు అన్నీ గమనిస్తుంటారు. సమయం వచ్చినప్పుడు కీలెరిగి వాత పెడతారు.ఓటరు ఒక్కసారే మోసపోతాడు తప్ప అన్నిసార్లు కాదని కూడా దుబ్బాక రుజువు చేసింది!ఈ ఈ ఫలితం నుండి ఆంధ్రప్రదేశ్ లోని వైసిపి ప్రభుత్వం కూడా గుణపాఠం నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.

 

author avatar
Yandamuri

Related posts

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju