Sarkaru vari pata : సర్కారు వారి పాట .. మహేష్ బాబు కెరీర్ లో 27 వ సినిమాగా రాబోతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా అంటే అభిమానుల్లో ..ప్రేక్షకుల్లో భారీ అంచనాలుంటాయి. ముఖ్యంగా ఏ ఏ అంశాలు సినిమాలో హైలెట్ అవనున్నాయో అని సినిమా షూటింగ్ దశలో ఉన్నప్పటి నుంచే టాక్ మొదలైపోతుంది. పోకిరి సినిమా నుంచి మహేష్ బాబు నటించే సినిమాల మీద ఊహించని రీతిలో అంచనాలు ఏరడటం కామన్ అయిపోయింది. పోకిరి సినిమాలో మహేష్ బాబు డైలాగ్ డెలివరీ.. ఆటిట్యూడ్.. హేయిర్ స్టైల్.. డ్రెస్సింగ్ … యాక్షన్స్ సీన్స్.. సాంగ్స్ .. ఒకటేమిటీ ఆ సినిమాలో ప్రతీదీ హైలెట్ గా నిలిచింది.
అందుకే పోకిరి సినిమా 75 సంవత్సరాల రికార్డ్స్ ని బద్దలు కొట్టింది. కాగా ప్రస్తుతం మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట సినిమా గురించి ఫస్ట్ లుక్ పోస్టర్ అండ్ టైటిల్ రిలీజ్ చేసినప్పటి నుంచే భారీగా అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా మహేష్ బాబు ఈ సినిమాలో లాంగ్ హేయిర్ స్టైల్ లో కనిపించబోతున్నాడు. అంతేకాదు ముందు కంటే చాలా యంగ్ గా హాలీవుడ్ హీరోలనే డామినేట్ చేసే విధంగా .. సరికొత్త మేకోవర్ తో కనిపిస్తున్నాడు. ఇక ప్రస్తుతం దుబాయ్ లో జరుగుతున్న ఎపిసోడ్ సినిమాకి హైలెట్ అని అంటున్నారు.
Sarkaru vari pata : సర్కారు వారి పాట లో హైలెట్స్ చాలానే ఉన్నాయని అంటున్నారు.
మ్యూజిక్ పరంగా సినిమా హైలెట్ గా నిలుస్తుందట. థమన్ ఇచ్చే సాంగ్స్ తో పాటు సర్కారు వారి పాట థీం మ్యూజిక్ .. బ్యాక్ గ్రౌండ్ బాగా హైలెట్ అయ్యేలా థమన్ – పరశురాం ప్లాన్ చేస్తున్నడట. ఇక అద్భుతమైన కామెడీ ట్రాక్ కూడా ఉంటుందట. పోకిరి సినిమాలో కామెడి ట్రాక్ సినిమాకి బాగా ప్లస్ అయింది.
అదే తరహాలో సర్కారు వారి పాట కి కామెడి ట్రాక్ ని రెడీ చేశారట. మొత్తానికి సర్కారు వారి పాట లో హైలెట్స్ చాలానే ఉన్నాయని అంటున్నారు. ఇదే గనక నిజమైతే ఖచ్చితంగా బొమ్మ దద్దరిల్లిపోద్ది. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు కి జంటగా కీర్తి సురేష్ నటిస్తోంది. సాయీ మంజ్రేకర్ సెకండ్ హీరోయిన్ గా నటించబోతుందన్న టాక్ ఉంది. కాని ఇంకా కన్ఫర్మేషన్ లేదు.