Samosa: రకరకాల సమోసాలు గురించి తెలుసుకుందాం…
ఎగ్ సమోసా ఎగ్ బోండా కి మరో రూపమే ఎగ్ సమోసా. బంగాళదుంప స్టఫ్ బదులుగా ఈ సమోసా ఉడకబెట్టిన కోడి గుడ్డు మిశ్రమానికి మసాలా పట్టించి ఫిల్ చేస్తారు .
జామ్ సమోసా – మనం బంగాళాదుంప మిశ్రమాన్ని వాడినట్టుగా వారు తియ్యటి జామ్‌ను మిశ్రమంగా ఫిల్ చేస్తారు. ఒక రకంగా చెప్పాలంటే ఇదో రకం స్వీట్ సమోసా అనవచ్చు.
చైనీస్ సమోసా: మనం సమోసాలలో ఫిల్ చేయడానికి వాడే బంగాళదుంప మిశ్రమానికి బదులు.. నూడిల్స్ లేదా చౌమీన్ను సమోసాల్లో ఫిల్ చేస్తే అదే చైనీస్ సమోసా.
ఫిష్ సమోసా – బాగా ఫ్రై చేసిన చేప ముక్కలను ముళ్ళు తీసేసి ఇందులో బాగా మసాలా దట్టించి ఫిల్ చేస్తే ..ఫిల్ చేస్తే అది ఫిష్ సమోసా అవుతుంది. రుచి అదిరిపోతోంది .
కీమా సమోసా – కీమా ని నింపి చేసే ఈ సమోసా ని చాలామంది బాగా ఇష్టపడతారు రంజాన్ మాసంలో ముస్లిములు ఈ సమోసాలను స్నాక్స్‌గా తింటుంటారు.
చీజ్ సమోసా : ఉత్తరాదిలో చీజ్ సమోసా చాలా ప్రాముఖ్యత పొందింది .
మామూలుగా ఉల్లిపాయలు, కార్న్, అల్లం, వెల్లుల్లి కలిపిన మిశ్రమాన్ని.. కొంచెం ఎక్కువ చీజ్ అద్దితే మాత్రం మీరు ఆ రుచి అసలు మరిచిపోలేరు .
ఉల్లిపాయ సమోసా – కేవలం ఉల్లిపాయలు మాత్రమే బాగా వేయించి వీటిని ఫిల్ చేసి చిన్న చిన్న సమోసాలు గా ఇస్తుంటారు.
కుచోలే సమోసా – మనం సమోసాల్లో బంగాళదుంపలను బాగా ఫ్రై చేసి ముద్దగా చేసి ఫిల్ చేసి మళ్లీ నూనెలో వేయిస్తాం. కానీ కేవలం బంగాళా దుంప మాత్రమే కాకుండా ఆ మిశ్రమంలో శనగలు లేదా బఠానీలు కూడా కలిపి మిక్స్ చేసి ఫిల్ చేస్తే .. అది చోలే సమోసా
చికెన్ సమోసా – బాగా కడిగిన బోన్‌లెస్ చికెన్నుమసాలా అద్ది బాాగా ఫ్రై చేశాక.. సమోసాలో ఫిల్ చేసి ఫ్రై చేస్తే చాలా ప్రత్యేకమైన రుచిని మీరు ఆస్వాదిస్తారు.