POCSO: పిల్లల లైంగిక వేధింపుల పై POCSO చట్టం కేసు నమోదు వివరాలు ఇవే!!

Share

POCSO:  మన దేశంలో  పిల్లలు పై  మితి మీరి జరుగుతున్న లైంగిక వేధింపులలో కొన్ని   మాత్రమే ఫిర్యాదు  చేసేవరకు వస్తున్నాయి. చాలా సందర్భాల్లో పిల్లలను లైంగికంగా వేధించిన వారు సొంత కుటుంబం లోని వారు   లేదా చాలా దగ్గరి సంబంధం ఉన్నవారో  లేదా   బాగా దగ్గరి పరిచయమున్న వ్యక్తి ద్వారా గాని పిల్లలు లైంగికంగా వేధింపులు ఎదురుకున్నప్పుడు  కంప్లైన్ట్ చేయడానికి ముందుకు రావడం లేదు.ఒక అధ్యయనం  ఆధారం గా  జరిగిన సర్వేలో 53%  పిల్లలు వారి జీవితకాలంలో  ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సార్లు  లైంగిక వేధింపుల కు గురవుతున్నట్టు బయటపడింది.

ఎవరైనా వ్యక్తి తన చేష్టలతో పిల్లల జీవించే హక్కుకు భంగం వాటిల్లే విధం గా  ప్రవర్తించడం. వారి జీవితానికి, అభివృద్ధి, శ్రేయస్సుకు తీవ్రమైన ముప్పు వాటిల్లే విధంగా  చేయడం. వారిని శారీరకంగా, మానసికంగా వేధించడం   ఇలాంటివి చైల్డ్  అబ్యూజ్   గానే పరిగణించబడతాయిపెద్దవాళ్ళు తమను తాము  లైంగికంగా సంతోషపెట్టుకోవడం కోసం పిల్లలను ఇబ్బంది పెట్టేలా తాకడం, పిల్లలపై సెక్సువల్ గా దాడి చేయడాన్ని చైల్డ్  సెక్సువల్  అబ్యూజ్ గా లెక్కగడతారు. ఒకవేళ, పిల్లల సమ్మతితోనే లైంగిక చర్య జరిగినా  కూడా అది చైల్డ్  అబ్యూజ్  కిందికే తీసుకుంటారు.  లైంగిక చర్యకు తమ అంగీకారం  తెలియజేయగలిగే మానసిక పరిణితి పిల్లల్లో  ఉండదు అని  చట్టాలు తెలియచేస్తున్నాయి.   పిల్లలతో చేసే ప్రతి లైంగిక చర్య   చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్  కిందే  పరిగణలోకి తీసుకోబడుతుంది.
భారత ప్రభుత్వం 2012లో లైంగిక నేరాల నుండి పిల్లల కి   రక్షణ కల్పించేందుకు.. పోక్సో అనే ప్రత్యేక రక్షణ చట్టాన్ని అమల్లోకి  తీసుకొచ్చింది. ఈ చట్టం ద్వారా పిల్లలపై జరిగే అనేక రకాల లైంగిక  దాడులు నేరాలు గా నమోదు చేయడంతో పాటు ఈ నేరాలకు పాల్పడిన వారికి కఠిన శిక్ష అమలయ్యేలా చేయడం ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశ్యం.

18 సంవత్సరాల  లోపు వయస్సు ఉన్న ఎవరైనా సరే, భారత చట్టాల ప్రకారం పిల్లలుగానే  చెప్పబడ్డారు.బాలిక  లైంగిక దాడికి గురైన సమాచారం ఉంటే వెంటనే POCSO చట్టం కింద నిందితుడిపైకేసు పెట్టవచ్చు .వైద్యులు, తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బంది లేదా లైంగిక దాడికి గురైన  పిల్లలు పోక్సో కేసు దాఖలు  చేయవచ్చు.పోక్సో చట్టం ప్రకారం పిల్లల పై ఏదైనా నేరం లేదా లైంగిక దాడి జరిగిందని లేదా జరిగే అవకాశం ఉందని గుర్తించిన వెంటనే తగిన సహాయం  పొందడం కోసం   స్పెషల్  జువైనల్  పోలీసు యూనిట్ లేదా స్థానిక పోలీసు స్టేషన్ లో  కంప్లైంట్ చేయవచ్చు.పిల్లల మీద జరిగిన లైంగిక వేధింపుల పై POCSO చట్టం కేసు పెట్టడానికి  ఎలాంటి  కాల గడువు ఉండదు. అంటే, ఏదైనా కారణం చేత ఆ బాలిక లైంగిక దాడి జరిగిన వెంటనే కంప్లైంట్ చేయకపోయినా, తర్వాత కాలంలో అనగా ఏ వయసులోనైనా, అతడు/ఆమె చిన్నతనంలో ఎదుర్కొంటున్న లైంగిక వేధింపుల గురించి కంప్లైంట్ చేయవచ్చు.


Share

Related posts

Charging stations : ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేయాలనుకునే వారికి గుడ్ న్యూస్.. కొత్తగా 10 చార్జింగ్ స్టేషన్లు..

bharani jella

Big Boss 5: హౌస్ లో కెమెరాల స్పెషాలిటీ చెప్పిన నాగార్జున..!!

sekhar

Uppena : ఉప్పెన కాంబో మరోసారి..!

GRK