NewsOrbit
న్యూస్ సినిమా

ప్రభాస్ ని ఆరకంగా టచ్ చేసే స్టార్ హీరో ఇండియాలోనే లేడనడానికి ఇవే ప్రూఫ్స్.. !

డార్లింగ్ .. యంగ్ రెబల్ స్టార్.. అని పిలుచుకుంటున్న ప్రభాస్ బాహుబలి ఫ్రాంఛైజీ తర్వాత పాన్ ఇండియన్ స్టార్ గా ఎదిగాడు. నిజంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రభాస్ కి బాహుబలి సినిమాతో వచ్చిన క్రేజ్ అసాధారణం. ఇది దేశం లో ఏ ఒక్కరు ఊహించనిది. సున్నితమైన మనస్తత్వం కలిగిన ప్రభాస్ ఎక్కువగా జనాల మధ్యలోకి రాలేడు. కాని తన సినిమాలతో మాత్రం ప్రతీ ప్రేక్షకుడు గుండెల్లో నిలిచాడు.

Prabhas on being linked with his co-stars, upcoming projects and more | Filmfare.com

కెరీర్ ప్రారంభం నుంచి చేసిన సినిమాలతో అంచలంచెలుగా ఎదుగుతూ ఈ రోజు పాన్ ఇండియన్ స్టార్ గా ఎదిగాడంటే దాని వెనక ఎంత కృషి, పట్టుదల ఉందో అర్థం చేసుకోవచ్చు. బాహుబలి కోసమే 4 ఏళ్ళ సమయం కేటాయించాడంటే అది కేవలం ప్రభాస్ కి మాత్రమే సాధ్యమైంది. ఆ కష్టం ఈ రోజు ప్రభాస్ కి హాలీవుడ్ హీరో రేంజ్ లో పాపులారిటీని తెచ్చి పెట్టింది. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమాలు.. ఆయనకి ఉన్న మార్కెట్ .. క్రేజ్ ఇదంతా ఇప్పుడున్న సౌత్ అండ్ నార్త్ హీరోలలో ఏ ఒక్కరు అందుకోలేరన్నది ఒప్పుకొని తీరాల్సిందే అంటున్నారు విశ్లేషకులు. అందుకు కారణం ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న భారీ బడ్జెట్ సినిమాలే.

Radhe Shyam teaser: Prabhas, Pooja promise a timeless love story | Entertainment News,The Indian Express

బాహుబలి సినిమాతో ప్రభాస్‌ రేంజ్ ఊహించని విధంగా‌ మారిపోయింది. ‘బాహుబలి 2’ తర్వాత ప్రభాస్‌తో యువి క్రియేషన్స్‌ సుజీత్‌ దర్శకత్వంలో తెలుగు, తమిళ్‌, హిందీ భాషల్లో భారీ బడ్జెట్‌తో నిర్మించిన ప్యాన్‌ ఇండియన్ సినిమా ‘సాహో’ హాలీవుడ్ సినిమాకి ఏమాత్రం తగ్గలేదని ప్రూవ్ చేసింది. హైటెక్నికల్‌ వేల్యూస్‌తో నిర్మించిన సాహో తో బాలీవుడ్‌లో మంచి మార్కెట్ ని ఏర్పరచుకున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ కెరీర్ లో‌ 20వ సినిమాగా రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్న ‘రాధేశ్యామ్‌’ మీద ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

Prabhas, Nag Ashwin film set against third World War backdrop- Cinema express

ఇక ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌ 50 సినిమాగా ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రభాస్ తో 21 వ సినిమాని నిర్మిస్తోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించబోతుండగా ప్రముఖ సీనియర్ దర్శకులు సింగీతం శ్రీనివాస్ క్రియోటివ్ హెడ్ గా వ్యవహరిస్తున్నారు. దీపిక పదుకొణె హీరోయిన్ గా బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్న ఇప్పటి వరకు మేకర్స్ అధికారకంగా వెల్లడించారు.

Prabhas roped in for Om Raut directorial Adipurush | Entertainment News,The Indian Express

అలాగే ప్రభాస్‌ హీరోగా బాలీవుడ్‌ దర్శకుడు ఓం రౌత్‌ దర్శకత్వంలో ‘ఆదిపురుష్‌’ అనే ఎపిక్‌ విజువల్‌ వండర్‌ రూపొందబోతుంది. ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా నటిస్తుండగా సైఫ్ అలిఖాన్ లంకేష్ గా నటించనున్నాడు. గుల్షన్‌ కుమార్‌, టి. సిరీస్‌ ఫిలిమ్స్‌ సమర్పణలో రెట్రోఫైల్స్‌ ప్రొడక్షన్‌, టి సిరీస్‌ ఫిలిమ్స్‌ బ్యానర్‌ పై భూషణ్‌ కుమార్‌, కృష్ణ కుమార్‌, ప్రసాద్‌ సుతార్‌, రాజేష్‌ నాయర్‌ భారీ బడ్జెట్‌ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇలా ప్రభాస్ ఊహించని బడ్జెట్ తో భారీ సినిమాలను చేస్తూ ఎవరికి అందనంత ఎత్తుకి చేరుకున్నాడు.

Related posts

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Malli Nindu Jabili March 29 2024 Episode 610: 19వ తారీకు మాలిని కి పెళ్లి చేస్తే ధైర్యం ఉంటే ఆపవే అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu March 29 2024 Episode 2142: అంజలి శాంభవి గారిని ఎలా డి కొడుతుంది.

siddhu

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Guppedanta Manasu March 29 2024 Episode 1037: మనుని తిరిగి కాలేజ్ కి రమ్మని అనుపమ చెబుతుందా లేదా.

siddhu

Madhuranagarilo March 29 2024 Episode 325: శ్యామ్ ని సొంతం చేసుకోమని దాక్షాయిని చలపతి చెప్పిన మాటలు విన్న రుక్మిణి ఏం చేయనున్నది..

siddhu

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Paluke Bangaramayenaa March 29 2024 Episode 189: స్వర అభిలకు పెళ్లి జరిగిందని తెలుసుకున్న విశాల్ ఏం చేయనున్నాడు..

siddhu

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!