కాజల్ అగర్వాల్ తాజాగా తన పెళ్ళి వార్త ని చెప్పి అందరికీ సర్ప్రై ఇచ్చింది. గత కొంతకాలంగా కాజల్ పెళ్ళి విషయంలో రక రకాల రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఒకానొక సందర్భంలో కాజల్ తన పెళ్ళి కి సంబంధించి వస్తున్న వార్తల విషయంలో కాస్త సూటిగా సమాధానం చెప్పిన సంగతి తెలిసిందే. అయిన తన ఎంగేజ్మెంట్ అయిపోయిందని.. త్వరలో పెళ్ళి కూడా జరగబోతుందని ఫుల్ స్టాప్ లేకుండా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఎట్టకేలకి ఈ వార్తలకి అఫీషియల్ గా ఫుల్ స్టాప్ పెట్టేసింది కాజల్.
ఈ నెల 30 న ఇరు కుటుంబాలు, అత్యంత సన్నిహితుల సమక్షంలో పెళ్ళి చేసుకోబోతుంది. గత కొంతకాలంగా ప్రముఖ వ్యాపార వేత్త గౌతమ్ కిచ్లుతో ప్రేమలో ఉన్న కాజల్ ఫైనల్ గా పెళ్ళి కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కెరీర్ ప్రారంభం నుంచి కాజల్ విషయంలో ఎలాంటి కాంట్రవర్సీలు లేకపోవడం గొప్ప విషయం. ప్రముఖ దర్శకుడు తేజ దర్శకత్వంలో వచ్చిన లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయమైన కాజల్ అగర్వాల్ ఆ తర్వాత వరసగా యంగ్ హీరోలతో బ్లాక్ బస్టర్ సినిమాలు చేసింది.
తెలుగు, తమిళం, హిందీ భాషల్లో భారీ బడ్జెట్ సినిమాలలో నటించిన కాజల్ ప్రస్తుతం పాన్ ఇండియన్ సినిమాలు కమిటయింది. మెగాస్టార్ చిరంజీవి సరసన రెండవ సారి ఆచార్య లో నటిస్తుండగా కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. మంచు విష్ణు నటిస్తున్న మోసగాళ్ళు సినిమాతో పాటు మరికొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి.
ఇక తమిళం తో పాటు మిగతా భాషల్లో రూపొందుతున్న అత్యంత భారీ బడ్జెట్ సినిమా ఇండియన్ 2 లో నటిస్తోంది. ఈ సినిమా శంకర్ – కమల్ హాసన్ కాంబినేషన్ లో నటిస్తుంది. అలాగే ముంబై సాగా అన్న హిందీ సినిమా కూడా చేస్తున్న కాజల్ పెళ్ళి తర్వాత కమిటయిన సినిమాలు కంటిన్యూ చేస్తుందా లేదా అన నుమానాలు వ్యక్తమయ్యాయి. కాని కాజల్ దర్శక, నిర్మాతల హీరోయిన్ అని నిరూపించుకుంది. ప్రస్తుతం తను కమిటయిన సినిమాలన్ని పూర్తి చేస్తుందట. ఏ ఒక్క ప్రాజెక్ట్ కి ఇబ్బంది కలిగించకూడదని కాజల్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. నిజంగా ఇలా ఆలోచించే హీరోయిన్స్ ఎంతమంది ఉంటారు. అందుకే కాజల్ బంగారం అని అందరూ చెప్పుకుంటున్నారు.