Dear comrade: టాలీవుడ్లో అతికొద్ది కాలంలోనే స్టార్ హీరోగా అసాధారణమైన క్రేజ్ తెచ్చుకున్న యంగ్ హీరో విజయ్ దేవరకొండ. నాని, మాళవిక నాయర్, విజయ్ దేవరకొండ, తెలుగమ్మాయి రీతు వర్మ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా. ఈ సినిమాతో నాగ్ అశ్విన్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. స్వప్న సినిమా పతాకంపై అగ్ర నిర్మాత సి.అశ్వనీ దత్ వారసురాళ్ళు స్వప్న దత్, ప్రియాంక దత్ నిర్మించారు. కమర్షియల్‌గా అంత పెద్ద సక్సెస్ కాకపోయినా కూడా ఈ సినిమా చిత్రబృందానికి మంచి ప్రశంసలు దక్కాయి. ఈ సినిమాకంటే ముందు విజయ్ నువ్విలా, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే సినిమాలలో చిన్న పాత్రలు పోషించాడు.
ఇందులో విజయ్ దేవరకొండ పర్ఫార్మెన్స్ చూసిన చాలామంది మంచి హీరో అవుతాడని ఊహించారు. ఆ తర్వాత యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ దర్శకుడిగా పరిచయం అవుతూ, పెళ్లి చూపులు సినిమాను తెరకెక్కించాడు. అతి తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కించిన పెళ్లి చూపులు సినిమా మంచి కమర్షియల్ సక్సెస్‌ను సాధించింది. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ, రీతూ వర్మ హీరో హీరోయిన్గా పరిచయమయ్యారు. మంచి హిట్ కావడంతో విజయ్ దేవరకొండకి మంచి పేరొచ్చింది.
Dear comrade: ఈ సినిమా విజయ్ దేవరకొండపై ప్రభావం చూపించింది.
ఈ సినిమా తర్వాత ద్వారక అనే సినిమా చేసిన విజయ్‌కి ఆశించిన సక్సెస్ మాత్రం దక్కలేదు. అయితే అర్జున్ రెడ్డి సినిమా రూపంలో విజయ్ దేవరకొండకి ఏకంగా రౌడీ హీరో అనే ఇమేజ్ వస్తుందని ఏ ఒక్కరు ఊహించలేదు. సందీప్ రెడ్డి వంగా దర్శకుడిగా పరిచయమవుతూ రూపొందించిన అర్జున్ రెడ్డి సినిమా దేశం మొత్తం ఒక ఊపు ఊపేసింది. శాలినీ పాండే, విజయ్ దేవరకొండల పర్ఫార్మెన్స్ సినిమాకి హైలెట్‌గా నిలిచాయి. ముఖ్యంగా విజయ్ దేవరకొండ పర్ఫార్మెన్స్ ఓ పదేళ్ళైనా ఎవరూ మర్చిపోలేరు. అంతగా ఈ సినిమా విజయ్ దేవరకొండపై ప్రభావం చూపించింది.
ఈ సినిమాల తర్వాత ఏ మంత్రం వేశావే, మహానటి, గీత గోవిందం లాంటి సినిమాలు చేశాడు. వీటిలో గీత గోవిందం 100 కోట్ల క్లబ్లో చేరి విజయ్ దేవరకొండకి విపరీతమైన ఫ్యామిలీ ఆడియన్స్ ఫాలోయింగ్ తీసుకువచ్చింది. ఈ క్రమంలో వచ్చిన నోటా, టాక్సీవాలా ఒకటి హిట్‌గా ఒకటి ఫ్లాప్‌గా మిగిలాయి. వాస్తవంగా టాక్సీవాలా గీత గోవిందం సినిమాకి ముందే రిలీజ్ కావాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆగిపోయి గీత గోవిందం వచ్చి బ్లాక్ బస్టర్ అయ్యాక రిలీజై మంచి లాభాలు తీసుకువచ్చింది. అయితే విజయ్ దేవరకొండకి మళ్ళీ అర్జున్ రెడ్డి లాంటి హిట్ కావాలి.
Dear comrade: అందుకే డియర్ కామ్రేడ్ అనే సినిమా చేశాడు.
అందుకే డియర్ కామ్రేడ్ అనే సినిమా చేశాడు. ఇందులో హీరోయిన్ రష్మిక మందన్న. అసలు ఆమెను జనాలు చూడలేకపోయారు. ఇదొక పెద్ద మైనస్ అయింది. ఇక కథ, కథనం ఏమాత్రం బాగోలేవనే కామెంట్స్ వచ్చాయి. సినిమా రన్ టైం మరో పెద్ద మైనస్. ఎంత ఓపిగ్గా కూర్చున్నా విసుగొచ్చేస్తుంది. సాంగ్స్ కూడా చిరాకు తెప్పిస్తాయి. ఇలాంటి కారణాలు డియర్ కామ్రేడ్లో లెక్కకు మించి ఉన్నాయి. అందుకే ఈ సినిమా అర్జున్ రెడ్డి సినిమా కంటే పెద్ద హిట్ అవుతుందనుకుంటే అడ్రస్ లేకుండా పోయింది.