Tamannah: తమన్నా వరుస అవకాశాలు అందుకోవడానికి కారణాలు అవే..మేకర్స్‌కి ఇంతకంటే ఏం కావాలి.

Share

Tamannah: టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్..ఏ సినిమా ఇండస్ట్రీలోనైనా స్టార్ స్టేటస్ వచ్చాక హీరోయిన్‌ని మెయింటైన్ చేయడం చాలా కష్టం. మొదటి సినిమాకే మేకర్స్ చెప్పినట్టు కుదురుగా ఉంటారు. రెమ్యునరేషన్ అడగరు. ఎన్ని రోజులైనా డేట్స్ ఇస్తారు. ఎన్ని గంటలు సెట్ లో ఖాళీగా కూర్చోమన్నా ఒక్క మాట మాట్లాడకుండా సరే అంటారు. సరిగ్గా చేయలేదని అంటున్నా..ది బెస్ట్ ఇస్తానని చిన్న నవ్వుతో లోపల ఫీలింగ్స్‌ని కంట్రోల్ చేసుకుంటూ నెట్టుకొస్తారు. ఒక్కసారి ఒక. సినిమా బ్లాక్ బస్టరో, సూపర్ హిట్టో అయిందంటే చాలు ..ఇక చూపించే రేంజ్ వేరే లెవల్. నిర్మాతలు సూట్‌కేసులు పట్టుకొని ఎదురుగా కూర్చున్నా, కళ్ళకి కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని కాలు మీద కాలేసుకొని నోట్లో నుంచి మాట బయటకి రాకుండా నానుస్తూంటారు.

these are the reasons for Tamannah to get many chances.
these are the reasons for Tamannah to get many chances.

హీరోలు కూడా కొంతమంది మనకి ఆ అమ్మాయినే బుక్ చేయండి అంటే ఇక చచ్చింది గొర్రే. నిర్మాతకి ఫైనల్‌గా కావాల్సింది సినిమా హిట్ అవ్వాలి..పెట్టిన పెట్టుబడి తిరిగి రావాలి. అదృష్టం బావుంటే లాభాలు కావాలి. దానికొసం.. ఓకే బాబు, సరే బాబు.. అలాగే బాబు అంటూ యాక్టింగ్ రాకపోయినా భాష తెలీకపోయినా నిర్మాత అనే రెస్పెక్ట్ ఇవ్వకపోయినా అన్నిటికీ తలాడించేస్తారు. అర్జున్ రెడ్డి సినిమా చేసిన శాలినీ పాండే లాంటి వారు కూడా ఒక సినిమా కమిటై బాలీవుడ్‌లో ఓ బడా నిర్మాణ సంస్థ నుంచి ఒకేసారి నాలుగు సినిమాలకి సైన్ చేసే అవకాశం రాగానే ..కమిటైన సినిమాను వదిలేసి ముంబై చేక్కేసింది.

Tamannah: తరగని అందం తో పాటు ఒకే రకమైన ఫిజిక్‌ను మెయింటైన్ చేస్తోంది.

కానీ నిజంగా సినిమా అంటే ప్యాషన్ ఉన్నవారు..నిర్మాత పెట్టే డబ్బుకు, దర్శకుడు, హీరోలకి గౌరవం ఇచ్చేవారు మాత్రం ఏళ్ళ తరబడి ఇండస్ట్రీలో కొనసాగాలనుకుంటారు. సినిమా బడ్జెట్, హీరోలను బట్టే తమ రెమ్యునరేష కూడా అడుగుతుంటారు. నిర్మాతకి అన్నీ రకాలుగా సహకరిస్తుంటారు. అలాంటి వారే హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా అన్నీ భాషలలో నటించే అవకాశాలను అందుకుంటుంటారు. అలాంటి వారిలో తమన్నా ఒకరు. అనుష్క శెట్టి, కాజల్ అగర్వాల్, తమన్నా కాస్త అటు ఇటుగా ఒకే సమయంలో ఇండస్ట్రీకి హీరోయిన్‌గా పరిచయం అయ్యారు. వీరంతా నెమ్మదిగా అయినా సినిమాలు చేస్తున్నారు.

ఒక్క అనుష్క శెట్టి కాస్త ఈ మధ్య స్లో అయింది తప్ప కాజల్, తమన్నా మాత్రం మంచి దూకుడు మీదున్నారు. ముఖ్యంగా తమన్నా ఇండస్ట్రీకొచ్చి ఫేడౌట్ కాకపోవడనికి కారణం తన నాజూకు అందాలే. తరగని అందం తో పాటు ఒకే రకమైన ఫిజిక్‌ను మెయింటైన్ చేస్తోంది. మంచి టాలెంట్ ఉన్న హీరోయిన్. కథ, పాత్ర ఒకసారి అర్థం చేసుకుంటే ఎంత కష్టమైనా ఆ పాత్రను చేయడానికి శ్రమిస్తుంది. అందుకే తమన్నా అటు తమిళంలో, ఇటు తెలుగులో నటిస్తూనే హిందీ వెబ్ సిరీస్‌లలో కూడా నటించే అవకాశాలను దక్కించుకుంటోంది. మెగాస్టార్ చిరంజీవి లాంటి సీనియర్ హీరో అయినా, నితిన్ లాంటి యంగ్ హీరో అయినా తమన్నా పర్‌ఫెక్ట్‌గా సూటవుతుంది.

Tamannah: తమన్నా ఈ విషయంలో సూపర్ అని చెప్పుకుంటారు.

ఇక నిర్మాతలకి కావాల్సింది రెమ్యునరేషన్ డిమాండ్ చేయకపోవడం. తమన్నా ఈ విషయంలో సూపర్ అని చెప్పుకుంటారు. ప్రాజెక్ట్ బడ్జెట్ దృష్ఠిలో పెట్టుకొనే తన రెమ్యునరేషన్ చెబుతుందట. డేట్స్ ఇచ్చే విషయంలో కూడా మంచి ప్లానింగ్ ప్రకారమే కావలసినన్ని డేట్స్ ముందుగానే సర్దుబాటు చేస్తుందట. ఇక గ్లామర్ పాత్రలకి ఎప్పుడూ రెడీనే. తన అందాలతో ఆకట్టుకోవడం, డాన్స్‌తో ఇరగదీయడం అడీషనల్. ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టే తమన్నా కోసం మేకర్స్ ఎదురు చూస్తున్నారు. సెట్‌లో కూడా చాలా కూల్‌గా ఉంటుందట. ఇలాంటి హీరోయిన్ ఇంకో పదేళ్ళైనా అవకాశాలు అందుకుంటూ ఇండస్ట్రీలో కొనసాగగలదనడంలో సందేహాలే ఉండవు.


Share

Related posts

Tollywood : మల్టీస్టారర్స్ మీద క్రేజ్ పెరుగుతోంది..బడ్జెట్ కూడా అంతే పెటాల్సి వస్తోంది..!

GRK

Akkineni Samantha: అక్కినేని సమంత దెబ్బకు నాగార్జున పరిస్థితి ఎలా ఉండబోతోంది??

Naina

పవన్ కళ్యాణ్ సెట్ లో అడుగు పెట్టగానే వకీల్ సాబ్ టీజర్ డేట్ లాక్ చేశారట ..?

GRK