NewsOrbit
న్యూస్ హెల్త్

వివాహం లో జరిగే ఈ తప్పుల వలన జీవితం ఎలా ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా??

వివాహం లో జరిగే ఈ తప్పుల వలన జీవితం ఎలా ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా??

నేటి ఆధునిక  కాలం లో ఎన్నో మార్పులు వచ్చాయి .. అదేవిధంగా వివాహ విషయం లో కూడా రాకూడని మార్పులు వచ్చాయి . అర్ధం పర్ధం లేని ఒక వేడుకగా వివాహం మిగిలింది అనడం లో ఎలాంటి  ఆశ్చర్యం  లేదు. హంగులు ఆర్భాటాలు తప్ప వేదమంత్రాలకు వెలువ లేకుండా పోయినది.  ఇంకా చెప్పాలంటే వివాహం లో  అత్యంత పవిత్రమైన మాంగళ్య ముహూర్తానికి కూడా ప్రాధాన్యత ఇవ్వకుండా ముహూర్తం దాటాక మాంగల్యధారణ చేస్తున్నారు. అలా చేయడం వలన అన్యోన్యత లేకపోవటం, చిత్తచాంచల్యం, మనోవైకల్యం, మంచి సంతానం పొందలేకపోవడం వంటివి జరుగుతాయి.

వివాహం లో జరిగే ఈ తప్పుల వలన జీవితం ఎలా ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా??వివాహం లో తప్పనిసరిగా చేయవలిసిన ఇంకొక పని జీలకర్ర బెల్లంపెట్టుకున్న తర్వాత వధువరులు తప్పకుండా ఒకరి కళ్లలో ఒకరు చూసుకుంటూ చూపులు నిలపాలి. తప్ప వీడియోలు ఫోటోల వైపు చూడటంసరైనది కాదు. అవి  తీపి జ్ఞాపకాలే  కావొచ్చు, కానీ ఆ తీపి ఫొటోలో తప్ప జీవితం లో ఉండదు అని గుర్తుపెట్టుకోండి అలా చూపులు నిలపకపోవటం వలన భార్యాభర్త ల మధ్య ప్రేమ, సంస్కారం లోపించటం వంటివి జరుగుతాయి .

బియ్యపు తలంబ్రాల కు బదులు లేదా వాటిలో థర్మాకోల్ మరియు రంగుల పూసలు కలిపి  తలమీద పోసుకోవటం, వధూ వరుల మీద స్నో స్ప్రే కొట్టి నురగ పడేటట్టు చేయడం బహుదోషం గా  చెప్పబడింది. అలా చేయడం వలన బంధు ద్వేషం, ఆర్థిక ఇబ్బదులు తప్పవు అని గుర్తుపెట్టుకోవాలి

వధూవరులని ఆశీర్వదించేటప్పుడు బంధువులు చెప్పుల కాళ్లతో ఉండడం వలన మంటపంలో ఉండే దేవతలు వెళ్లిపోతారు. ఫలితంగా జీవితంలో ఇబ్బందులు పడవలిసి వస్తుంది.

బఫే భోజనాలు పెట్టడం వలన స్థిరం గా వచ్చిన అతిధి కూర్చుని భోజనం చేయక పోవడం వలన
అన్నదాన ఫలితం పొందలేరు. మైకుల్లో వేదమంత్రాలు వినకుండా వాటి స్థానంలో సినిమా పాటలు వినటం వలన దైవ కటాక్షం దూరమవుతుంది. ఇది వరకు కాలం వారు అన్ని నియమాలు పాటిస్తూ వివాహం ఒక యజ్ఞం లా చేసుకునే వారు కాబట్టి కలకాలం సిరిసంపదలతో అన్యోన్య దాంపత్యం తో జీవితాం అంతా బ్రతికే వారు.

అంతే కాదు వారు నిషిద్ధ రోజులలో, సమయాలలో శృంగారనికి దూరం గా ఉంటూ మంచి సమయం లో సంతానాన్ని పొందేవారు.. అందుకే అప్పటిలో ఇంతటి క్రూర మనుషులు ఉండేవారు కాదు. కానీ ఇప్పటి పరిస్థితులు దానికి పూర్తిగా భిన్నం గా ఉన్నాయి. విచ్చలవిడిగా సమయం తో పనిలేకుండా శృంగారం చేయడం వలన రాక్షసులు పుట్టుకొస్తున్నారు. ఇది ప్రతిఒక్కరు అలోచించి మార్చుకోవాలిసిన విషయం .
ఇవేకాక ఇంకా చాలా పొరపాట్లు చేస్తూనే ఉంటున్నారు .

అవన్నీ గ్రహించి శాస్త్రీయ విధానంగా వివాహం జరుపుకొని భగవంతుడి ఆశీర్వచనాలతో జీవితం గడుపుతూ మంచి సంతానం పొంది పదిమందికీ ఆదర్శంగా ఉండండి..
అందరికి చెప్పండి, తెలిసి చెప్పకపోతే తప్పు, చెప్పినా పాటించక పోతే అదివారి కర్మ. శాస్త్రం లో ప్రతి పనీ ఒక నిర్దుష్ట లక్ష్యం కోసం ఏర్పాటు చేసినవే.
వేదమంత్రాలు,శాస్త్రోక్తం గా వివాహం చేసుకోక పొతే ఏమి జరుగుతుందో తెలుసుకోవాలని.. 15000 మంది దంపతుల ను గడచిన 20 సంవత్సరాల నుంచి గమనిస్తూ ఒక పండితుల టీం చేసిన కృషికి అక్షర రూపం ఈ వ్యాసం. అందరికి అందేలా చూడండి.

Related posts

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju