Mutual Funds: సాధారణంగా మ్యూచువల్ ఫండ్స్ రిస్క్ తో కూడుకున్నవి. అందుకే చాలామంది వీటిలో డబ్బు ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపించరు. కానీ ఎక్కువ రాబడి ఇచ్చిన కొన్ని మ్యూచువల్ ఫండ్స్ స్కీం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. ఇవి మీ డబ్బులు రెట్టింపు చేయడంలో దిట్ట అని చెప్పడంలో సందేహం లేదు.

మ్యూచువల్ ఫండ్స్ లో భాగంగా క్వాంట్ యాక్టివ్ ఫండ్ 32 శాతం రాబడిని ఇచ్చింది. అంటే మూడు సంవత్సరాల క్రితం ఈ ఫండ్లో లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఉంటే.. ఇప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్ విలువ అక్షరాలా రూ.2.3 లక్షలకు చేరి ఉండేది.
మహేంద్ర మను లైఫ్ మల్టీ క్యాప్ ఫండ్ కూడా 21% రాబడిని అందించింది. అంటే మీరు మూడు సంవత్సరాల క్రితం ఒక లక్ష రూపాయలు ఈ ఫండ్ లో ఇన్వెస్ట్ చేసి ఉంటే దాని విలువ రూ.1.77 లక్షలకు చేరేది.
అలాగే నిప్పాన్ ఇండియా మల్టీ క్యాప్ ఫండ్ కూడా గత మూడేళ్లలో 18.9% రాబడిని అందించింది
ఒకవేళ మీరు మూడు సంవత్సరాల క్రితం లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఉంటే దాని విలువ రూ. 1.68 లక్షలు గా ఉండేది.
బరోడా జి.ఎన్.టి పారి బాస్ మల్టీ క్యాప్ ఫండ్ కూడా 17.5% రాబడిని అందించింది. ఈ ఫండ్ లో లక్ష రూపాయలు పెట్టి ఉంటే దాని విలువ రూ.1.62 లక్షలకు చేరి ఉండేది.
వీటితోపాటు ఐసిఐసిఐ ఫ్రుడెన్షియల్ మల్టీ క్యాప్ ఫండ్ కూడా 17% రాబడిని అందించింది. లక్ష రూపాయల ఇన్వెస్ట్మెంట్ కి రూ.1.59 లక్షలు లభించేవి.