న్యూస్ సినిమా

బిగ్ బాస్ బ్యూటీ మోనాల్‌ను చూసి ఓర్వలేకపోతున్నది ఎవ్వరో తెలుసా?

బిగ్ బాస్ బ్యూటీ మోనాల్‌ను చూసి ఓర్వలేకపోతున్నది ఎవ్వరో తెలుసా?
Share

స్టార్ మా  ఛానల్ లో ప్రసారమయ్యే తెలుగు బిగ్ బాస్ రియాలిటీ షో తెలుగు ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకున్నదో టీఆర్పి రేటింగ్స్ ను గమనిస్తేనే మనకి క్లారిటీ వచ్చేస్తుంది. ప్రతి సీజన్  లో లాగానే ఈ సీజన్  లో కూడా కొన్ని లవ్ ట్రాక్స్ ను పెట్టి ఈ షో ని  మరింత ఉత్కంఠగా మార్చారు బిగ్ బాస్ సిబ్బంది.

తాజాగా జరిగిన బిగ్ బాస్ సీజన్ 4 లో తన అందచందాలతో ప్రేక్షకులను ఎంతగానో అలరించిన నటి మోనాల్ గజ్జర్. ఈ గుజరాతీ భామ హౌస్ లో ఉన్నప్పుడు ఓ వైపు టాస్క్‌ల్లో అదరగొడుతూనే మరోవైపు మరో కంటెస్టెంట్ అఖిల్‌తో క్లోజ్‌గా మూవ్ అవుతూ రొమాన్స్ చేస్తూ ప్రేక్షకులను అలా కట్టిపడేసింది. ఇక ఈ జోడి రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంతో పాపులారిటీ ని సంపాదించుకుంది.

ఇక మోనాల్ గజ్జర్ అలా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు రావడంతోనే ఈ ముద్దుగుమ్మకు బయట సూపర్ డిమాండ్ వచ్చేసింది. అందులో భాగంగానే బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన అల్లుడు అదుర్స్ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్‌ లో స్టెప్పులేసి బాగానే ఆకట్టకుంది. ఈ పాట బాగా ట్రెండ్ అవ్వడంతో ప్రస్తుతం మోనాల్ కు అన్నీ ఇలాంటే ఆఫర్సే వస్తున్నాయట. అందుకే మన పెద్దలు చెప్పిన్నట్టు దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అన్న సామెతను మోనాల్ బాగా  అనుసరిస్తున్నట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం ఈమెకు బాగా డిమాండ్ ఉండడంతో ఐటెం సాంగ్ చేయాలి అంటే రూ.50 లక్షలు దాక రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తోందట. దీంతో టాలీవుడ్ లో ఎప్పటినించో ఉన్న ఇతర  హీరోయిన్స్ మోనాల్ ను చూసి ఓర్వలేకపోతున్నారట అంతేకాకుండా ఏవైనా షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ కి మోనాల్ పది లక్షలు డిమాండ్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. 

 


Share

Related posts

Healthy drinks: మీరు వీటిని తాగుతున్నారా? అయితే సమస్యలు తప్పవు!!

Naina

మ‌హేష్ బాట‌లో ఎన్టీఆర్‌…

Siva Prasad

బాబు ఇంటి ముందు టిడిపి నేత ధర్నా ! ఎందుకట?

Yandamuri
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar