seeds: మన శరీరంలో హార్మోన్స్ కీలక పాత్ర పోషిస్తాయి.. మనిషి ఆలోచన, పని చేయడం, దినచర్య అన్ని పనులు హార్మోన్స్ మీదే ఆధారపడి ఉంటాయి.. మానసిక చక్రాన్ని ప్రభావితం చేసేది హార్మోన్స్.. ప్రస్తుతం మన ఆహారపు అలవాట్లు, పోషక పదార్థాలు కొరత, చెడు లైఫ్ స్టైల్ కారణంగా హార్మోన్స్ ప్రభావితం అవుతున్నాయి.. అటువంటి హార్మోన్స్ సమతుల్యత కోసం మనం మన డైట్ పై శ్రద్ధ తీసుకోవాలి.. హార్మోన్స్ సమతుల్యత కోసం ఎటువంటి గింజలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
గింజలలో లభించిన పోషకాలు మరే అతిశయోక్తి కాదు పొద్దుతిరుగుడు విత్తనాలలో విటమిన్ ఈ సెలీనియం సమృద్ధిగా ఉంటాయి ఈ రెండు ప్రొజెస్టారోన్ హార్మోన్ ను అభివృద్ధి చేస్తాయి.. సన్ ఫ్లవర్ విత్తనాలను నానబెట్టి తినచ్చు.. మిగతా పండ్లతో కలిపి తినవచ్చు. లేదంటే సలాడ్ రూపంలో కూడా తీసుకోవచ్చు. ఎలా తీసుకున్నా కూడా ఇవి మన హార్మోన్స్ కు మేలు చేస్తాయి. అదేవిధంగా అవిస గింజలు ఇవి ఈస్ట్రోజన్ ఉత్పత్తిలో దోహదపడతాయి. అవిసె గింజలను కూడా నానబెట్టి తినవచ్చు లేదంటే పొడిగా చేసుకుని పెరుగు, సలాడ్, స్మూతీ, మజ్జిగలో అవిస గింజల పొడి తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది..
Mahbeera Health Benefits: Mahabeera Seeds uses in Telugu
చియా విత్తనాలలో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్, క్యాల్షియం సమృద్ధిగా లభిస్తాయి. చియా సీడ్స్ వల్ల నెలసరి ముందుగా కనిపించే లక్షణాల నుంచి మనకు ఉపశమనాన్ని అందిస్తాయి. ఈ విత్తనాల్ని కనీసం రెండు గంటల పాటు నానబెట్టి తీసుకోవాలి. ఈ విత్తనాల పైన కొద్దిగా నిమ్మరసం తీసుకోవచ్చు లేదంటే సలాడ్ రూపంలో కూడా తీసుకోవచ్చు. గుమ్మడికాయ విత్తనాలు హార్మోన్స్ ను సమతుల్యతగా ఉంచుతాయి.. వీటిని కూడా నానబెట్టుకుని తినవచ్చు. లేదు అంటే నీకు నచ్చిన పదార్థాలలో కలుపుకుని తీసుకోవచ్చు..