Diabetes: మధుమేహం ఉన్న వారు నిరభ్యంతరంగా ఈ పండ్లను తినవచ్చట..!!

Share

Diabetes: రక్తంలో గ్లూకోజ్ స్థాయిల హెచ్చుతగ్గుల కారణంగా డయాబెటిస్ వస్తుంది.. మధుమేహంతో బాధపడేవారు పోషకాహారం ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవాలి.. మనం తీసుకునే ఆహారం కంటే పండ్లలో ఎక్కువ పోషకాలు ఉంటాయి.. అయితే మధుమేహంతో బాధపడేవారు అన్ని రకాల పండ్లను తినకూడదు.. వాటిలో కొన్ని పండ్లను మాత్రమే తినాలి.. అయితే మధుమేహం ఉన్న వారు ఈ పది రకాల పండ్లను నిరభ్యంతరంగా తినవచ్చని పలు అధ్యయనాలలో నిరూపితమైంది.. డయాబెటిస్ ఉన్నవారు ఏ 10 రకాల పండ్లు తినవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..!!

These Ten Fruits Diabetes: can eat undoubtedly because
These Ten Fruits Diabetes: can eat undoubtedly because

రోజుకో యాపిల్ తింటే డాక్టర్ దగ్గరకు వెళ్లడం అవసరం లేదని అందరికీ తెలిసిందే.. అటువంటి ఆపిల్ ను రోజుకు ఒకటి తింటే అందులో ఉన్న పోషకాలు డయాబెటిక్ లెవెల్స్ ను తగ్గిస్తాయి.. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్ తో బాధపడేవారు వీటిని వారి డైట్ లో భాగం చేసుకుంటే చక్కని ఫలితాలు కలుగుతాయి. షుగర్ ఉన్నవాళ్లు తీసుకోవాల్సిన రెండో పండు బొప్పాయి బొప్పాయిలో సహజసిద్ధమైన స్వీట్నర్ ను కలిగి ఉంటుంది. ఈ పండును వారంలో రెండుసార్లు తీసుకోవడం వలన షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంచుతాయి వీటిని తినటం వలన డయాబెటిక్ సెల్ డ్యామేజ్ కాకుండా శరీరాన్ని కాపాడుతాయి. నిమ్మజాతి పండ్లలో ఆరెంజ్ ఒకటి. దీనిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దీనిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది కొంచెం తిన్నా కూడా కడుపు నిండుగా ఉంటుంది. కొంతమంది మధుమేహులకు ఎక్కువ ఆకలిగా ఉంటుంది. అటువంటి వారు ఆరెంజ్ ను తీసుకుంటే చిరుతిళ్ళ జోలికి వెళ్ళనివ్వదు. ఇది రక్తంలో ఉండే చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. పియర్ పండ్లలో చక్కెర తక్కువగా ఉంటుంది. ఇది డయాబెటిక్ లెవెల్స్ ను తగ్గించడానికి సహాయపడుతుంది. వీటిని తినడం వల్ల టైప్ 2 డయాబెటిస్ నుంచి బయటపడవచ్చని పలు అధ్యయనాలలో తేలింది. కివి పండ్లలో విటమిన్ సి, ఇ, కె సమృద్ధిగా ఉన్నాయి. ఇందులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో గ్లూకోజ్ హెచ్చుతగ్గులను నియంత్రిస్తాయి. డయాబెటిస్ డైట్ లో ఖచ్చితంగా ఈ ఫ్రూట్ ప్రత్యేక స్థానం ఉంది.

మీరు తినదగిన మరో ఫ్రూట్ పుచ్చకాయలు.. డయాబెటిస్ ఉన్నవారు నీటిశాతం ఎక్కువగా ఉండే పండ్లను తీసుకోవాలి. ఇందులో విటమిన్ బి, సి, పొటాషియం, ఫైబర్ అధికంగా ఉంటాయి. అంతేకాకుండా ఎలక్ట్రోలైట్స్ అనే ప్రత్యేక ఖనిజాలను కలిగి ఉన్నాయి. ఇవి మీ శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి. అయితే పుచ్చకాయలను ఒకేసారి రెండు అంతకంటే ఎక్కువ ముక్కలు తినకూడదు. అవకాడో లో చాలా తక్కువ మోతాదులో చెక్కెర ఉంటుంది. ఇందులో శరీరానికి అవసరమైన మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది. విటమిన్లు ఖనిజాలు ఉంటాయి. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీనిని ఏ రూపంలో తీసుకున్నా కూడా మంచిదే. డయాబెటిస్ ఉన్నవారు బెర్రీస్ పండ్లను ఎంచుకోవడం ఉత్తమ మార్గం. వీటిలో బ్లాక్ బెర్రీ, బ్లూ బెర్రీ, స్ట్రాబెర్రీస్ ఇలా ఏ రకం పండ్ల నైనా తీసుకోవచ్చు. వీటిలో 18 గ్రాముల చక్కెర ఉంటుంది. ఈ పండు షుగర్ను నియంత్రణలో ఉంచడానికి దోహదపడుతుంది. స్టార్ ఫ్రూట్ ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఇన్ఫ్లమేటరీ ప్రక్రియను సజావుగా సాగేలా చేస్తాయి. సేల్స్ డామేజ్ అవకుండా చూస్తాయి. ఒకవేళ సెల్స్ డ్యామేజ్ అయితే వాటిని రిపేర్ చేయడంలో ఇది ఎంతగానో దోహదపడతాయి. మీరు ఎంచుకోవాల్సిన పండ్ల లో డ్రాగన్ ఫ్రూట్ ఒకటి ఇందులో విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్ న్యూట్రియన్స్ వంటి పోషకాలతో నిక్షిప్తమై ఉంది. ఈ పండ్లను తినటం వలన డయాబెటిక్ లెవెల్స్ ను నియంత్రణలోకి తీసుకురావడానికి ఉపయోగపడతాయి. అయితే పండ్లను అన్నిటినీ కలిపి తినకూడదు. రోజుకి ఒకరకం లేదా రెండు రకాల ను మాత్రమే తినాలి . వాటిని కూడా ఉదయం సాయంత్రం భోజనానికి ముందు తీసుకోవడం మంచిది.


Share

Related posts

Ys Jagan Mohan Reddy : జగన్ రోజుకి 300 కోట్లు సంపాదిస్తున్నాడు అంటున్న మాజీ టీడీపీ ఎంపీ..!!

sekhar

నిరాశతో ఉన్నమీ ప్రియమైన వాళ్లకు ఇది పంపి..వారిఆనందానికి కారణం అవ్వండి.

Kumar

‘గోల్కొండ టైగర్’ బద్దం బాల్‌రెడ్డి కన్నుమూత

sarath