మెగా ఫామిలీ లో నిహారిక పెళ్లి వేడుక జరుగుతున్న విషయం మనకి విదితమే. మెగా కుటుంబ సభ్యులు అందరూ ఇప్పటికే ఉదయపూర్ పాలస్ కు చేరుకున్నారు. నిన్న రాత్రి సంగీత్ లో మెగా ఫామిలీ మొత్తం చిందేసింది.
నిహారిక కొణిదెల మరియు చైతన్య జొన్నలగడ్డల పెళ్లికి అన్ని ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. వీరి వివాహం రేపు రాత్రి 7 గంటల 15 నిమిషాలకు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరగనున్న విషయం తెలిసిందే. రేపు రాత్రి జరగనున్న ఈ పెళ్లి వేడుకలో పాల్గొనడానికి మెగా కుటుంబం మొత్తం ప్రైవేట్ ఫ్లైట్ లలో ఉదయపూర్ కు తరలి వెళ్లింది.
పెళ్లి నేపథ్యంలో నిహారిక పోస్ట్ చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. పెళ్లికూతురితో మెగా సిస్టర్స్ దిగిన ఫోటోలకు మెగా ఫాన్స్ మురిసిపోతు కుందనపు బొమ్మలు మా మెగా డాటర్స్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మొన్న రాత్రి ఉదయపూర్ కు చేరుకున్న మెగాస్టార్ చిరంజీవి కూడా నిహారికతో కలిసి ఫొటో దిగి తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్టు చేశారు.
తాజాగా ఈ రోజు తనతో చిన్నప్పుడు నిహారిక దిగిన ఫొటోలను కూడా చిరంజీవి పోస్ట్ చేసి కాస్త ఎమోషనల్ అయ్యారు. చిన్నప్పుడు నిహారిక ఎత్తుకుని ఆయన అప్పట్లో దిగిన ఫోటోను పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ లో ‘మా చేతిలో పెరిగిన మా చిన్నారి నిహారికని, చైతన్య చేతిలో పెడుతున్న ఈ శుభతరుణంలో, ముందస్తుగా, కాబోయే దంపతులకు నా శుభాకాంక్షలు, ఆశీస్సులు’ అని చిరు నవ వధువరులను ఆశీర్వదించారు.