పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమాలు తీసే కొత్త నిర్మాతలకు దర్శకులకు ఆందోళనకరమైన అంశం ఒకటి ఎదురవుతోంది.పవన్ కల్యాణ్ ఆహార్యం వారికి ఇబ్బంది కలగచేస్తోంది. కానీ ఆ విషయం ఆయనకు చెప్పాలంటే ఎవరికీ ధైర్యం చాలడం లేదు.
విషయానికొస్తే పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి తర్వాత ఏ సినిమాలోనూ నటించలేదు.2019 ఎన్నికల సమయంలో కాస్త బిజీగా తిరిగారు .ఇక సినిమాలు కూడా చేయనన్నట్లు చెప్పేశారు.ఆ ఎన్నికల ఫలితాలు పవన్ కల్యాణ్‌కు పెద్ద షాకిచ్చాయి ఆయన రెండు నియోజకవర్గాల్లో ఓడిపోయారు.సరే షరామామూలే అన్నట్టు మళ్ళీ పవన్ కల్యాణ్ సినిమాల్లో నటించడానికి ముందుకొచ్చారు. నాలుగు సినిమాల్లో నటించడానికి ఏర్పాట్లు చేసుకున్నారు .వకీల్ సాబ్ సినిమా వెంటనే ప్రారంభమైపోయింది కూడా.ఇంతలో కరోనా కారు మేఘాలు చిత్ర పరిశ్రమను కమ్మేశాయి.
లాక్ డౌన్ వల్ల, షూటింగులు ఆగిపోయాయి. వరుసగా సినిమాపై సినిమా చేద్దామన్న పవన్ ఆశలు గల్లంతయ్యాయి. వకీల్ సాబ్ ని పూర్తి చేయడం పవన్ ముందున్న ప్రధాన లక్ష్యంగా మారింది. షూటింగులకు మళ్లీ వాతావరణం అనుకూలించడంతో, మెల్లమెల్లగా స్టార్లంతా బరిలోకి దిగుతున్నారు. పవన్ సైడ్ నుంచి కూడా అంతా ఓకే. వచ్చే నెలలోనే `వకీల్ సాబ్` షూటింగ్ మొదలుకానుంది. పవన్ కూడా బరిలో దిగడానికి సిద్ధంగానే ఉన్నాడు. కాకపోతే.. పవన్ ఫిట్ నెస్పైనే దర్శకుల బెంగ. లాక్డౌన్ తో పవన్ బరువు పెరిగాడు. గెడ్డం, జుత్తూ పెంచి – హీరో లుక్‌కి చాలా దూరం నిలబడ్డాడు. పవన్ ఇది వరకటి షేప్ లోకి రావడానికి కాస్త టైమ్ పడుతుంది. ఇప్పటి నుంచి పవన్ తన ఫిట్ నెస్‌పై దృష్టి పెడితే తప్ప – షూటింగులు మొదలయ్యేసరికి ఫిట్ గా మారడు.
కానీ.. పవన్ ఫిట్ నెస్ పై ఏమాత్రం గురి పెట్టలేనట్టు తెలుస్తోంది. పైగా పవన్ ఇప్పుడు దీక్షలో ఉన్నాడు. ఈ సమయంలో.. ఫిట్ నెస్ గురించి ఆలోచించడం కూడా కష్టమే. వకీల్ సాబ్ లో లుక్ కీ, ఇప్పటి లుక్ కీ చాలా తేడా వుంది. ఆ విషయం గుర్తు చేసి, ఫిట్ నెస్ పై దృష్టి పెట్టమని సలహా ఇవ్వడానికి దర్శకులకూ, నిర్మాతలకూ ధైర్యం సరిపోవడం లేదు. పవన్ తనంతట తాను గ్రహించి, మళ్లీ కసరత్తులు మొదలెడితే గానీ, హీరో లుక్ లోకి మారడు. పవన్ కోసం ప్రత్యేకమైన ట్రైనర్ ని, లుక్ ని మార్చాలని దిల్ రాజు భావిస్తున్నట్టు సమాచారం. మరోవైపు క్రిష్‌కీ ఇదే ఆలోచన వచ్చింది. కానీ.. దాన్ని పవన్ దృష్టికి తీసుకెళ్లడానికి ఆలోచిస్తున్నారు. ఎప్పుడు ఏ విధంగా రియాక్ట్ అవుతాడో చెప్పలేని పవన్ తన ఫిట్నెస్ గురించి దర్శక నిర్మాతలు చెబితే వింటాడా లేక వారినే ఏమన్నా అంటాడా అన్నది జవాబు దొరకని ప్రశ్న !