NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

Thieves Hulchul: సందట్లో సడేమియా..! మంత్రి పర్యటనలో చోరాగ్రేసరుల హస్తలాఘవం..! నేతల జేబులు ఖాళీ..! ఎక్కడంటే..?

Thieves Hulchul: ప్రజా సమస్యలు తెలుసుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడం ప్రజా ప్రతినిధుల విధి, కార్యకర్తలు,  కార్యక్రమాలకు వచ్చిన ప్రజా ప్రతినిధులను నాయకులు, కార్యకర్తలు బొకేలు అందజేసి స్వాగతం పలుకుతుంటారు. ప్రజాప్రతినిధులైన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల కార్యక్రమాలకు పోలీసులు బందోబస్తు నిర్వహిస్తుంటారు. అయితే మంత్రుల పర్యటనలో పోలీస్ బందోబస్తు ఉన్నప్పటికీ చోరాగ్రేసరులు (జేబు దొంగలు) తమ హస్తలాఘవాన్ని ప్రదర్శించి నేతల జేబులు ఖాళీ చేశారంటే వారి విధులను వారు సక్రమంగా నిర్వహించినట్లే కదా..! శనివారం యాదాద్రి జిల్లాలో మంత్రుల పర్యటన జరగ్గా సందట్లో సడేమియా అన్నట్లు జేబు దొంగలు తమ చేతి వాటాన్ని ప్రదర్శించి భారీ ఎత్తున నేతల డబ్బులు కాజేశారు.

Thieves Hulchul in Telangana ministers Programme at yadadri bhuvanagiri district
Thieves Hulchul in Telangana ministers Programme at yadadri bhuvanagiri district

Read More: Malla reddy Vs Revanth Reddy: రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయాలపై నాడు చంద్రబాబుకు ఫిర్యాదు చేశానంటూ మల్లారెడ్డి హాట్ కామెంట్స్.

వివరాల్లోకి వెళితే..యాదాద్రి జిల్లా మోత్కూరులో శనివారం వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా తెలంగాణ మంత్రులు నిరంజన్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, ఎంపి లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ పాల్గొన్నారు. వీరు పట్టణానికి చేరుకోగానే పలువురు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు వారికి స్వాగతం పలుకుతూ ఫోటోలకు ఫోజులు ఇచ్చే పనిలో నిమగ్నమైయ్యారు. ఇదే అదనుగా ప్రజా ప్రతినిధుల పక్కన పోలీసులు ఉన్నప్పటికీ డోంట్ కేర్ అన్నట్లుగా జేబు దొంగలు తమ చేతి వాటంతో  నేతల జేబులను ఖాళీ చేశారు. అయితే నేతల స్వాగత కార్యక్రమాలను వీడియో తీస్తుండగా జేబు దొంగలు నేతల జేబులో చేయి పెట్టి డబ్బులు తీసుకోవడం కూడా రికార్డు అయ్యింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

మోత్కూరు  జడ్ పీ టీ సీ భర్త సంతోష్ రెడ్డి జేబులో నుండి రూ.40వేలు, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ శ్రీనివాస్ జేబు నుండి రూ.37 వేలు, శౌలిగౌరారం చెందిన రైతు జేబు నుండి రూ.25వేలు, అడ్డగూడూరుకు చెందిన టీఆర్ఎస్ నాయకుడు అరవింద్ జేబు నుండి రూ.5వేలు జేబు దొంగలు కాజేశారు. అయితే డబ్బు పోగొట్టుకున్న వారిలో కొందరు పోలీసులకు ఫిర్యాదు చేయగా, మరి కొందరు మాత్రం తమ అజాగ్రత్తే కారణం అనుకుని నిమ్మకుండిపోయారు. పోలీస్ బందోబస్తు ఉన్న సమయంలోనే జేబు దొంగలు ఎటువంటి భయం లేకుండా తమ హస్త లాఘవాన్ని ప్రదర్శించడం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. ఇకపై నేతల పర్యటనలో జాగ్రత్తగా ఉండాలని నేతలు అనుకుంటున్నారు.

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju