Thimmarusu Review: తిమ్మరుసు మూవీ రివ్యూ

Thimmarusu Review satyadev shines as lawyer
Share

Thimmarusu Review: తెలుగులో విన్నూత పాత్రలు పోషిస్తూ… ఇప్పుడిప్పుడే తన సొంత మార్క్ క్రియేట్ చేసుకున్న యంగ్ హీరో సత్యదేవ్ నటించిన ‘తిమ్మరుసు’ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మహేష్ కోనేరు నిర్మాణం బాధ్యతలు చేపట్టారు. తెలుగు యంగ్ బ్యూటీ ప్రియాంక జవాల్కర్ కథానాయికగా నటించింది. బ్రహ్మాజీ, వైవా హర్ష, రవిబాబు, అజయ్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం..

 

Thimmarusu Review satyadev shines as lawyer

కథ

ఈ చిత్రం క్యాబ్ డ్రైవర్… చైతన్య మర్డర్ తో మొదలవుతుంది. నేరస్తులు చైతన్య మర్డర్ కేసులో వాసు అనే ఒక అమాయకుడిని ఇరికించి ఎనిమిది సంవత్సరాలు జైలు శిక్ష పడేలా చేస్తారు. అప్పుడే లాయర్ రామచంద్ర (సత్యదేవ్) సీన్ లోకి వచ్చి ఆ మర్డర్ కేస్ రీ ఓపెన్ చేస్తాడు. అసలు క్యాబ్ డ్రైవర్ ను ఎవరు చంపారు…? వాసుని నేరస్థుడిగా ఎందుకు చిత్రీకరించారు…? ఈ మొత్తం మిస్టరీలో ప్రియాంక జవాల్కర్, బ్రహ్మాజీ పాత్రల ప్రాముఖ్యత ఎంత అన్నదే మిగిలిన కథ

ప్లస్ పాయింట్స్

  • మనందరికీ సత్యదేవ్ ఎంతటి మంచి యాక్టర్ అన్నది తెలుసు. అయితే ఇప్పటివరకూ తన క్లాస్ పర్ఫార్మెన్స్ తో ఆడియన్స్ మన్ననలు పొందిన సత్య మొదటిసారి తనలోని మాస్ యాంగిల్ కూడా చూపించాడు. ఫైట్స్, డైలాగ్ డెలివరీ, ఎమోషనల్ సీన్లు అని ఎటువంటి తేడా లేకుండా అన్నింటిలో అదరగొట్టాడు.
  • ఇక చాలా రోజుల తర్వాత బ్రహ్మాజీ కి ఒక మంచి పాత్ర వచ్చింది. సత్యదేవ్ స్టార్ హీరో రేంజ్ లో చెలరేగిపోతుంటే మధ్యలో సపోర్టింగ్ క్యారెక్టర్ లో బ్రహ్మాజీ మెప్పించాడు. కామెడీ కూడా వీరిద్దరి మధ్య బాగా పండింది.
  • క్యాస్టింగ్ ఈ చిత్రంలో చాలా మెచ్చుకోలు గా ఉంది అనే చెప్పాలి. పోలీస్ గా అజయ్, వాసు క్యారెక్టర్ చేసిన యువకుడు, ప్రియాంక జవాల్కర్ అందరూ సినిమాకు న్యాయం చేశారు.
  • ఇక చిత్రంలో చాలా భాగం థ్రిల్, సస్పెన్స్ మెయింటెన్ చేయడంలో దర్శకుడు సఫలమయ్యాడు. రెండవ అర్ధ భాగంలో వచ్చే విలన్ యాంగిల్ కూడా ఆకట్టుకుంటుంది. ప్రతి సీన్ కట్టిస్తూ డైరెక్టర్ తెర మీద చూపించే విధానం… చివరికి ముగింపు కూడా బాగానే ఉంది.

మైనస్ పాయింట్స్

  • ఈ సినిమాకు అన్నిటికన్నా పెద్ద నెగిటివ్ ఓవర్ బిల్డ.ప్ చాలా సీన్లకి అంత స్కోప్ లేకపోయినా హీరో ని హైలైట్ చేయడం నేరాన్ని ఉన్న పరిమాణం కన్నా ఎక్కువ చూపించడం బాగా ఎక్కువైపోయింది.
  • ఈ ఓవర్ బిల్డప్ వల్ల కొన్ని చోట్ల లాజిక్ మిస్ అయింది. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ పైగా లాయర్ కథానాయకుడిగా ఉన్నచోట్ల లాజిక్ మిస్ అయితే మొత్తం కథాంశమే భారీగా దెబ్బ తింటుంది.
  • ప్రియాంక జవాల్కర్ పాత్రను మరికొంత బలపరచి ఉంటే బాగుండేది అనిపించింది. ఇక చిత్రం జరిగే కొద్దీ సన్నివేశాలు కూడా చాలా నిదానంగా వస్తూ ఉంటాయి. మొదటి అర్ధభాగం సాగదీయకుండా కొద్దిగా ఎంగేజింగ్ గా పెట్టి ఉంటే బాగుండేది.

విశ్లేషణ

మొత్తానికి ‘తిమ్మరుసు’ ఆసక్తికరమైన బ్యాక్ డ్రాప్ నుండి వచ్చిన చక్కటి క్రైమ్ డ్రామా. ఈ చిత్రం లో వచ్చే థ్రిల్ ఎలిమెంట్స్, సస్పెన్స్ సన్నివేశాలు చిత్రానికి ప్రధాన బలం. మొదటి అర్ధ భాగం సాగదీయడం… కొన్ని చోట్ల లాజిక్ మిస్ కావడం తప్పించి సత్యదేవ్ అత్యద్భుత ప్రఫార్మెన్స్, మిగిలిన వారి సపోర్టుతో ఈ చిత్రాన్ని ఈ వీకెండ్ కు ఒకసారి చూసేయొచ్చు.

చివరి మాట: తిమ్మరుసు త్రాసు థియేటర్ దగ్గర తూగింది. 


Share

Related posts

బిగ్ బాస్ 4 : అభిజీత్ మీద పిచ్చకోపంగా ఉన్న హారిక ఫ్యామిలీ ??

sekhar

జగన్ – అమిత్ షా కలయిక వెనుక ఇంత కథ ఉందా..??

Muraliak

ఎలెక్ట్రిక్ మోడల్ లో ఆడాళ్ల బండి.., ఫీచర్లు అదిరాయండి..!

bharani jella