ట్రెండింగ్ న్యూస్ సినిమా

Thimmarusu: తిమ్మరుసు ట్రైలర్ ను విడుదల చేసిన జూనియర్ ఎన్టీఆర్..!!

Share

Thimmarusu: విలక్షణ నటుడు సత్యదేవ్, ప్రియాంక జవాల్కర్ నటిస్తున్న చిత్రం తిమ్మరుసు.. బ్రహ్మాజీ, రవిబాబు, అంకిత్, అజయ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.. శరన్ కొప్పి శెట్టి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్ లో మహేష్ కోనేరు, శ్రీజన్ యరబోలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన పోస్టర్స్ , టీజర్, పాటలకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.. తాజాగా “తిమ్మరుసు ట్రైలర్” ను యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ విడుదల చేశారు..!!

Thimmarusu: Trailer Released by Junior NTR
Thimmarusu: Trailer Released by Junior NTR

తాజాగా విడుదలైన ట్రైలర్ అందర్నీ ఆకట్టుకుంటోంది. ఈ ట్రైలర్ తో సినిమాపై అంచనాలను మరో లెవల్ కి తీసుకెళ్ళింది. సత్యదేవ్ నటన హైలెట్ గా నిలిచింది. మిగతా వారు వారి పాత్రలలో జీవించారు. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి యూ/ఎ సర్టిఫికేట్ ను జారీ చేసింది. జూలై 30 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. లాక్ డౌన్ తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలలో థియేటర్లో విడుదలవుతున్న మొదటి చిత్రం ఇదే..


Share

Related posts

WTC Final: వర్షం వల్ల ఏ జట్టు కి ఎంత లాభం?

arun kanna

Saiee manjrekar : సాయి మంజ్రేకర్ ఆ స్టార్ హీరోతో సినిమా చేయడం లేదంటూ రూమర్స్ కి చెక్ పెట్టేసింది ..!

GRK

జూనియర్ ఎన్టీఆర్ కి కూడా ఆ శక్తి లేదట ! ఏమిటది ? ఎవరన్నారు??

Yandamuri