జీతము రాగానే మొట్ట మొదటి ఖర్చుగా ఉప్పు కొనండి. ఇలా చేయడం వలన మీ డబ్బు వృధా ఖర్చులు కాకుండా వృద్ధి చెందే అవకాశము ఉన్నది. ఆడవారు ఎప్పుడు జుట్టు విరబోసుకుని ఉండకూడదు. ఇది ఇంటికి దారిద్య్రాన్ని తెస్తుంది. ఇంట్లో శుభములు జరుగుటకు ఆటంకాలు కలగటానికి కారణమవుతుంది.
కాలి పైకాలు వేసుకొని కుర్చోవడము, కాళ్లాడిస్తూ కూచోవడం, ఒంటి కాలితో నిలవడం, స్థిరముగా నిలబడకుండా ఉగుతుండడం లాంటి పనులు చేయకూడదు. అందువల్ల ఒకటి కష్టనష్టాలకి కారణం అయితే మరొకటి ఆ ప్రదేశములు బలహీనమై త్వరగా విరుగుటకు అవకాశములు ఎక్కువ.
ఎవ్వరికైనా ఇవ్వడం లేదా తీసుకునే టప్పుడు ఎల్లప్పుడు కుడి చేతిని మాత్రమే వాడాలి. ఎడమ చేతిని ఉపయోగించ కూడదు.
నెలసరి సమయమందు ఆడవారు తలలో పూలు పెట్టుకోకూడదు. పూలు వాకిట్లో అమ్మడానికి వస్తే వద్దు అని చెప్పుకూడదు. రేపు తీసుకుంటాను అని అనవలెను. మన నోటి నుండి ఎప్పుడు చెడ్డ మాటలు, అసభ్యకర మాటలు, కాలిపోతోంది , మండిపోతోంది , పీడ , దరిద్రం, శని పీనుగా కష్టము, అనే పదములను ఎప్పుడు ఉపయోగించ కూడదు.
ఇంట్లో దుమ్ము ధూళి, సాలెగూడు కట్టడం వస్తువులు చిందర వందరగా పడేయడం, లాంటివి దారిద్రన్నీ తెచ్చిపెడతాయి. మంగళ, శుక్ర వారములు కాకుండా పది రోజులకు ఒకమారు ఇళ్లు దులిపి శుభ్రము చేసుకోవాలి.ఇల్లు ఎల్లప్పుడూ శుభ్రం గా సువాసన భరితం గా ఉండాలి. ప్రతి రోజు ఉదయం లేచిన తర్వాత ముందుగా బ్రష్ చేసుకుని ఇల్లు ఊడ్చుకుని స్నానం చేసిన తర్వాత మాత్రమే స్టవ్ వెలిగించి వంట చేసుకోవాలి. వంట చేసేటప్పుడు దేవుడి పాటలు, శ్లోకాలు లేదా మీకు ఇష్టమయిన సంగీతం వింటూ వంట చేయడం వలన అది అమృతం అవుతుంది. మనస్సు ప్రశాంతం గా ఉంచుకుని పాజిటివ్ గా ఉండి వంట చేస్తే దాని వలన కుటంబ సభ్యులు ఆరోగ్యం గా ఉంటారు.