Happy: ఈ నాడు ఉన్న సామాజిక పరిస్థితులలో మన దేశం లో ఉన్న ఆచారాలు, సంప్రదాయాలు, పెద్దలు చెప్పే మాటల పట్ల ఒక నిర్లక్ష్యధోరణి చిన్న చూపు కలిగి ఉన్నారని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. అయితే మన పురాణాలు, శాస్త్రాలు, లో గొప్పతనం.. వాటిలోని వైజ్ఞానికత నేటి మన ఆధునిక విజ్ఞాన శాస్త్రం ద్వారా రుజువవు చేయబడుతుంది. అలాగే నేటి విజ్ఞాన శాస్త్రం కనుగొన్న హార్మోన్స్ గురించి చదివి తెలుసుకునపుడు అవి దైవానికి ప్రతీకలా అని అనిపించక మానదు.
హార్మోన్ అనేది ఒక దివ్య రసాయనం అని అనిపిస్తుంది. మన యొక్క మనోభావాలను అనుసరించిశరీరం లో హార్మోన్స్ పుడుతుంటాయి. అవి భావాల ప్రేరణ వల్ల పుడుతూనే.. భావాలను ప్రేరేపిస్తుంటాయి అనేది నిజం. దుఃఖపడటం, బాధ పాడడం,ఆందోళన చెందడం ప్రారంభిస్తే.. ఎక్కువసార్లు ఇలా జరిగితే.. హార్మోన్స్ క్రమం తప్పకుండా ప్రతి రోజూ అదేసమయానికి వెలువడటంమొదలుపెడతాయట. అలా వెలువడే హార్మోన్లు మళ్లీ భవిష్యత్తులో అదే సమయానికి దుఃఖపడే అవసరం గురించో ,రాబోయేది దుఃఖమనో ఇలాంటి భావాలను కలిగించి దుఃఖపడేలా చేస్తాయట.
గర్భవతిగా ఉన్నప్పుడు తల్లిఆనందం గా ఉంటే పుట్టినబిడ్డ జీవితం ఆనందంగా ఉంటుందని, ఆనందంగా నిద్ర లేస్తే ఆ రోజంతా ఆనందించవచ్చని, ఏడుస్తూ లేస్తే ఆ రోజంతా ఏడుపేనని చెప్పే మన ఆచారాలు ఎంత వైజ్ఞానికాలో అర్ధం చేసుకోవచ్చు. సుఖ సంతోషాలతో గడపకుండా తరచు గతాన్ని గురించో, భవిష్యత్తు గురించి ఆలోచించి బాధ పడేవారు దురదృష్టవంతులని, ప్రతి క్షణం ఆనందం గా ఉండటం మన చేతిలో పనేనని అర్థమవుతుంది. మన సుఖ దుఃఖాలకు మనమే కారణమన్న మన పెద్దల మాటలు ఎంతటి అర్థవంతాలో ఆధునిక పరిశోధనలూ మనకు చాల క్లియర్ గా అర్థమయ్యేలా చేస్తున్నాయి.