NewsOrbit
న్యూస్

అదిగదిగొ కరోనా టీకా..! కీలక దశలో

 

 

అదిగదిగో చందమామ అన్నట్లు ఉంది కరోనా టీకా పరిస్థి. కరోనా వ్యాప్తి మొదలు అయ్యాయి సంవత్సరం అయినా దీనికి మందు ఇంకా ట్రైల్స్ దశలోనే ఉంది.కరోనా పైన పోరులో విజయం సాధించడం అంటే దానికి టీకా కనిపెట్టడమే, ప్రపంచ దేశాలు అన్ని ఈ వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది అన్ని ఎదురు చూస్తూనే ఉన్నారు. పలు పరిశోధనా సంస్థలు.. వాటితో టై అప్ అయిన ఫార్మా కంపెనీలు వ్యాక్సిన్ తయారీపై పెద్ద ఎత్తున సిద్దమయ్యాయి. భారత్ దేశం లో కూడా పరిశోధన సంస్థలు, వ్యాక్సిన్ కోసం ప్రయత్నిస్తుంది. అలాగే మిగిలిన దేశాలలో ట్రైల్స్ దశ లో ఉన్న టీకా కూడా మన దేశవ్యాప్తంగా పలు చోట్ల ప్రయోగాలు కొనసాగుతున్నాయి. అయితే, అన్ని ప్రయోగాల దశలోనే ఉండడం,దేశ ప్రజల చేతికి ఎప్పుడు వస్తుంది అనే విషయం మీద ఇంకా క్లారిటీ లేకపోవడం గమనార్హం.తూది దశలో ఉన్న వ్యాక్సిన్ ల వివరాలు.

 

ఫైజర్:
అమెరికాకు చెందిన ఫైజర్ కంపెనీ, జర్మన్ బయో టెక్ సంస్థ..బయో ఎన్ టెక్ కరోనపై యుద్ధంలో కీలకవిజయం సాధించినట్టు,వ్యాక్సిన్‌ మూడోదశ క్లినికల్‌ ట్రయల్స్‌ 90 శాతం మేలైనదని అన్నే విషయం ప్రకటించింది. మూడోదశ క్లినికల్‌ ట్రయల్స్‌లో భాగంగా 94 మందిపై క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించిన తరువాత పరిశోధనల్లో, ఏడురోజుల్లో వాలంటీర్లకు వ్యాధి నిరోధక శక్తి వచ్చినట్టు వెల్లడించింది. తొలిదశలో వ్యాక్సిన్‌ వేసుకున్న వాలంటీర్లలో 28 రోజుల తరువాత ఇమ్యూనిటీ పవర్‌ వచ్చినట్టు వివరణ ఇచ్చింది.అయితే ఈ వ్యాక్సీన్ రక్షణ పరంగా ఎంతవరకు ఉపయోగపడుతుందన్నది తేలవలసి ఉంది. మొదట ఫైజర్ సంస్థ రెండు నెలల సేఫ్టీ ఫాలో అప్ ను సమర్పించాల్సి ఉంటుంది.ఈ కారణంగా దీనికోసం ఇండియా ఆతృతగా వేచి చూస్తున్నప్పటికీ..ఇప్పట్లో ఈ టీకామందు అందుబాటులోకి వచ్ఛేలా లేదు. మరొకవైపు, దాన్ని నిల్వ చేయడానికి 70 డిగ్రీల ఉష్ణోగ్రత అవసరమన్న వార్త పెద్ద సవాలనే విసురుతుంది. దీనితో ఇప్పుడు ఈ వ్యాక్సిన్ కొనుగోలు చెయ్యాలా? లేదా అనే గందరగోళంలో ఉండిపోయింది. భారత జనాభాకు సరిపడా వ్యాక్సిన్‌ డోసులు ఇప్పట్లో అందుబాటులోకి వచ్చే అవకాశం లేదని నీతి ఆయోగ్‌ సభ్యుడు (ఆరోగ్యం) డాక్టర్‌ వి.కె.పాల్‌ తెలిపారు. అయినప్పటికీ.. ప్రభుత్వం ముందున్న ప్రత్యామ్నాయలేంటి అన్నదానిపై దృష్టిసారించామన్నారు. ఏదేమైనా ఫైజర్‌ టీకా భారత్‌కు రావడానికి మరికొన్ని నెలలు పట్టొచ్చని అన్నే విషయం అర్ధం అవుతుంది.

కోవీషీల్డ్ :
ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన మరో వ్యాక్సిన్ కోవిషీల్డ్, ఉత్పత్తి, పంపిణీ ఒప్పందాన్ని కుదుర్చుుకున్నారు భారత్ దేశానికీ చెందిన సీరం ఇన్స్టిట్యూట్, ఐసీఎంఆర్. దేశవ్యాప్తంగా పలు చోట్ల ప్రయోగాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మూడో దశ క్లినికల్ ట్రయల్స్ కొనసాగుతుండగా.1600 మంది వాలంటీర్లను ఇందుకోసం వినియోగిస్తున్నారు. ఇది మూడోవ దశలో ట్రైల్స్ విజయవంత ఫలితాలు ఇస్తే ఇది డిసెంబర్ చివరి నాటికీ మార్కెట్ లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

 

స్పుత్నిక్ వి:
దేశీయ ఫార్మా దిగ్గజమైన డాక్టర్ రెడ్డీస్ ,రష్యన్ వ్యాక్సిన్ స్పుత్నిక్ వి తో భారీ ఒప్పందం కుదుర్చుకుంది. ప్రపంచపు తొలి వ్యాక్సిన్ ను రిజిస్టర్ చేసిన రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్ వి తో డాక్టర్ రెడ్డీస్ భారీ డీల్ చేసుకుంది. స్పుత్నిక్ వి వ్యాక్సిన్ ను పంపిణీ, క్లినికల్ ట్రయల్స్ చేయడానికి రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ ( ఆర్‌డీఎఫ్ ) తో ఈ ఒప్పందమైంది. దీని ప్రకారం పదికోట్ల డోసుల కోవిడ్-19 వ్యాక్సిన్‌ ను డాక్టర్ రెడ్డీస్ ఉత్పత్తి చేయనుంది.ఇప్పుడు జరుగుతున్న మూడోదశ ట్రయల్స్ విజయవంతమైతే ఈ ఏడాది చివరి నాటికీ వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకొస్తామని రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ సీఈవో కిరిల్ దిమిత్రేవ్ వెల్లడించారు. స్పుత్నిక్ వి వ్యాక్సిన్ ప్రధానంగా అడెనోవైరల్ వెక్టర్ ప్లాట్‌ఫాంపై ఆధారపడి ఉంటుందన్నారు. దశాబ్దాలుగా 250 కి పైగా క్లినికల్ అధ్యయనాలలో పరీక్షించియయ ఎటువంటి దీర్ఘకాలిక ప్రతికూలతలు లేకుండా సురక్షితమైన పద్ధతిగా ఈ అడెనోవైరల్ వెక్టర్ ప్లాట్ ఫాం ఉందని రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ సీీఈఓ తెలిపారు. ఈ వ్యాక్సిన్ ఉత్పత్తి కోసం డాక్టర్ రెడ్డీస్ తో పాటు మరో నాలుగు భారతీయ కంపెనీలతో చర్చలు జరుపుతున్నామన్నారు.

 

మోడెర్నా:
అమెరికాకు చెందిన ఫార్మా దిగ్గజం మోడెర్నా సోమవారం కోవిడ్ -19 వ్యాక్సిన్ అభ్యర్థి ప్రాణాంతకమైన వైరల్ వ్యాధిని నివారించడంలో దాదాపు 95% ప్రభావవంతంగా ఉందని ప్రకటించారు. 2020 చివరి నాటికి 20 మిలియన్ల వ్యాక్సిన్ మోతాదులను ఉత్పత్తి చేయనున్నట్లు కంపెనీ తెలిపింది.

 

కోవ్యాక్సిన:
భారతదేశానికి చెందిన భారత్ బయోటెక్ సంస్థ, పూణేలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీతో కలిసి అభివృద్ధి చేసిన బ్రాండ్ పేరు కోవ్యాక్సిన. దీన్ని మూడవ దశ ట్రయల్స్ ప్రారంభించినట్లు భారత్ బయోటెక్ సోమవారం ప్రకటించింది. మూడవ దశ ట్రయల్స్ భారతదేశం అంతటా 26,000 మంది వాలంటీర్లను కలిగి ఉంటాయి మరియు ఐసిఎంఆర్ భాగస్వామ్యంతో నిర్వహించబడతాయి. భారతదేశంలో కోవిద్ -19 వ్యాక్సిన్ కోసం నిర్వహించిన అతిపెద్ద క్లినికల్ ట్రయల్ ఇది. భారతీయ బయోటెక్ రూపొందించిన కోవాక్సిన్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) మరియు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవి) సహకారంతో అభివృద్ధి చేయబడింది. ఈ స్వదేశీ, క్రియారహిత వ్యాక్సిన్‌ను భారత్ బయోటెక్ యొక్క బిఎస్ఎల్ -3 (బయో-సేఫ్టీ లెవల్ 3) బయో కంటైనేషన్ సదుపాయంలో అభివృద్ధి చేసి తయారు చేస్తారు. కోవాక్సిన్ (టిఎమ్) అత్యంత శుద్ధి చేయబడిన మరియు క్రియారహితం చేయబడిన వ్యాక్సిన్, ఇది వెరో సెల్ తయారీ వేదికలో తయారు చేయబడుతుంది, ఇది 300 మిలియన్ మోతాదులకు పైగా మోతాదుల యొక్క అద్భుతమైన భద్రతా ట్రాక్ రికార్డుతో తయారు చేయబడింది.

కరోనాకి నాజల్‌ డ్రాప్స్:
కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ముందువరుసలో ఉన్న స్వదేశీ సంస్థ భారత్ బయోటెక్ వైరస్‌ను ఎదుర్కొనేందుకు నాజల్‌ డ్రాప్స్‌ (ముక్కులో వేసుకునే చుక్కల మందు)పైన ప్రయోగాలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని ఆ సంస్థ సీఎండీ డాక్టర్‌ కృష్ణా ఎల్లా వెల్లడించారు. హైదరాబాద్‌లోని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన దక్కన్‌ డైలాగ్‌ వర్చువల్‌ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రస్తుతం తాము కొవాగ్జిన్‌పై మూడో విడుత క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఇది డబుల్‌ డోస్‌ ఇంజెక్టబుల్‌ టీకా అని పేర్కొన్నారు. దీన్ని దేశంలో అందరికీ అందించాలంటే 260 కోట్ల సిరంజీలు, సూదులు అవసరమవుతాయని ఆయన వివరించారు. ఇది చాలా కష్టంతో కూడుకున్నదని ఆయన వెల్లడించారు. అందుకే తాము దీనికి ప్రత్యామ్నాయంగా నాజల్‌ డ్రాప్స్‌ అభివృద్ధిపై దృష్టి సారించామని తెలిపారు. ఇది ముక్కులో ఒక్కసారి వేస్తే సరిపోయే చుక్కల మందు అని వివరించారు.వచ్చే ఏడాదిలో ఇది అందుబాటులోకి రానున్నట్లు కృష్ణా ఎల్లా ఆశాభావం వ్యక్తం చేశారు.

కరోనా వ్యాక్సిన్లు అన్ని తూది దశకు చేరుకున్న నేపథ్యంలో, వ్యాక్సిన్ ఈ ఏడాది దేశంలో అందుబాటులోకి వచ్చే అవకాశాలు చాల ఎక్కువ గా కనిపిస్తున్నాయి. టీకా అందుబాటులోకి వచ్చిన వెంటనే దేశవ్యాప్తంగా పంపిణీ చేస్తామన్న ప్రధాని మోదీ హామీని నెరవేర్చేందుకు కృషి చేస్తున్నామని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ తెలిపారు. ఈ మేరకు ఓ ప్రత్యేక ప్రణాళికను రూపొందిస్తున్నారు. అది తుది దశలో ఉందన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన వివరాల్ని రాష్ట్ర ప్రభుత్వాలతో పంచుకున్నామన్నారు. టీకా రాగానే తొలుత వ్యాక్సిన్‌ ఇవ్వాల్సిన వర్గాలకు సంబంధించిన జాబితాను సైతం సిద్ధం చేశామన్నారు. ఈ మేరకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, మంత్రిత్వ శాఖలతో సమన్వయం చేస్తున్నామన్నారు. అయితే టీకా వచ్చేఅంతవరకు స్వీయ జాగ్రత్తలు మాస్క్, శానిటైజెర్ వంటివి తప్పక పాటించాలి అన్ని నిపుణులు తెలియచేస్తున్నారు. ఈ సంవత్సరం చివరి నాటికీ తుది దశలో ఉన్న టీకాలు సత్ఫలితాలు పొంది, కరోనా కి విరుగుడు మందు రావాలి అన్ని ప్రజలు అందరు ఎదురు చూస్తున్నారు.

Related posts

కోడ్ వ‌చ్చాక… స‌ర్వేల్లో వైసీపీకీ సీట్లు త‌గ్గుతున్నాయెందుకు….?

ఆ మంత్రిని ద‌గ్గ‌రుండి మ‌రీ ఓడించేస్తోన్న జ‌గ‌న్‌… ఇంత ప‌గ ఏంటి…!

ఒక్క భీమిలి సీటు కోసం ఇంత మంది పోటీయా… గంటాకు నో ఛాన్స్‌..?

గంటాను గురి చూసి కొట్టేసిన చంద్ర‌బాబు… తొక్కేసేంది ఎవ‌రంటే…!

చంద్ర‌బాబు ప్ర‌క‌టించిన అభ్య‌ర్థులు మ‌ళ్లీ మార్పులు.. షాక్‌లు ఎవ‌రికంటే..!

కొడాలి కూసాలు కుదిపేస్తున్న ‘ వెనిగండ్ల ‘ .. గుడివాడ‌లో స‌రికొత్త మార్పు.. !

ఏం చేశార‌ని ‘ గ‌ద్దె ‘ కు ఓటేయాలి… సొంత సామాజిక వ‌ర్గంలోనే ఎదురీత‌..!

ఎన్టీఆర్ టు లోకేష్‌కు న‌మ్మిన బంటు.. వ‌యా చంద్ర‌బాబు… టీడీపీకి మ‌న‌సు పెట్టిన మారాజు ‘ య‌ర‌ప‌తినేని ‘

MLC Kavitha: సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ ను ఉపసంహరించుకున్న కవిత

sharma somaraju

Highest Paid Indian Actors: ఇండియాలో అత్య‌ధిక రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్న హీరో ఎవ‌రు.. ప్ర‌భాస్ ఏ స్థానంలో ఉన్నాడో తెలుసా?

kavya N

Tamilisai: తమిళి సై రాజీనామాకు ఆమోదం .. ఝూర్ఖండ్ గవర్నర్ రాధాకృష్ణన్ కు అదనపు బాధ్యతలు

sharma somaraju

Breaking: భారీ ఎన్‌కౌంటర్ .. నలుగురు మావో అగ్రనేతల హతం

sharma somaraju

YSRCP: చంద్రబాబుకు ఈసీ నోటీసులు .. 24 గంటల్లో అవి తొలగించాలి

sharma somaraju

YS Jagan: వైసీపీ ఎన్నికల ప్రచారం .. జనంలోకి జగన్ .. 21 రోజుల పాటు బస్సు యాత్ర  

sharma somaraju

RS Praveen Kumar: బీఆర్ఎస్ కు కాస్త ఊరట .. గులాబీ కండువా కప్పుకున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

sharma somaraju