మూడో టెస్ట్ తొలి రోజు భారత్ 215/2

బాక్సింగ్ డే టెస్ట్ లో తొలి రోజు ఆట ముగిసే సరికి భారత్ రెండు వికెట్లు కోల్పోయి 215 పరుగులు చేసింది.  పుజారా 68 పరుగులతోనూ, కెప్టెన్ కోహ్లీ 47 పరుగులతోనూ క్రీజులో ఉన్నారు.

అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ కు క ొత్త ఓపెనర్లు శుభారంభాన్ని ఇచ్చారు. హనుమ విహారి తక్కువ స్కోరు 8 పరుగులే చేసినప్పటికీ మయాంక్ అగర్వాల్ తో 40 పరుగుల భాగస్వామ్యం నిర్మించాడు. మయాంక్ అగర్వాల్ డెబు టెస్ట్ లోనే హాఫ్ సెంచరీ చేశారు. 72 పరుగుల చేసిన మయాంక్ కమ్మిన్స్ బౌలింగ్ లో వికెట్ కీపర్ పింఛ్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తరువాత ఛటేశ్వర్ పుజారా, కెప్టెన్ విరాట్ కోహ్లీ సమయోచింతగా ఆడుతూ మరో వికెట్ పడకుండా కాచుకున్నారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి పుజారా 68 పరుగులతోనూ, కెప్టెన్ విరాట్ కోహ్లీ 47 పరుగులతోనూ క్రీజ్ లో ఉన్నారు.