NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

అవినీతి, ఆరోపణలతో తిరుమల వెంకన్న ఛానెల్

మొన్నటి మొన్న సాక్షత్తు ఛానెల్ చైర్మన్ రాసాలీలలు చేసి పదవి పోగుట్టుకుంటే, నిన్న ఛానెల్ ఉద్యోగులు ఏకంగా నీలి చిత్రాల లింకులు భక్తుడికి పంపి తిరుమల వెంకన్న సొంత మీడియా ఛానెల్ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ పరువు తీశారు. అసలు ఎందుకు ప్రతిసారి ఎస్విబిసి ఛానెల్ విషయాలు బయటకు వస్తున్నాయి అంటే దీని వెనుక రాజకీయాలు బోలెడు ఉన్నాయి. ముఖ్యంగా ఛానెల్ నిర్వహణ లో బోలెడు పెత్తనాలు, ఒత్తిడి లు, అధికారం అన్ని ఛానెల్ నిర్వహణను అబసుపాలు చేస్తున్నాయి. ఎస్విబిసి లో నిధులకు కొదవ లేకపోవడం, స్వాతంత్రత ఛానెల్ లో రాజకీయాలు పుట్టించి లేనిపోని గొడవలకు దారి తీస్తున్నాయి. గతంలో ఛానెల్ విషయంలో ఎన్నో విషయాలు బయటకు వచ్చిన వాటిపై అధికారులు సరి ఐన ద్రుష్టి పెట్టకపోవడంతో ప్రతిసారి ఛానెల్ పరువు, భక్తుల మనోభావాలు దెబ్బ తీసే చర్యలు సాగుతున్నాయి.

ఎన్నో… ఎన్నెన్నో…!!

శ్రీవారి నిత్యసేవలను, బ్రహ్మోత్సవాలను ప్రపంచ నలుమూలల ఉన్న శ్రీవారి భక్తులకు ప్రత్యక్షంగా చూపించాలన్న లక్ష్యంతో 13 సంవత్సరాల క్రితం ఎస్విబిసి ఛానల్ ఏర్పాటు చేశారు. స్వామి వారికీ జరిగే నిత్య కైంకర్యాలు, సేవలు ప్రతి ఒక భక్తుడు నిత్యం చూడాలని భావించే దీన్ని ఏర్పాటు చేశారు. మొదట్లో టీటీడీ ఈవో ఛానల్ కు హెడ్ గా ఉండేవారు. తర్వాత దీనికి ప్రత్యేక చైర్మన్ నియమించి స్వాతంత్రత ఇచ్చారు.
* టిటిడి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం 25 కోట్ల బడ్జెట్ కేటాయిస్తూ 250 మంది సిబ్బంది ఉన్నారు.
* ఎస్విబిసి లో అత్యంత కీలక విభాగాలైన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్, చీఫ్ టెక్నికల్ ఆఫీసర్,  చీఫ్ ప్రోగ్రామింగ్ ఆఫీసర్ లాంటి పోస్టులను గత కొన్ని సంవత్సరాలుగా భర్తీ చేయలేదు. ఫలితంగా బయట వ్యక్తులను తీసుకువచ్చిన వ్యక్తులు ఛానెల్ లో కీలకంగా వ్యవహారిస్తున్నారు.
* ఇటీవల వివాదం కు కారణం అయిన “శతమానం భవతి” “భగవంతునికి భక్తునికి మధ్య అనుసంధాన”కార్యక్రమం ప్రతినిత్యం శ్రీవారి భక్తులు పెళ్లి రోజు,పుట్టిన రోజు శుభాకాంక్షలు శతమానం భవతి కార్యక్రమం ద్వారా పొందడం సాక్షాత్తు శ్రీవారి ఆశీస్సులు అందినంత అనుభూతిని పొందుతారు. ఈ కార్యక్రమం కోసం భక్తులు పంపిన మెసెజ్ లకు ప్రతి మెసెజ్ పంపే సమయంలో సిబ్బంది నీలి చిత్రల లింక్ పంపారు. * అంతే కాదు విచారణలో సిబ్బంది కార్యాలయంలోని ఆన్లైన్ రమ్మీ ఆడుతున్నట్లు విచారణలో వెలుగుచూసింది. ఇదే కాకుండా నిషేధిత సైట్లు విచ్చలవిడిగా ఓపెన్ చేసి చూస్తున్నట్లు విజిలెన్స్ విచారణలో తేలింది. ప్రాథమిక విచారణలో ఐదు మంది అని తేలిన కార్యాలయంలోని అన్ని సిస్టమ్స్ లోనూ నిషేధిత సైట్లు ఓపెన్ అయినట్లు సాంకేతిక విభాగం తేల్చింది.
* ఎస్వీబీసీ ఛానల్ లో నైపుణ్యత కలిగిన వారిని పక్కనపెట్టి వారికి సముచిత స్థానం కల్పించకుండా తమకు అనుకూలంగా ఉన్న వారికి అర్హత లేకపోయినా కీలక బాధ్యతలు అప్పగించడం కారణంగా ఛానల్ ప్రతిష్ట మసకబారుతోంది. ఎస్విబిసి లో గతంలో జరిగిన నిధుల దుర్వినియోగంపై
హై కోర్టులో కేసు నడిచింది. * కోర్టు ఆదేశాలు మేరకు 2018 లో టీటీడీ విజిలెన్స్ విచారణ వేసింది. సుమారు 2 కోట్ల 20 లక్షలు అవినీతి జరిగిందని తేల్చి, అప్పటి సీఈవో నరసింహ రావు ను తొలగించారు. తప్ప నిధుల రికవరీ లేదు.
* ఏదయినా డిజిటల్ చానల్ను ప్రారంభించినప్పుడు దాని ద్వారా వచ్చే యాడ్స్ ఆదాయం ప్రధాన రెవెన్యూ అవుతుంది. ఎస్విబిసి కు యాడ్స్ ఆదాయం మొదట్లో భారీగా వచ్చింది. అయితే తర్వాత ఎస్విబిసి యాడ్స్ ను క్రమంగా తగ్గించారు. ఛానెల్ ఆదాయం ఇవ్వకపోగా, ఏటా టీటీడీ 25 కోట్లు కేటాయించి ఛానెల్ ను పోషిస్తుంది. అసలు ఇప్పటివరకు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు? ఏ కార్యక్రమానికి ఖర్చు పెట్టారు? కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి తీసిన శ్రీవారి సేవలు, కార్యక్రమాల టేప్ లు ఎక్కడ ఉన్నాయి? అసలు ఉన్నాయా లేవా అన్నదానిపై ద్రుష్టి లేదు.
* శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ లో ఉద్యోగస్తులు పని తీరు మీద అజమాయిషీ లేదు. కనీసం వారితో ఒక సమావేశం ఏర్పాటు ఉండదు. ఎస్విబిసి లో జరుగుతున్నా వరుస వివాదాల నేపథ్యంలో ఎస్విబిసి సిబ్బంది తో టిటిడి ఉన్నతాధికారులు నెలలో ఒకసారైనా సమన్వయ సమావేశం ఏర్పాటు చేస్తే బాగుటుంది అని ఉద్యోగ సంఘ నాయకులు కోరుతున్నారు.

author avatar
Special Bureau

Related posts

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju