ఒక రకంగా చెప్పాలంటే బాలీవుడ్ లో ఖాన్ లు, కపూర్ ల హవా ముగిసి చాలా కాలం అయింది. ఎవడికి టాలెంట్ ఉంటే అక్కడ ఆడే స్టార్. ఇప్పుడు పైన ఉన్న టైటిల్ చూసి షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్. రణ్ బీర్ కపూర్ వంటి స్టార్ లు ఈ పారితోషికం అందుకుంటున్నారు అని అనుకోకండి. బాలీవుడ్ లో ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేస్తూ… ఒక్కో సినిమా కు ఏకంగా వంద కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న ఏకైక నటుడు అక్షయ్ కుమార్. ఇక అతని చిత్రాలకు ఉండే సక్సెస్ పర్సంటేజ్ కూడా చాలా ఎక్కువ.
బాలీవుడ్ లో అందరికన్నా అక్షయ్ కుమార్ తీసుకునే పారితోషికం ఎక్కువ. అతను కేవలం 2019 సంవత్సరం లోనే 290 కోట్ల రూపాయలు సంపాదించాడు అంటే అది మామూలు విషయం కాదు. మన తెలుగులో ఒక స్టార్ హీరో సినిమా 100 నుండి 150 కోట్ల బడ్జెట్ తో రూపొందుతుంది. బాహుబలి తర్వాత ప్రొడక్షన్ వ్యాల్యూస్ పెరిగాయి కానీ ఇప్పటికీ కూడా దాదాపు అన్నీ స్టార్ హీరో సినిమాల బడ్జెట్ లు అదే రేంజ్ లో ఉన్నాయి. అయితే తాజాగా అక్షయ్ కుమార్ తన రాబోయే సినిమాలకు పారితోషికాన్ని 135 కోట్లు గా ఫిక్స్ చేశాడట. కరోనా నేపథ్యంలోని ఓ సినిమాకు 99 కోట్ల రూపాయలు తీసుకున్న అక్షయ్ లాక్ డౌన్ లో మరో సినిమాకు 108 కోట్లు తీసుకున్నాడట.
ఇక ఇటీవల సంతకం చేసిన చిత్రాల కోసం 117 కోట్లు. 2022లో విడుదలకానున్న చిత్రాలకోసం 135 కోట్ల రూపాయలు ఫిక్స్ చేశాడు అని చెబుతున్నారు .అక్షయ్ కుమార్ కు ఆడియన్స్ లో ఉండే క్రేజ్, మార్కెట్ ను బట్టి అంత మొత్తాన్ని ఇచ్చేందుకు అంగీకరిస్తున్నారు. అతని చిత్రాల నిర్మాణం కేవలం 30 నుండి 50 కోట్ల లోపల పూర్తి అయిపోతుంది. పబ్లిసిటీ, ప్రమోషన్స్ కలుపుకొని దాదాపు 60 నుండి 70 కోట్లు మధ్యలోనే ఒక సినిమా ఉంటుంది. ఇక అక్షయ్ పారితోషికం కలుపుకుంటే బడ్జెట్ 200 కోట్ల పరిధిలో ఉంటుంది. లాభాలు కూడా అదే రేంజ్ లో లేకపోతే నిర్మాతలు మాత్రం ఎందుకు ధైర్యం చేస్తారు చెప్పండి. అతని చిత్రాలకు శాటిలైట్ రైట్స్ ద్వారానే 80 నుండి 90 కోట్లు వెనక్కి వస్తుంది ఇక హిట్ టాక్ వచ్చింది అంటే నిర్మాతలు గల్లా పెట్టె గళగళలాడాల్సిందే.