బిగ్ బాస్ ఇంటి లో పదవ వారం నామినేషన్ ప్రక్రియ ఒక్కసారిగా వాతావరణాన్ని పూర్తిగా మార్చేసింది. అందరూ అరియానా ను టార్గెట్ చేయడం మనం బాగా గమనించవచ్చు. ఒకప్పుడు మరొక లెక్క ఇప్పటి నుండి ఇంకొక లెక్క అన్నట్లు కంటెస్టెంట్స్ మిగతా వారిపై రెచ్చిపోతున్నారు. అయితే ఒక్క అవినాష్ తప్పించి మిగిలిన ఏడుగురి కన్ను అరియానా పైనే ఉండటం విశేషం.
ఇలా అరియానా అందరికీ టార్గెట్ అయింది. ప్రజల్లో ఆమెకు ఉన్న ఆదరణ గురించి తెలుసుకోవాలంటే మరో నాలుగు రోజులు ఆగక తప్పదు. అఖిల్, సోహెల్ ఒకటయ్యారు. మిగతా వారు గ్రూపులు కట్టడం మొదలుపెట్టారు. అయితే తదుపరి పన్నాగంగా స్మార్ట్ బాయ్ అభిజిత్ ను కూడా డేంజర్ జోన్ లో పడేసేందుకే అని వార్తలు వినిపిస్తున్నాయి.
అఖిల్, సొహెల్ అభిజిత్ ను నామినేట్ చేశారు. మెహబూబ్ డేంజర్ జోన్ లో ఉన్నప్పటికీ అందరి దృష్టి అభి పైనే . లాస్య, హారిక సపోర్టు ఎలాగా ఉంది కానీ మిగిలిన వారు అతనికి సపోర్ట్ చేయడం లేదు. ఇక ఫిజికల్ టాస్కుల్లో కొంచెం బలహీనంగా ఉండే అభిజిత్ ను ఈ వారం కచ్చితంగా టార్గెట్ చేస్తారు.
ఈ వారం జరగబోయే టాస్కులు చాలా కీలకం కానున్నాయి. అభి కి ఫాలోయింగ్ బాగానే ఉంది కానీ కొన్నిసార్లు ఎలిమినేషన్ నమ్మశక్యంగా లేదు అన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇక అరియానా. మెహబూబ్ తో పాటుగా స్ట్రాంగ్ కంటెస్టెంట్లు కాబట్టి ఎప్పుడు ఏదైనా జరగొచ్చు. మరి నాగార్జున వచ్చేవారం ఎవరికి ఎలాంటి షాక్ ఇస్తారో వేచి చూడాలి.