ఇంటి ముందు వేసే ముగ్గు లో భాగంగా ముగ్గు నాలుగు వైపులా గీసే రెండేసి అడ్డగీతలు,వాటి మధ్యలో వేసే చిన్న గీతాలు ఖచ్చితం గా గీయాలి. అలా గీయడం వలన ఇంట్లో కి ఎలాంటి దుష్టశక్తులు రాకుండా రక్షణ కలుగుతుంది. ఇలా వేయడం అనేది లక్ష్మీ ( Lakshmi ) ప్రదం కూడా. కొందరు రెండు గీతాలు గీసి వదిలేస్తుంటారు. అలా ముగ్గులు వేయకూడదు.
house: ముగ్గు లో యంత్ర,తంత్ర
ముగ్గు వేసి దానికి నాలుగు పక్కల రెండేసి అడ్డగీతలు వాటి మధ్య చిన్న గీతాల తో ముగ్గు వేసి ఉంటే అక్కడ ఒక శుభకార్యం లేదా , ఏదైనా మంగళకరమైన పనులు జరుగుతున్నాయని అర్ధం. ఏ దేవతపూజ చేస్తున్నా దైవాన్నిపెట్టె పీట మీద మధ్యలో చిన్న ముగ్గు వేసి నాలుగు వైపులా రెండేసి గీతలను కచ్చితం గా గీయాలి.నక్షత్రం ఆకారం వచ్చేలా గీతలతో వేసిన ముగ్గు వలన భూత, ప్రేత, పిశాచాలను ఆ చుట్టూ పక్కలకు కూడా రాకుండా ఉంటాయి. మనం వేసే పద్మాల ముగ్గు , చుక్కల ముగ్గులలో కూడా తెలియని రహస్యాలు దాగి ఉన్నాయి. అవి కేవలం గీతలే కాదు.. యంత్రాలు అని మరువ కూడ.ముగ్గు లో యంత్ర,తంత్ర శాస్త్ర రహస్యాలుదాగి ఉండడం వలన మనకు చెడు చేసే దుష్టశక్తులను దూరం గా ఉంచుతాయి. అందుకే ఏ ముగ్గునైనా కూడా తొక్కకూడదు.
తులసి మొక్క
మన ఇంటిలో ఉండే తులసి మొక్క దగ్గర అష్టదళపద్మం వేసి ,శంకు ,చక్రాలు ,స్వస్తిక్ ,కుంభేర ముగ్గు లాంటివి వేసుకుని దీపారాధాన చేసుకోవాలి. యజ్ఞయాగాదులు చేసేటప్పుడు యజ్ఞగుండం మీద నాలుగు గీతలతో కూడిన ముగ్గువేయాలి. ఏ దైవకార్యలలో వేసే ముగ్గులు నాలుగు గీతలతో కూడుకున్న ముగ్గులు మాత్రమే వేయాలి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?