Risks: పితృ శాపం లేదాదోషం  ఉంటే ఈ కష్ట ,నష్టాలు తప్పవు …ఈ క్షేత్రమే మిమ్మల్ని కాపాడుతుంది!!

Share

Risks: పితృకార్యాలు చేసిన వారికే
దేవ కార్యాలు చేయడం కంటే కూడా  పితృకార్యాలు చేయడం చాలా  ముఖ్యం. పితృకర్మలు, పితృతర్పణలు చేసేవారికి    దేవతల అనుగ్రహం కూడా దక్కుతుంది.   అలా అని   దేవత పూజలు (Godess Pray) చేయవద్దని కాదు  అని గమనించాలి. పితృకార్యాలు చేయకుండా  ఎన్ని పూజలు, స్తోత్రాలు, జపాలు చేసినా ఫలితం దక్కదు.  పితృకార్యాలు చేసిన వారికే అవన్నీ దక్కుతాయి. మనస్సులో కోరికలు తీరడానికి , వంశం వృద్ధి అవడానికి , సంతాన క్షేమానికి పితృకార్యాలు తప్పనిసరిగా చేయాలి.    తల్లితండ్రుల (Parents) ఋణం తీర్చుకోవాలి. వీటి కోసమే మాసికాలు, ఆబ్దీకాలు చేయాలని చెప్పబడింది.  మరణించిన సంవత్సరం లోపు ప్రతీ నెలా ఆ తిథి రోజున వారికి చేసే  కార్యక్రమాన్నే మాసికం అంటారు.

Risks:  పితృ దోషం అంటే ఒక శాపం

ప్రతి సంవత్సరం ఏ తిథి రోజున చనిపోతే ఆ తిథి  రోజు జరిపించే కార్యక్రమమే ఆబ్దీకం. అంటే చనిపోయిన సంవత్సరం  నెలకోసారి, అదేవిధం సంవత్సరం గడిచిన తర్వాత నుండి సంవత్సరానికి ఒకసారి చేయవలిసిన కర్మలను శాస్త్రియంగా జరిపించి, మంత్రాలతో ఆవాహన చేసుకోవడం తో పాటు  వివిధ దానాలు చేసి సత్కరించటం మన ముఖ్యమైన పని.  పితృ దోషం అంటే ఒక శాపం గా చెప్పబడింది.   జాతక చక్రం లో ఇటువంటి దోషాలనుతెలుసుకునే అవకాశం ఉంది. పితృదోషాల వలన అనేక రకాలైన సమస్యల తో కష్టపడాలిసి ఉంటుంది.ఉదాహరణకి ముఖ్యమైన పనులు తలపెడితే ముందే ఆటంకాలు , ఆ పనులు సరిగా జరగకపోవడం,   గౌరవ ప్రతిష్ఠలకు భంగం ఏర్పడడం, కుటుంబం లో స్త్రీ కి చిన్న వయసు లో వైధవ్యం కలగడం, సంతానం లేకపోవడం , ఒకవేళ సంతానం ఉన్న, ఆ సంతానం చిన్న తనం లొనే మరణించడం, లేదంటేపుత్ర  సంతానం లేక పోవడం  పిల్లలకు ఎప్పుడు ఏదో రకమైన అనారోగ్యం (Unhealthy) కలుగుతుండడం. అస్తమానం   వాహన ప్రమాదాలుజరుగుతుండడం,వ్యాపార. ఉద్యొగ నష్టాలు, పెద్దలు ఇచ్చిన  ఆస్తి  కలిసి రాకపోవడం, పాము కాటుతో  మరణించడం వంటివి సంభవించవచ్చు.

 అకాల మృత్యువు తో

ఇక్కడ గుర్తు పెట్టుకోవాలిసిన ఇంకో విషయం ఏమిటి అంటే , పితృ శాపాలు ఉన్న సరే గత జన్మలో వేరే వేరే పుణ్య కార్యాలుచేసి ఉండడం వలన ఈ జన్మలో అపార మైన డబ్బు, పరపతి , హోదా వంటివి కలుగుతాయి. అయితే  వీళ్ళ ఆస్తి అనుభవించాల్సిన వారసులు మాత్రం   ఆకలమృత్యువు తో చనిపోయి ,వీళ్ళ పెద్దలు పైకి చెప్పుకోలేని బాధలు అనుభవిస్తారు…
ఒకవేళ జాతకం లో పితృ దోషం ఉంటే  “నారాయణ నాగబలి” అనే పూజను చేపించడం వలన పితృ శాపాలు పోయి సుఖ సంతోషాలు కలుగుతాయి.  పితృ శాప… నివారణకు నారాయణ నాగబలి… అనే పూజ  త్రయంబకేశ్వరం  లో చేస్తారు.


Share

Related posts

ఎనిమిదో శ్వేతపత్రం విడుదల

sarath

రిటైర్ అయినా కూడా కేసిఆర్ కి హెల్ప్ చేసిన నరసింహన్..!!

sekhar

Beauty: అమ్మయిలు  అందం  మీద మాత్రమే కాదు కనబడని  వీటిమీద కూడా కాస్త దృష్టి పెట్టండి!!

siddhu