ప్రకృతి మనకు ప్రసాదించిన వరాలలో ఉసిరికాయ ఒకటి.చలికాలంలో మాత్రమే దొరికే ఉసిరికాయల ను మనం తప్పకుండా ఉపయోగించుకోవాలి.ఎందుకంటే ఆరోగ్యానికి ఉసిరికాయలు ఎంతో మేలుచేస్తాయి. వీటిలో విటమిన్ C, యాంటీఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్ పుష్కలంగా ఉంటాయి. ఉసిరికాయల్ని రోజూ తినడం వలన రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది.
చలి కాలంలో సహజంగానే జీర్ణ ప్రక్రియ మందగిస్తుంది. అలాంటప్పుడు నిత్యం ఉసిరికాయల రసాన్ని తాగితే తిన్న ఆహారం బాగా జీర్ణమవుతుంది.ఉసిరిని జ్యూస్‌లా చేసుకొని… కప్పు నీటిలో కలిపి… కొద్దిగా మిరియాల పొడి వేసుకొని తాగితే రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది. ఉసిరి జ్యూస్‌ని ఒకేసారి ఎక్కువ మొత్తం తీసి, ఫ్రిజ్‌లో నిల్వ ఉంచి రోజుకు మూడు లేదా నాలుగు సార్లుఓ టీ స్పూన్ చొప్పున జ్యూస్‌ని నేరుగా కానీ, నీటిలో కలిపిగానీ తాగితే ఆరోగ్యం ఎంతో మెరుగ్గా ఉంటుంది.
లైంగిక సామర్థ్యాన్ని పెంపొందించడంలో ఉసిరి చాల బాగా పనిచేస్తుంది. అలాగే కడుపులో రసాయనాలను సమతుల్యం చేస్తుంది. శరీరంలో వేడిని తగ్గించి చల్ల బరుస్తుంది. కాలేయ సామర్థ్యాన్నిపెంచడం తో పాటు జీర్ణ సంబంధ సమస్యలనుపోగొడుతుంది. మెదడు పనితీరును మెరుగుపరిచి జ్ఞాపకశక్తిని పెరిగేలా చేస్తుంది. ఇందులో ఉండే విటమిన్ సి వలన శరీరం ఎండ వేడిని తట్టుకోగలుగుతుంది.
చుండ్రు సమస్య నివారించడానికి, జుట్టు నల్లగా పట్టుకుచ్చులాగా ఉండేందుకు కూడా ఉసిరి ఎంతగానో ఉపయోగపడుతుంది.గుండె సంబంధిత సమస్యలు రాకుండా చేయడం తో పాటు, మధుమేహం రాకుండా కూడా నివారిస్తుంది. చలి కాలం లో వచ్చే చర్మ సమస్యలు తగ్గాలంటే ఉసిరికాయ రసాన్ని నిత్యం తీసుకోవాలి . ఇలా తీసుకోవడం వలన న జుట్టు సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయి.
షుగరు ఉన్నవారు ఉసిరికాయలను తినడం ద్వారా కావల్సినంత క్రోమియం లభిస్తుంది. దీంతో ఇన్సులిన్ చురుగ్గాపనిచేసి షుగర్ లెవల్స్ తగ్గుతాయి.ఉసిరిలో అనేక పోషక విలువలతోబాటు ఔషధ గుణలు ఉండడం వలన దీనిని అమృత ఫలం అనికూడా అంటారు.