అనారోగ్యంతో బాధపడుతున్న పిల్లలకి సాయం చేయడంలో మహేష్ బాబు ఎప్పుడూ ముందు ఉంటారు. అస్సలు పబ్లిసిటీ లేకుండా ఎంతో సహాయం చేస్తున్న రియల్ హీరో మహేష్ బాబు. ఇప్పుడు కూడా ఇలానే ఆయన. తాజాగా మరో పాపకు కూడా ప్రాణదానం చేశారు. పల్మనరీ వాల్వ్ డిసార్డర్ తో బాధపడుతున్న, డింపుల్ అనే పాపకు ప్రాణదానం చేశారు. ఇలా తను చెయ్యగలిగిన సహాయం చేస్తూ పేద కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు.. అనారోగ్యంతో బాధ పడుతున్నఎంతోమంది చిన్నారులను బ్రతికించి వారికి కొత్త జీవితాన్ని ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కొన్ని హాస్పిటల్స్‌తో కూడా టై అప్ అయ్యారు, వాటిలో ఒకటే ఆంధ్ర హాస్పిటల్స్.
చిన్నారికి సర్జరీ చేసిన ఆంధ్ర హాస్పిటల్ వైద్యులు పాప ఆరోగ్యం ఇంతకముందు కన్నా మెరుగుగా ఉందని త్వరలోనే చిన్నారిని డిశ్చార్జ్ చేస్తామని తెలిపారు. చిన్నారి తల్లిదండ్రులు మహేష్ బాబుకు మరియు ఆయన టీమ్‌కు, వైద్యులకు తమ కృతఙ్ఞతలు తెలిపారు. మరోవైపు నమ్రత కూడా తన టీమ్‌ని అభినందిస్తూ ఆంధ్రా హాస్పిటల్స్ కు కృతజ్ఞతలు తెలిపింది.