Nani : నాని Nani కి జంటగా నటించిన అమ్మాయి స్టార్ హీరోయిన్ గా సెటలవు తుందనడానికి మళ్ళీ ఎగ్జాంపుల్ గా గ్యాంగ్ లీడర్ హీరోయిన్ తయారైంది. విక్రం కుమార్ దర్శకత్వంలో నాని హీరోగా వచ్చిన సినిమా గ్యాంగ్ లీడర్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది. ఇక ఇదే సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయింది ప్రయాంక అరుల్ మోహన్. ఫస్ట్ లుక్ లోనే టాలీవుడ్ మేకర్స్ ని బాగా ఆకట్టుకుంది. పోస్టర్స్ లో ప్రియాంక అరుల్ ని చూసిన టాలీవుడ్ హీరోలు .. దర్శక నిర్మాతలు బాగానే ఫోకస్ పెట్టారు. ఇక గ్యాంగ్ లీడర్ సినిమా ఈవెంట్స్ లో ప్రమోషన్స్ లో నాని .. ప్రియాంక టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అవుతుందని నమ్మకంగా చెప్పాడు.
నాని మాట నిజమైంది. డెబ్యూ సినిమా గ్యాంగ్ లీడర్ అంత హిట్ కాకపోయినా ప్రియాంక అరుల్ కి మాత్రం క్రేజీ ఆఫర్ వస్తున్నాయి. ఇప్పటికే యంగ్ హీరో శర్వానంద్ నటిస్తున్న శ్రీకారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమా నుంచి వచ్చిన భలేగుంది బాలా సాంగ్ ట్రెండింగ్ లో నిలిచింది. అంతేకాదు ఈ సాంగ్ తో ఇంకా దగ్గరైంది. ప్రస్తుతం ప్రియాంక అరుల్ చేతికి క్రేజీ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. శర్వానంద్ తో ప్రియాంక అరుల్ నటించిన ‘శ్రీకారం’ మార్చి 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
Nani : ధనుశ్ కూడా తన నెక్స్ట్ సినిమాకి ప్రియాంక అరుల్ పేరు పరిశీలిస్తున్నాడట.
అలాగే కోలీవుడ్ లో క్రేజీ హీరో శివకార్తికేయన్ తో ప్రియాంక నటించిన తమిళ సినిమా ‘డాక్టర్’ ఏప్రిల్ లో రిలీజ్ కానుంది. ఈ రెండు సినిమాల మీద ప్రియాంక అరుల్ చాలా నమ్మకాలు పెట్టుకుంది. ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ అయితే ఇక టాలీవుడ్ లో సెటిల్ అయినట్టే అన్న మాట వినిపిస్తోంది. కాగా కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తో నటించే ఛాన్స్ కొట్టేసింది. సన్ పిక్చర్స్ బ్యానర్ లో క్రేజీ డైరెక్టర్ పాండిరాజ్ తెరకెక్కించనున్న సినిమాలో ప్రియాంక హీరోయిన్ గా నటించబోతుండగా వచ్చేనెలలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఇక ధనుశ్ కూడా తన నెక్స్ట్ సినిమాకి ప్రియాంక అరుల్ పేరు పరిశీలిస్తున్నాడట.