NewsOrbit
న్యూస్

Vizag Steel : పోరాడితే పోయేదేమీ లేదు… ఉక్కు సంకెళ్లు తప్ప!! ఇది అసలు కథ

AP Politics : Secret game by BJP

Vizag Steel  : ఒక సమస్యకు పరిష్కారం లేనప్పుడు ప్రత్యామ్నాయం లేనప్పుడు దానిని పరిష్కరించడం కష్టతరమవుతుంది. అదే సమస్యకు పరిష్కారం కళ్ళముందే కనిపిస్తున్నా ప్రత్యామ్నాయం పక్కనే ఉన్నా పరిష్కారం కావడం లేదంటే… లోపం సమస్యలేదు సమస్యను పరిష్కరించే ఆలోచనలో ఉందని అర్థం చేసుకోవాలి. విశాఖ ఉక్కుVizag Steel  ప్రైవేటీకరణ విషయంలోనూ కేంద్రం వైఖరి ఇదే తెలియజేస్తోంది. విశాఖ ఉక్కు కు సొంతంగా ఇనుప ఖనిజం వెలికితీసే గనులు లేకపోవడంతో, భారీగా నష్టాలు వస్తున్నాయని ఈ కారణంతోనే ఏడాదికి 5 వేల కోట్లకు పైగా నష్టం తెచ్చిపెడుతున్నాయి పరిశ్రమను ప్రైవేటీకరణ చేస్తామని కేంద్రం చెబుతోంది. ప్రభుత్వ రంగ సంస్థల నుంచి భారీగా పెట్టుబడుల ఉపసంహరణకు మార్గాలు వెతుకుతున్న కేంద్రం సబ్ కమిటీ విశాఖ ఉక్కు సైతం తమ ఖాతాలో చేర్చింది. ఇప్పటికే కేంద్ర సబ్ కమిటీ విశాఖ ఉక్కు ఎలా ప్రైవేటీకరణ చేయాలి అనే అంశం మీద సర్వే నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందించింది. దీనిమీద అన్ని విధాల రంగం సిద్ధం చేసుకుని ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టాలని చూస్తున్న విశాఖ ఉక్కు పరిశ్రమ విషయంలో ఇక మిగిలింది ప్రజా ఉద్యమమే. సుమారు 80 వేల కుటుంబాలకు ఊతమిస్తున్న విశాఖ ఉక్కు వల్ల ఎందరో రోడ్డున పడే అవకాశం లేకపోలేదు. ఉద్యోగ భద్రత పూర్తిగా కోల్పోయి, విశాఖ కళ హీనంగా మారుతుంది.

this is actual story behind vizag steel
this is actual story behind vizag steel

కేంద్రం చెబుతున్నది ఇది!

నష్టాలు వచ్చే ప్రభుత్వ రంగ సంస్థల నుంచి పెట్టుబడులు ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. దీనిలో భాగంగా విశాఖ ఉక్కు సైతం 2017 18 సంవత్సరంలో 1319 కోట్లు, 2019 20 సంవత్సరం లో 3910 కోట్ల మేర నష్టం వచ్చిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దీంతో విశాఖ ఉక్కు లో వంద శాతం పెట్టుబడులు ఉపసంహరించుకోవచ్చు అని ఇటీవల ఆర్థిక శాఖ జనవరిలోనే ఒక నివేదిక తయారు చేసింది దానిని కేబినెట్ సబ్ కమిటీ ఆమోదించింది. అసలు విశాఖ ఉక్కు ఎందుకు నష్టాల్లోకి వెళ్లింది అనేది చూస్తే…

** ఏదైనా ఒక పరిశ్రమ ముఖ్యంగా ఖనిజాల కు సంబంధించిన పరిశ్రమలు ప్రారంభిస్తే దానికి సొంత గనులు ఉండడం తప్పనిసరి. దీనినే క్యాప్టివ్ మైన్స్ అంటారు. విశాఖ ఉక్కు పరిశ్రమ కు క్యాప్టివ్ మైన్స్ లేవు. దింతో ఎన్ ఎం డీ సి నుంచి ఐరన్ ఓర్ కొనుక్కునే వారు. దేశవ్యాప్తంగా ఉన్న ఉక్కు పరిశ్రమ మొత్తం వ్యవహారాలు ఎన్ఎండిసి పరిధిలోనే జరుగుతాయి. విశాఖ ఉక్కు మొదట్లో ఐరన్ ఓర్ సరఫరా చేసిన ఎన్ఎండిసి తనకు ఎంత మొత్తంలో ఐరన్ ఓర్ దొరుకుతుందో అంత మొత్తం ధరకే విశాఖకు దానిని అందించేది.

** అయితే తర్వాత కేంద్ర ప్రభుత్వం కేంద్ర ఈ సంస్థ అయిన ఎన్ఎండిసి లో 31 శాతం వాటాను ప్రైవేటుకు అమ్మేసింది. ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిన ఎన్ఎండిసి తనకు వచ్చిన సేమ్ ధరకు విశాఖ ఉక్కు పరిశ్రమ కు ఐరన్ను అందించడానికి అభ్యంతరం తెలిపింది. దీంతో ఎన్ఎండిసి ధర పెంచింది. అప్పటి నుంచి విశాఖ ఉక్కు కష్టాలు మొదలయ్యాయి. ప్రతి టన్ను తయారీకి సుమారు ఐదు వేల రూపాయల పైగా నష్టం రావడం ప్రారంభమైంది. దీంతో అప్పటివరకు లాభాల్లో నడిచిన విశాఖ ఉక్కు పరిశ్రమ ఒక్కసారిగా నష్టాలను చవి చూడటం మొదలు పెట్టింది.

లాభాల్లోకి తేవడమే మార్గం!

విశాఖ ఉక్కు పరిశ్రమను లాభాల్లోకి తీసుకువస్తే ప్రైవేటీకరణ చేయడానికి అవకాశం ఉండదు. అద్భుతమైన లాభాలను అది తీసుకొస్తుంది. అయితే విశాఖ ఉక్కు ను ఎలా లాభాల్లోకి తీసుకురావాలని దాని మీద మాత్రమే కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలి గాని ప్రైవేటు రంగ సంస్థలకు ఆయన చివరకు మిగిలేది ఏమీ ఉండదు.

** విశాఖ ఉక్కు కు కేంద్ర ప్రభుత్వం కనీస వాటాగా క్యాప్టివ్ మైన్స్ ను ఇవ్వాలి. ఉత్పత్తి మొత్తానికి సరిపడా ఇనుము అందించలేక పోయినా కనీసం నష్టాలను తగ్గించుకునేందుకు అవసరమైన చేయూతను కేటాయించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం అందించవచ్చు.

** ఇటీవల ఎన్ఎండిసి తోపాటు సెయిల్ సంస్థ సంయుక్తంగా గోవాలో 200 ఏళ్లకు సరిపడా ఇనుప ఖనిజా నిక్షేపాలను గుర్తించాయి. వారి ఉత్పత్తికి,డిమాండ్కు తగ్గ ఖనిజ నిక్షేపాలు గోవాలో బయటపడ్డాయి. దీనిలో కనీసం కొంచెం భాగం విశాఖ ఉక్కు కేటాయించిన ప్రస్తుతం విశాఖ ఉక్కు కష్టాలు పూర్తిగా తగ్గుముఖం పడతాయి.

** క్యాప్టివ్ మైన్స్ ఉంటే తన్ను ముడి ఖనిజం 1500కు దొరికితే, అదే బయట కొనుగోలు చేస్తే కనుక ఏడు వేల పైగా పడుతోంది. అంటే తన్నుకు సుమారు ఐదు వేల పైగానే నష్టం వస్తుందన్నమాట.

** ఇటీవల కేంద్ర ప్రభుత్వం పలు సంస్థలను విలీనం చేసి ఒకే గొడుగు కిందకు తీసుకు వస్తోంది. దానిలో భాగంగానే కేంద్ర బ్యాంకుల అన్నింటిని, అలాగే పలు ఆయిల్ కంపెనీలను విలీనం చేసింది. ఇప్పుడు దేశంలో ఉన్న ఉక్కు పరిశ్రమ అన్నిటినీ ఒకే గొడుగు కిందకు ఎన్టిపిసి పరిధిలో సెయిల్ ఆధ్వర్యంలో కి తీసుకు వచ్చి అన్నిటికీ తగినంత క్యాప్టివ్ మైన్స్ ను కనుక కేంద్రం కేటాయిస్తే చాలా వరకూ ఏ కేంద్ర ప్రభుత్వ సంస్థ ప్రైవేటీకరణ ఇవ్వడానికి అవకాశం ఉండదు. దీంతో పాటు పుష్కలంగా లాభాలు సైతం వస్తాయి. ఉక్కును విదేశాలకు ఎగుమతి చేయడంలో భారత దేశం ముందంజలోనే ఉంది. ఎగుమతులు ఎక్కువ కావడంతో అనే ప్రైవేటు వ్యక్తుల చూపు ఇప్పుడు ఉక్కు పరిశ్రమ మీద పడింది. దీనికి ప్రత్యామ్నాయం ఆలోచించకుండా కేంద్ర ప్రభుత్వం కేవలం ప్రైవేటీకరణ మంత్రంతో ప్రైవేటు వ్యక్తులను ఆహ్వానిస్తే ప్రజల ఉద్యోగ భద్రత కు హామీ ఉండదు.

 

 

 

author avatar
Comrade CHE

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!