Females: సుమంగళి స్త్రీలకు ఎప్పుడు ఒక ప్రత్యేకత ఉంటుంది కాబట్టి వారు నుదుటిన కుంకుమ పెట్టుకోకుండా ఎప్పుడూ ఉండకూడదు.అలాగే చెవులకు దిద్దులు ,మెట్టెలు కూడా కచ్చితం గా ఉండాలి. అలాగే ఈ మధ్య కాలం లో తాళి బొట్టు తీసి పక్కన పెట్టేస్తున్నారు. అలా చేయడం చాలా తప్పుఅంటున్నారు ఆధ్యాత్మిక నిపుణులు.
Females: ఎందుకంటే ఒక శుభముహుర్తం లో
ఎందుకంటే ఒక శుభముహుర్తం లో కట్టిన తాళి ఎప్పుడు పడితే అప్పుడు పక్కన పెట్టేసి కావలసినప్పుడు వేసుకుంటే అప్పుడు మంచి ముహూర్తం అనేది లేక అనేక కష్టాలు ఎదురూరవుతాయి. మాంగళ్య దేవత అనుగ్రహం లేకపోతె భర్తకు ఆయుష్ ఎక్కడనుండి వస్తుంది. కాబట్టి ఆ పొరపాటు అస్సలు చేయకూడదు అని సూచిస్తున్నారు. అలాగే జుట్టు విరబోసుకొని, రెండు చేతులతో తల గోక్కోవడం వంటివి కూడా చేయకూడదు. జుట్టు కొసలు ముడివేయకుండా ఒక పిన్ని పెట్టి విరపోసుకుని గుడి కి వెళ్లడం ఇంటిలో తిరగడం,పూజ ,వంట వంటివి చేయడం మహా దోషాలకు కారణం అవుతుంది అని మరువకండి.స్త్రీ అయిన దానికి కానిదానికీ కంట నీరు పెట్టుకుంటూ ఉంటే పుట్టింటికి, మెట్టినింటికి కోరి దారిద్య్రం తీసుకు వచ్చినట్టే అని మరువకండి.
ఒక ఆకులో వడ్డించిన పదార్ధాన్ని తీసి వేరొక ఆకులో వడ్డించడం లాంటివి చేయకూడదు.గర్భవతులు స్త్రీలు కొబ్బరికాయ పగులకొట్ట కూడదు.గర్భిణి స్త్రీ నిమ్మకాయను కోసి దీపము వెలిగించకూడదు.ఆడవారు ఎప్పుడూ నేరుగా గుమ్మడికాయను పగుల కొట్టకూడదు, ఎందుకంటే ఇది గర్భ శోకాన్ని కలిగిస్తుంది.ఇంటికి ఎవరైనా సుమంగళి స్త్రీ వచ్చినప్పుడు పసుపు, కుంకుమ, తాంబూలాదులు తప్పక ఇచ్చి వారిని గౌరవించాలి.ఉదయాన్నే లేచి, పనిమనిషిఉన్నాకూడా మీరే స్వయంగా ఇంటి ముందు కళ్లపు వేసి , ముగ్గు వేయడం వలన లక్ష్మి కటాక్షము పొందగలుగుతారు.చేతితో అన్నం, ఉప్పు, కూరలు వంటి పదార్ధాలు ఎప్పుడు వడ్డించకూడదు. స్పూన్స్ ,గరిటలు మాత్రమే వాడాలి.ఏదైనా వస్తువు ఇంట్లో లేకపోతే లేదు అనే మాట రాకుండా తీసుకురావాలి లేక నిండుకుంది అని మాత్రమే అనాలి. లేదు లేదు అంటుంటే మనకు అన్నిలేకుండా అవమని అశ్వినిదేవతలు మరియు తథాస్తు దేవతలు అంటారట. అందుకే మంచి మాటలు మాట్లాడాలి.