ADHD : మీ పిల్లలకు ADHD లక్షణాలు   ఉన్నాయేమో ఈ విధం గా తెలుసుకోండి…  ఇది గుర్తించడం  లో  అస్సలు  ఆలస్యం  చేయకూడదు!!

Share

ADHD అంటే
మనుషులు  పర్యావరణానికి హాని  కలిగించే  కొద్దీ.. కొత్త,కొత్త  రోగాలు బయటకు వస్తున్నాయి. శారీరక రోగాల కంటే కూడా  మానసిక రోగాలు  ఈ మధ్య కాలం లో ఎక్కువయ్యాయి. దాని వల్ల చాలామంది ఎన్నో  ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. అలాంటి మానసిక రోగాలలో  అతి  ప్రమాదకరమైనది  ADHD గా చెప్పబడుతుంది. ADHD అంటే   అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్. ఈ సమస్య ఎక్కువగా పిల్లల్లో కనిపిస్తుంటుంది. అయితే ఈమధ్య కాలం లో  పెద్దల్లోనూ ఈ సమస్య  బయటపడుతుంది. ఈ కారణం గా  ప్రతి ఒక్కరు ఈ జబ్బు  గురించి తెలుసుకోవాలిసిందే.ఒక మనిషి ఎక్కువ  నిరాశలో ఉన్నా, అధిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నా   ADHD బారిన పడే  ప్రమాదం ఉంటుంది. చిన్నతనం లోనే  అధిక  ఒత్తిడికివలన లేదా , వారసత్వ జీన్స్ ద్వారా కూడా పిల్లల్లకు ఈ వ్యాధి వచ్చే  ప్రమాదం ఉంది.

ADHD : ఒత్తిడిని ఎదురుకుంటూ

గర్భిణిగా ఉన్నప్పుడు.. తల్లి సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం,మద్యం సేవించడం, పొగ తాగడం లేదా ఇతర డ్రగ్స్ లాంటివివంటివి   వాడడం వలన అవి పుట్టబోయే బిడ్డ మీద ప్రభావం చూపిస్తాయి.  దీని ప్రభావం వలన  పుట్టిన పిల్లలకు ఈ సమస్య  వచ్చే అవకాశం ఉంది. పెద్దలు కూడా ఎప్పుడూ ఒత్తిడిని ఎదురుకుంటూ ఉండడం వలన   ఈ వ్యాధి బారిన పడే ప్రమాదం ఉంది.
ADHD లక్షణాలు  ఈ విధంగా ఉంటాయి. ఈ జబ్బు ఉన్న  పిల్లలు కానీ  పెద్దలు అయినా సరే.. ఎక్కువ సేపు  ఒకే చోటు కూర్చొని ఉండలేకపోవడం తో పాటు ఎప్పుడూ పరధ్యానం గా ఉంటారు. సెకన్ల వ్యవధిలోనే  వారి  ప్రవర్తన మారిపోతుంటుంది. ఏ పనీ చేయలేకపోవడం, ఎదుటివాళ్లు మాట్లాడేది వినకపోవడం తో పాటు ప్రతి విషయానికి గందరగోళానికి గురవుతుంటారు. అయితే.. ఈ వ్యాధిలో ఒకటి హైపర్ యాక్టివ్, రెండోది ఇంపల్సివిటీ, మూడోది కేర్ లెస్ నెస్ అనే   మూడు రకాలుగా ఉంటుంది.హైపర్ యాక్టివ్  గా ఉండేవారు ప్రతి విషయానికి  అతిగా స్పందించడం తో పాటు ఎక్కువగా రియాక్ట్ అవడం, ఆవేశ  పడిపోవడం, తొందర పాటుకు గురికావడం   వంటివి జరుగుతుంటాయి.    ఇంపల్సివిటీ  ఉన్నవారు అయితే  రిజర్వ్ డ్ గా  ఉండడం తో పాటు యాక్టివ్ గా లేకపోవడం  వంటి లక్షణాలు  కనిపిస్తాయి.

సమస్య రాకముందే జాగ్రత్త

కేర్ లెస్ నెస్  లక్షణం ఉన్నవారు అయితే  దేన్నీ పట్టించుకోకపోవడం తో పాటు  ఎదుటి వారు చెప్పేది అస్సలు  వినకపోవడం  వంటివి చేస్తుంటారు .దీనికి  పరిష్కారం గా   రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి  ప్రవర్తనను మార్చే కౌన్సెలింగ్ ఇవ్వడం లేదా మెడిసిన్ ద్వారా తగ్గేలా చేయడం. ప్రస్తుతం ఈరెండు  ట్రీట్మెంట్స్ అందుబాటులో  ఉన్నాకూడా  పిల్లలకైనా,పెద్దలకైనా  ఈ  సమస్య రాకముందే జాగ్రత్త పడటం  అనేది మంచిది. మరి ముఖ్యంగా పిల్లలను ఎక్కువ ఒత్తిడికి,నిరాశకు గురి  కాకుండా  ఉండేలా చూసుకుంటే అప్పుడు ఈ వ్యాధి  రాకుండా బయటపడవచ్చు. కాబట్టి పిల్లలకు  ఒత్తిడి, నిరాశ దరిచేరకుండా ఉండడానికి ఎలాంటి అడుగులు వేయాలో తెలుసుకుని తల్లిదండ్రులు  జాగ్రత్త తీసుకోవాలి.


Share

Related posts

CM KCR: నిరుద్యోగులకు గుడ్ న్యూస్..! ఉద్యోగాల భర్తీపై కీలక నిర్ణయం తీసుకున్న సీఎం కేసిఆర్..!!

somaraju sharma

ఊకో కాక.. రాహుల్ సిప్లిగంజ్ షోరూంలో అలీ రెజా షాపింగ్?

Varun G

బాబు కి తనకి తేడా చూపించిన జగన్…. ఏపీ లో కులాల కార్పోరేషన్ లిస్టు ఇదిగో..!

arun kanna