NewsOrbit
Featured న్యూస్

ఇదిగో…ఇదే కెటిఆర్ బలం ! లోకేష్ బలహీనత ! టోటల్ క్లియర్ !!

ఆ ఇద్దరిలో ఒకరు ముఖ్యమంత్రి తనయుడు! ప్రస్తుత మంత్రి! తమ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్. మరొకరు మాజీ ముఖ్యమంత్రి కుమారుడు!

this is strength of ktr lokesh weakness total clear
this is strength of ktr lokesh weakness total clear

మాజీ మంత్రి ….తమ పార్టీలో ఆయన కింగ్ మేకర్! ఇద్దరూ కూడా దాదాపు సమవయస్కులే! కానీ వీరిలో ఒక ఆయన రాకెట్ వేగంతో రాజకీయాల్లో దూసుకుపోతుంటే.. మరొకాయన పప్పు అన్న పేరు తెచ్చుకొన్నాడు. ఇంత చెప్పాక మీకు వారెవరో అర్థమై ఉంటుంది! మొదట ఆయన కేటీఆర్.. రెండో ఆయన నారా లోకేష్ అని ప్రత్యేకంగా విడమర్చి చెప్పనక్కర్లేదు. కానీ రాజకీయ వర్గాల్లో ఈ ఇద్దరిని పోలుస్తూ అనేక విశ్లేషణలు సాగుతున్నాయి. ఎందుకంటే తెలంగాణలో కెసిఆర్ గానీ ,ఏపీలో చంద్రబాబు గానీ రిటైర్మెంట్ దశలో ఉన్నారు.

అలాంటి పరిస్థితుల్లో సహజంగానే వారికి రాజకీయ వారసులైన కుమారులు ఉంటే తదుపరి అవకాశం వారికి వస్తుంది. ఇటు తెలంగాణ రాష్ట్ర సమితి గానీ, అటు తెలుగుదేశం పార్టీ గానీ ప్రాంతీయ పార్టీలైన౦దున ముందుగా అధినేతల కుమారులకే పార్టీ పగ్గాలు లభిస్తాయి. అవకాశం వస్తే వాళ్లే ముఖ్యమంత్రులు కూడా అవుతారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ లోకేష్ ల బలాబలాలను రాజకీయ పరిశీలకులు బేరీజు వేస్తున్నారు. తెలంగాణలో కేటీఆర్ ఇప్పటికే తన స్టామినాను నిరూపించుకున్నారు. మంత్రిగా ఆయన సక్సెస్ అయ్యారు.

ప్రజాక్షేత్రంలో కూడా నిలబడి ఎమ్మెల్యే గెలుస్తూ వస్తున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ ఆ పదవికి కూడా న్యాయం చేస్తున్నారు. ఇక ఏపీలో నారా లోకేష్ మంత్రిగా పనిచేసినా పెద్దగా మార్కులు పడలేదు.పైగా చాలా అవినీతి ఆరోపణలు వచ్చాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరిలో నిలబడి ఓడిపోయారు. టిడిపిని కూడా ఆయన సరిగ్గా లాక్కు రాలేకపోతున్నారు. కరోనాకు భయపడి తండ్రి చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో కూర్చొని జూమ్ కాన్ఫరెన్స్ తో పార్టీని నడిపిస్తుంటే లోకేష్ కూడా ఆయన దగ్గరే ఉంటూ ట్వీట్లతో గడి పేస్తున్నాడు.

ఆపద సమయంలో పార్టీ వారికి ప్రజలకు కూడా లోకేష్ అందుబాటులో లేకపోవడం పెద్ద మైనస్ పాయింట్.ఒక్క మాటలో చెప్పాలంటే కేటీఆర్ తండ్రిని మించిన తనయుడు అనిపించుకుంటుంటే లోకేష్ ఇప్పటికీ తండ్రి చాటు బిడ్డ గానే మిగిలిపోయాడు. కేటీఆర్కు సమ్మోహన శక్తి ఉంటే లోకేష్కు స్వయంప్రకాశ శక్తి కూడా లేదని తేలిపోయింది. ఇప్పటికైనా లోకేష్ తన వ్యవహారశైలిని, పర్ఫామెన్సు ని మెరుగుపరుచుకోకుంటే ఆయన రాజకీయంగా పైకి ఎదిగే అవకాశాలు ఏమాత్రం ఉండవని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.కేటీఆర్ను ఆదర్శంగా తీసుకుని లోకేషు నేర్చుకోవాల్సింది ఎంతో ఉంటుందంటున్నారు. పెద్దల మాట పెరుగన్నం మూట లోకేష్ బాబూ! ఎందుకు చెబుతున్నారో అర్థం చేసుకో !

author avatar
Yandamuri

Related posts

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju