అనిల్ రావిపూడి కెరీర్ లోనే ఇలా జరగడం ఇదే మొదటిసారి ..?

నందమూరి కళ్యాణ్ రాం తో తీసిన పటాస్ సినిమాతో దర్శకుడిగా మారిన అనిల్ రావిపూడి వరసగా సుప్రీం, రాజా ది గ్రేట్, ఎఫ్ 2, సరిలేరు నీకెవ్వరు సినిమాలని తీసి సూపర్ హిట్స్ అందుకున్నాడు. అంతేకాదు అన్ని సినిమాలు భారీ కమర్షియల్ హిట్స్ ని అందుకున్నాయి. పైగా సినిమా సినిమాకి పెద్ద గ్యాప్ కూడా లేదు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు తో తీసిన సరిలేరు నీకెవ్వరు సినిమాని అతి కొద్ది సమయంలోనే కంప్లీట్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు.

F2 Fun and Frustration Review - tollywood

అయితే మొదటి సారి ఈ సక్సస్ ఫుల్ డైరెక్టర్ కి లాంగ్ గ్యాప్ వచ్చింది. ఈ ఏడాది ప్రారంభంలోనే సరిలేరు నీకెవ్వరు తో వచ్చిన అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమాగా ఎఫ్ 2 సీక్వెల్ ఎఫ్ 3 ని మొదలు పెట్టాల్సింది. అనివార్య కారణాలు.. ఆ తర్వాత కరోనా వల్ల ఎఫ్ 3 కాదు కదా ప్రచారం లో నిలిచిన ఏ ప్రాజెక్ట్ కూడా పట్టాలెక్కలేకపోయింది. చూస్తుండగానే 2020 కంప్లీట్ కావస్తుంది.

రాజా ది గ్రేట్.. ఎఫ్ 2.. సరిలేరు నీకెవ్వరు సినిమాలని ప్రతీ ఏడాది సంక్రాంతి బరిలో దింపి మంచి కమర్షియల్ హిట్ అందుకున్నాడు. కాని ఈ సారి అలా కుదరడం లేదు. అయితే వచ్చే సంక్రాంతికి అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్ 3 మొదలవబోతుందని తాజా సమాచారం.

ఎఫ్ 3 లో వెంకటేష్ .. వరుణ్ తేజ్ లతో పాటు మరో హీరో కూడా నటించబోతున్నట్టు ప్రచారం జరుగుతుంది. కాని ఆ హీరో ఎవరన్నది మాత్రం తేలడం లేదు. ఇక ఈ సినిమా ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన సొంత బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియోషన్స్ లో రూపొందనుంది. చూడాలి మరి ఎఫ్ 3.. ఎఫ్ 2 ని మించి ఏ రేంజ్ హిట్ సాధిస్తుందో.